బిగ్‌బాస్ 2: ఆ 16 మంది వీళ్లేనా.. శ్రీరెడ్డి పేరు కూడా ఉంది, మరచిపోతున్న హీరోయిన్లు కూడా!
Recommended Video

టివి రియాలిటీ షోలలో బిగ్‌బాస్ షో క్రేజీగా మారిపోయింది. ముఖ్యంగా తెలుగులో రెండవ సీజన్ ప్రారంభానికి కొద్ది రోజుల సమయం ఉండగానే అందరిలో ఉత్కంఠ పెరిగిపోతోంది. నేచురల్ స్టార్ నాని రెండవ సీజన్ కు హోస్ట్ గా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. జూన్ 10 నుంచి బిగ్‌బాస్ 2 ప్రసారం కానుంది. కానీ ఈ షోలో కంటెస్టెంట్స్ ఎవరు అనే విషయం మాత్రం ఇప్పటికి సస్పెన్సే. తొలి సీజన్ కంటే రెండవ సీజన్ లో అధికంగా మసాలా దట్టించి ప్రేక్షకులకు వినోదాన్ని పంచబోతున్నారు. కాగా ఈ షోలో పాల్గొనబోయే కంటెస్టెంట్స్ వీళ్ళే అంటూ సోషల్ మీడియాలో ఓ లిస్ట్ వైరల్ గా మారుతోంది. బిగ్‌బాస్ టీం మాత్రం అధికారికంగా పేర్లు ప్రకటించలేదు.

రాజ్ తరుణ్
హీరోగా రాణిస్తున్న రాజ్ తరుణ్ బిగ్‌బాస్ 2 హౌస్ లోకి అడుగు పెట్టబోతున్నట్లు తెలుస్తోంది. రాజ్ తరుణ్ హీరోగా యువతలో మంచి క్రేజ్ ఏర్పరుచుకున్నాడు.

శ్రీరెడ్డి
శ్రీరెడ్డి గురించి పరిచయం అవసరం లేదు. ఈ మధ్యన మీడియాలో ఎక్కువగా వినిపించిన పేరు ఇదే. కాస్టింగ్ కౌచ్ పోరాటంతో వెలుగులోకి వచ్చిన శ్రీరెడ్డి బిగ్‌బాస్ 2 కంటెస్టెంట్ గా ఎంపికైనట్లు వార్తలు వస్తున్నాయి.

చార్మి
హీరోయిన్ ఛార్మి కూడా బిగ్‌బాస్ హౌస్ లోకి అడుగుపెట్టబోతోందట. ఛార్మి ఈ మధ్య కాలంలో వెండి తెరకు దూరంగా ఉంటోంది. బిగ్‌బాస్ 2 తో ఆమె మరో మారు ప్రేక్షకులకు చేరువయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.

గీత మాధురి
తన గాత్రంతో అలరించే ప్రముఖ సింగర్ గీత మాధురి కూడా బిగ్‌బాస్ 2 లో అవకాశం దక్కించుకున్నట్లు తెలుస్తోంది. ఎపుడూ చలాకీగా ఉండే గీతా మాధురి బిగ్‌బాస్ లోకి అడుగుపెడితే ఆడియన్స్ కి వినోదమే.

యాంకర్స్ ఇద్దరూ
బుల్లి తెరపై యాంకర్స్ గా రాణిస్తున్న లాస్య, శ్యామల బిగ్‌బాస్ లో మెరవబోతున్నారని సమాచారం.

సీనియర్ హీరోయిన్లు ఇద్దరూ
గజాల, రాశి.. ఒకప్పుడు వెండితెరపై మెరుపులు మెరిపించి హీరోయిన్లు వీళ్ళిద్దరూ. అంభిమానులు వీళ్లని మరచిపోతున్న టైంలో బిగ్‌బాస్ లో మెరిసే అవకాశం వచ్చినట్లు తెలుస్తోంది.

జూనియర్ శ్రీదేవి
హీరోయిన్ గా రాణించిన శ్రీదేవి విజయ్ కుమార్, నటి ధన్య బాలకృష్ణ, షార్ట్ ఫిలిమ్స్ తో పాపులర్ అయిన చాందిని చౌదరి బిగ్‌బాస్ కు ఎంపికైనట్లు వార్తలు వస్తున్నాయి.

వెండి తెరకు దూరమైన ముగ్గురు హీరోలు
వరుణ్ సందేశ్, ఆర్యన్ రాజేష్, యువ హీరో తనీష్ బిగ్‌బాస్ షోలో కంటెస్ట్ చేయబోతున్నట్లు తెలుస్తోంది. వీరు వెండితెరకు దూరమైన చాలా కాలం అయిన సంగతి తెలిసిందే.

కమెడియన్స్
జబర్దస్త్ తో పాపులర్ అయిన కమెడియ వేణు, వైవా హర్ష పేర్లు కూడా సోషల్ మీడియాలో సర్కులేట్ అవుతున్న జాబితాలో ఉన్నాయి.


Click it and Unblock the Notifications











