Deepthi Sunaina: నటుడితో ఘాటు ప్రేమలో దీప్తి సునైనా.. ఇక సింగిల్‌గానే షణ్ముఖ్ జశ్వంత్!
యూట్యూబర్, బిగ్ బాస్ బ్యూటీ దీప్తి సునైనా గురించి తెలుగు సినీ ప్రియులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అద్భుతమైన అందాలు కల్గిన ఈ ముద్దుగుమ్మ అదిరిపోయే షార్ట్ ఫిల్మ్స్ లో నటించి తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. అలా వచ్చిన ఫేమ్ తోనే బిగ్ బాస్ కు వెళ్లి మరింత క్రేజ్ సంపాధించుకుంది. అయితే తోటి యూట్యూబర్ షణ్ముఖ్ జశ్వంత్ తో ప్రేమాయణం నడిపిన ఈమె రెండేళ్ల క్రితం అతడికి బ్రేకప్ చెప్పేసింది.
అయితే తాజాగా ఈమె మరో కొత్త వ్యక్తితో ప్రేమలో పడినట్లు తెలుస్తోంది. వారిద్దరూ కలిసి రొమాన్స్ చేస్తున్న వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అయింది. అయితే ఆమె తన రెండో ప్రియుడు అని, అతడిని ఆమె పెళ్లి కూడా చేసుకోబోతున్నట్లు టాక్ నడుస్తోంది. ఆ పూర్తి విశేషాలు ఏంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం.

టిక్ టిక్ లో వీడియోలు చేస్తూ.. యూట్యూబ్ లో షార్ట్ ఫిల్మ్మ్ చేస్తూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది దీప్తి సునైనా. తన ప్రియుడు షణ్ముఖ్ జశ్వంత్ తో కలిసి డ్యాన్స్ వీడియోలు చేసే ఈమె.. ఆ తర్వాత బిగ్ బాస్ సీజన్ 2కు సెలెక్ట్ అయింది. అక్కడే హీరో తనీష్ తో చాలా క్లోజ్ గా ఉంటూ రచ్చ చేసింది. అదంతా బయటే ఉండి చూసిన ఆమె ప్రియుడు చాలా ఫీల్ అవుతూ వీడియోలు పోస్ట్ చేశాడు. ఇక ఆ తర్వాత బయటకు వచ్చిన ఆమె అతడికి నచ్చజెప్పుకుంది.
ఆ తర్వాత నుంచి వీరిద్దరి ప్రేమ కంటిన్యూ అవుతూనే వచ్చింది. బయటకు వచ్చాక కూడా చాలా షార్ట్ ఫిల్మ్స్, డ్యాన్స్ వీడియోలు చేసిన ఈమె షణ్ముఖ్ జశ్వంత్ బిగ్ బాస్ కు వెళ్లి వచ్చాకా బ్రేకప్ చెప్పేసింది. ముఖ్యంగా ఆయన సిరి హన్మంత్ తో క్లోజ్ గా ఉండడం చూసి జీర్ణించుకోలేకపోయిన ఆమె అతడితో కలిసి ఉండలేనని తేల్చేసింది. ఆ తర్వాత నుంచి ఎవరి జీవితాల్లో వారు ముందుకు వెళ్తున్నారు. అప్పటి నుంచి సింగిల్ గానే ఉంటున్న దీప్తి మరోసారి ప్రేమలో పడినట్లు తెలుస్తోంది.

ముఖ్యంగా సోషల్ మీడియా వేదికగా ఆమె ఓ వీడియో పోస్ట్ చేసింది. అందులో నటుడు వీజే విశాల్ తో కలిసి కనిపించింది. వీరిద్దరూ చాలా క్లోజ్ గా ఉన్న ఈ వీడియోలో చాలా అందంగా కనిపిస్తున్నారు. అయితే ఇది చూసిన ప్రతీ ఒక్కరూ ఆమె రెండో ప్రియుడు ఇతడేనంటూ కామెంట్లు చేస్తున్నారు. అలాగే బాగానే ఎంజాయ్ చేస్తున్నావులే అంటూ చెప్పుకొస్తున్నారు. అయితే దీప్తి షేర్ చేసిన ఈ వీడియో.. ఏదో షూటింగ్ పర్పస్ లో చేసినట్లుగా చూస్తుంటేనే తెలుస్తోంది. నిజంగానే దీప్తి అతడితోనే ప్రేమలో ఉన్నట్లు కనిపిస్తున్నా.. ఇది రియల్ లైఫ్ లో కాదు రీల్ లైఫ్ లోని అర్థం అవుతుంది.


Click it and Unblock the Notifications










