శ్రీముఖికి భారీ ఆఫర్.. సమంత ఫిగర్‌ని మించి!
Recommended Video
ఎన్నో వివాదాల నడుమ స్టార్ట్ అయిన తెలుగు బిగ్ బాస్ సీజన్ 3 విజయవంతంగా రన్ అవుతోంది. 100 రోజుల పాటు సాగనున్న ఈ రియాలిటీ షోలో నాగార్జున హోస్టింగ్, హౌస్‌మేట్స్ గొడవలు ప్రస్తుతం హైలైట్ అవుతున్నాయి. తొలివారమే నటి హేమ ఎలిమినేట్ కాగా ఈ వారం ఎలిమినేషన్ లిస్ట్ లో 8 మంది పార్టిసిపెంట్స్ ఉన్నారు. కాగా హౌస్‌మేట్స్ అందరిలో ఎక్కువగా ఫోకస్ అవుతోంది శ్రీముఖి అని చెప్పుకోవచ్చు. కాగా ఈమెకు బిగ్ బాస్ యాజమాన్యం ఇచ్చిన ఆఫర్‌కి సంబందించిన ఓ ఆసక్తికర వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

పటాస్ వదిలి బిగ్ బాస్ హౌస్ లోకి
పటాస్ యాంకర్ గా భారీ పాపులారిటీ సంపాదించిన శ్రీ ముఖి.. ఆ షోకి గుడ్ బై చెప్పేసి మరీ బాస్ హౌస్ లోకి అడుగు పెట్టింది. పటాస్ షో నుంచి బయటకొచ్చాక బిగ్ బాస్ లోకి వెళ్లే విషయాన్ని సీక్రెట్ గా ఉంచినప్పటికీ, ఆమె బిగ్ బాస్ హౌస్‌మెట్ కానుందని వార్తలు వచ్చాయి. పైగా ఆ సమయం లోనే శ్రీ ముఖి రెమ్మ్యూనరేషన్ పరమైన వార్తలు కూడా విన్నాం.

శ్రీముఖి ఆఫర్ పై మరోసారి చర్చ
ఇదిలా ఉండగా ప్రస్తుతం బిగ్ బాస్ హౌస్‌లో బాగా హైలైట్ అవుతున్న శ్రీ ముఖి ఆఫర్ విషయమై మరోసారి సోషల్ మీడియాలో చర్చలు మొదలయ్యాయి. బిగ్ బాస్ టీం నుంచి శ్రీముఖి రెమ్యూనరేషన్ ఎంత అనే విషయం లీక్ అయినట్టు నెట్టింట వార్తలు షికారు చేస్తున్నాయి. స్టార్ హీరోయిన్‌ని మించిన పారితోషికం శ్రీ ముఖి అందుకుంటున్నట్లుగా సమాచారం అందుతోంది.

సమంతను మించి శ్రీముఖి
శ్రీముఖికి ఏకంగా 3.5 లక్షలు ఇచ్చేందుకు గాను బిగ్ బాస్ టీం అగ్రిమెంట్ చేసుకుందని అంటున్నారు. ఈ లెక్కన చూస్తే బిగ్ బాస్ ప్రసారమయ్యే 100 రోజులకు గాను ఆమెకు ఆఫర్ చేసిన మొత్తం 3.5 కోట్లు అన్నమాట. ఒకవేళ బిగ్ బాస్ హౌస్‌లో శ్రీముఖి చివరిదాకా ఉందంటే ఈ మొత్తం తన ఖాతాలో పడినట్లే. పైగా ఈ ఫిగర్ ప్రస్తుతం స్టార్ హీరోయిన్ సమంత తీసుకునే పారితోషికం కంటే ఎక్కువ కావడం గమనార్హం.

శ్రీముఖిది కన్నింగ్ క్యారెక్టర్
ఇక తొలివారం బిగ్ బాస్ హౌస్ నుంచి ఎలిమినేట్ అయిన హేమ.. శ్రీముఖి గురించి సంచలన ఆరోపణలు చేసింది. శ్రీముఖిది కన్నింగ్ క్యారెక్టర్ అని, చాడీలు చెప్పే మనస్తత్వం అని హేమ తెలిపింది. హౌస్‌మేట్స్ అంతా తనను అక్కా అక్కా అంటూ వెన్నుపోటు పొడిచారని నిన్న జరిగిన ప్రెస్ మీట్‌లో హేమ ఆవేదన చెందింది.


Click it and Unblock the Notifications











