బిగ్​బాస్​ బ్యూటీని పెళ్లి చేసుకున్న నటుడు పవన్ కల్యాణ్... ఇప్పుడిదే హాట్ టాపిక్​!

అదేంటి టైటిల్ చూసి ఒక్కసారి స్టన్ అయ్యారా? మీరు చదివిన పేరు నిజమే కానీ మనిషి మాత్రం ఆయన కాదు. ఇండస్ట్రీలోనే ఉండే మరో నటుడు పవన్ కల్యాణ్ ఈ పెళ్లి పీటలెక్కింది. బిగ్​​​​ బాస్​​​​ తెలుగు సీజన్​​ 6తో పాపులర్​​ అయిన వారిలో ముద్దుగుమ్మ వాసంతి కృష్ణన్ ఒకరు. పలు సీరియల్స్​లో కూడా నటించి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. తాజాగా ఈమెనే తన ప్రియుడు పవన్​ను పెళ్లి చేసుకున్నారు. ఇంతకీ ఆ మరో నటుడు పవన్ కల్యామ్ ఎవరబ్బా? అని అనుకుంటున్నారా? అతడు కూడా రెండు మూడు సినిమాల్లో నటించాడు. పూర్తి వివరాలు స్టోరీలోకి వెళ్లి తెలుసుకుందాం..

ప్రస్తుతం సినీ పరిశ్రమలో పెళ్లిళ్ల సీజన్​ నడుస్తోంది. చిత్ర పరిశ్రమకు చెందిన పలువురు నటీ నటులు తమ బ్యాచిలర్ లైఫ్​కు గుడ్​బై చెప్పేసి పెళ్లి పీటలెక్కేస్తున్నారు. కొందరు తాను ప్రేమించిన వ్యక్తులతో ఈ మూడు ముళ్ల బంధంలోకి అడుగుపెడుతుంటే మరికొందరేమో అరేంజ్డ్ మ్యారేజ్ చేసుకుని ఒక్కటవుతున్నారు. అలా తాజాగా మరో నటి కూడా తాను ప్రేమించిన వ్యక్తిని పెళ్లి చేసుకుంది సర్​ప్రైజ్ ఇచ్చింది. తనే బిగ్​ బాస్ వాసంతి కృష్ణన్​.

bigboss vasanthi krishnan marriage with her lover actor pawan kalyan news goes viral see details here

బిగ్ బాస్ తెలుగు సీజన్ 6తో పాపులారిటీ తెచ్చుకున్న వారిలో వాసంతి కృష్ణన్ ఒకరు. ఈమె ప్రస్తుతం సీరియల్స్‌తో పాటు సినిమాల్లోనూ నటిస్తోంది. సిరిసిరి మువ్వలు ధారావాహికతో బుల్లితెరపై ఎంట్రీ ఇచ్చిన ఈమె ఆ తర్వాత గోరింటాక్, గుప్పెడంత మనసు సీరియల్స్​లో నటించి మంచి గుర్తింపు సాధించింది. కాలీఫ్లవర్, మనే నం.67, భువన విజయం, సీఎస్ఐ సనాతన్ లాంటి పలు చిత్రాల్లోనూ క్యారెక్టర్ ఆర్టిస్ట్​గా నటించి మెప్పించింది. తెలుగుతో పాటు కన్నడలోనూ పలు సినిమాలు చేసింది.

ఈ క్రమంలోనే వాసంతి తన ఫ్యామిలీ ఫ్రెండ్ అయిన పవన్ కల్యాణ్‌తో ప్రేమలో పడింది. గతేడాది ఈ విషయాన్ని తెలిపింది. అలా 2023 డిసెంబరులో ఈ జంట కుటుంబసభ్యుల సమక్షంలో నిశ్చితార్థం చేసుకున్నారు. ఈ మధ్యే ఓ యూట్యూబ్ ఛానెల్ ఇంటర్వ్యూలోనూ
పాల్గొని అందరి ముందే ఈ జంట ముద్దు పెట్టుకుని అందరినీ షాక్​కు గురిచేశారు. ఇకపోతే పవన్ కూడా నటుడే కావడం విశేషం. అతడు హీరోగా రెండు సినిమాలు చేస్తున్నాడని తెలిసింది. అయితే వాటికి సంబంధించిన పూర్తి వివరాలు తెలీదు.

bigboss vasanthi krishnan marriage with her lover actor pawan kalyan news goes viral see details here

అయితే తాజాగా ఈ పవన్​ - వాసంతి జంట మూడుముళ్ల బంధంతో ఒక్కటయ్యారు. గ్రాండ్​గా వీరి పెళ్లి జరిగింది. తిరుపతిలో బంధుమిత్రులు, ఇరు కుటుంబ సభ్యుల సమక్షంలో వీరు పెళ్లి చేసుకున్నారు. ఈ పెళ్లికి కొంతమంది బిగ్‍‌బాస్, సీరియల్ నటులు కూడా హాజరయ్యారని సమాచారం అందింది. ప్రస్తుతం ఈ జంటకు సంబంధించిన పెళ్లి ఫొటోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. అభిమానులు, నెటిజన్లు ఈ నూతన వధూవరులిద్దరికి శుభాకాంక్షలు చెపుతున్నారు. వారి పెళ్లి ఫొటోలను ట్రెండ్ చేస్తూ షేర్ చేస్తున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X