బిగ్ బాస్2 లీక్: ఫైనల్స్‌లో ఊహించనిది జరగబోతోందా.. టాప్2లో వాళ్లిద్దరూ అంటూ!

బిగ్ బాస్ షో తుది దశకు చేరుకుంది. ఈ ఆదివారం జరగబోయే ఫైనల్స్ లో టైటిల్ ఎగరేసుకుపోయే కంటెస్టెంట్ ఎవరో తేలిపోనుంది. ప్రస్తుతం హౌస్ లో ఉన్న ఐదుగురు ఇంటిసభ్యులు గట్టి పోటీదారులే. ఎవరిని తక్కువ అంచనా వేయలేం. సామ్రాట్ కాస్త నామినేషన్స్ కు చిక్కకుండా తప్పించుకున్నా.. ఫైనల్స్ కు చేరుకున్నాడు కాబట్టి తక్కువగా అంచనా వేయలేం. ఇక కౌశల్, తనీష్, గీత మాధురి, దీప్తి మధ్య ఇన్ని రోజులు ఎలాంటి రసవత్తరమైన పోటీ జరిగిందో అందరికి తెలిసిందే. తాజగా సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారం ప్రకారం బిగ్ బాస్ ఫైనల్స్ గురించి కొంత సమాచారం లీక్ అయినట్లు వార్తలు వస్తున్నాయి.

ఆ క్రెడిట్ అతడికే

ఆ క్రెడిట్ అతడికే

ఫైనల్స్ కు చాలా సులభంగా చేరుకున్నా హౌస్ మెట్ సామ్రాట్. బిగ్ బాస్ 2 లో ఫైనల్స్ కు చేరుకున్న తొలి కంటెస్టెంట్ గా ఆ క్రెడిట్ అతడికే దక్కుతుంది. బిగ్ బాస్ 2 లో అతడి ప్రయాణం పూలబాటలా సాగిందని చెప్పొచ్చు. అతి తక్కువ నామినేషన్స్ ఎదుర్కొన్నది అతడే.

పట్టు వదలకుండా

పట్టు వదలకుండా

దీప్తి విషయానికి వస్తే.. టాస్క్ లలో విజేత గా నిలిచేందుకు, నామినేషన్స్ నుంచి బయట పడేందుకు దీప్తి ఎంత కష్టపడిందో అందరికి తెలిసిందే. చిన్న అవకాశాన్ని కూడా వదలిపెట్టకుండా పోరాడింది. ఫైనల్స్ లో ఆమె స్థానం ఏమిటో చూడాల్సి ఉంది. తనీష్ గురించి చెప్పాల్సిన అవసరం లేదు. మగవారిలో కౌశల్ కు బిగ్ బాస్ షో మొత్తం ముఖా ముఖి తలపడింది ఇతడే. విజేతగా నిలిచేందుకు తనీష్ కు కూడా అవకాశాలు ఉన్నాయి.

 హాట్ ఫేవరెట్స్

హాట్ ఫేవరెట్స్

ఇక టైటిల్ రేసులో ఉన్న వారిలో ప్రముఖంగా వినిపిస్తున్న పేర్లు కౌశల్, గీత మాధురి. కౌశల్ తో జరిగిన ప్రతి వాదనలో గీత మాధురి ఎక్కడా తగ్గలేదు. హౌస్‌లో చలాకీగా ఉంటూనే అందరిని మెప్పిస్తోంది. ఇక కౌశల్‌కు ఆడియన్స్ నుంచి లభిస్తుంది మద్దత్తు తెలిసిందే. విభిన్నమైన శైలితో కౌశల్ ఆడియన్స్‌ని ఆకట్టుకుంటున్నాడు.

 ఫైనల్స్ గురించి లీక్స్

ఫైనల్స్ గురించి లీక్స్

బిగ్ బాస్2 ఎలిమినేషన్స్ గురించి వచ్చిన లలీక్స్ అని దాదాపుగా నిజమయ్యాయి. ఫైన్సల్ గురించి కూడా లీక్ అయిన సమాచారం వచ్చిందంటూ సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. దీని ప్రకారం బిగ్ బాస్2 టాప్2 లో కౌశల్, గీత మాధురి ఉండబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి.

 ఊహించని ఫలితం నిజమేనా

ఊహించని ఫలితం నిజమేనా

ఫైనల్స్ లీక్ అంటూ జరుగుతున్న ప్రచారంలో మరో సంచలన విషయం కూడా ఉంది. ఫైనల్స్ లో విజేత గీత మాధురి అంటూ జోరుగా ప్రచారం జరుగుతోంది. ఓటింగ్స్ ని బట్టి అయితే కౌశల్ కు తురుగుండదనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. కానీ విజేతని నిర్ణయించేది బిగ్ బాస్ నిర్వాహకులే కాబట్టి ఈ ఊహాగానాలు బలంగా వినిపిస్తున్నాయి. సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారం బట్టి విజేత ఎవరో ఓ అంచనాకు రాలేం. అసలైన విజేత ఎవరో తెలియాలంటే ఆదివారం వరకు ఆగాల్సిందే.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X