జబర్దస్త్‌ బ్యూటీతో చిక్కిన యాంకర్ రవి .. ఇకపై జర్నీ ఆమెతోనేనా?

సహజంగా యాంకరింగ్ అంటే అక్కడ అమ్మాయిలే హవా. ఇక తెలుగులో యాంకర్లు అనగానే వెంటనే సుమ కనకాల, ఝాన్సీ, శిల్పా చక్రవర్తి, అనసూయ, రష్మి, శ్రీముఖి, శ్యామల వంటి వారు టక్కున గుర్తొస్తారు. వీరంతా ఏళ్లుగా తెలుగు టెలివిజన్ ఇండస్ట్రీని ఏలుతున్నారు. ఇలాంటి చోట అబ్బాయిలు అడుగుపెట్టగలరా? ఒకవేళ వచ్చిన సక్సెస్ కొట్టగలారా? అనే అనుమానాలు ఎంతో మందికి వచ్చాయి.

అయితే ప్రదీప్ మాచిరాజు, సుడిగాలి సుధీర్ వంటి వారు ఈ అనుమానాలను పటాపంచలు చేస్తున్నారు. అమ్మాయిలే కాదు.. అబ్బాయిలు కూడా యాంకరింగ్‌లో కింగ్‌లేనని వీరు నిరూపించారు. యాంకరింగ్ అమ్మాయిలకే సొంతం కాదని ఎంతోమంది యువకులను ఈ వైపుకు వచ్చేలా చేస్తున్నారు. ఈ లిస్ట్‌లోకే వస్తారు రవి. హైదరాబాద్‌లోనే పుట్టి పెరిగిన ఈయన బీటెక్ పూర్తి చేశారు. సినిమాల్లోకి అడుగుపెట్టాలన్న లక్ష్యంతో గట్టిగానే ట్రై చేశాడు. కానీ దురదృష్టం వెంటాడటంతో ఎక్కడా అవకాశం దక్కలేదు. వైట్ స్కిన్ టోన్, ఆకట్టుకునే రూపం, ముఖంపై చిరునవ్వుతో మెస్మరైజ్ చేసినప్పటికీ రవికి ఛాన్స్‌లు రాలేదు.

bigg boss fame anchor ravi mass steps with jabardasth comedian satya sri video goes viral

అనుకున్న స్థాయిలో అవకాశాలు రాకపోవడంతో కొరియోగ్రఫీ వైపు కూడా ఓ చూపు చూసిన రవిని టాలీవుడ్ అగ్ర కథానాయకుడు అక్కినేని నాగార్జున ఇచ్చిన సలహా యాంకరింగ్ వైపు నడిపించింది. ఆయన సూచన మేరకు మాటీవీలో యాంకర్ అవతారం ఎత్తారు. తొలుత సమ్‌థింగ్ స్పెషల్ అనే షోతో తెలుగు వారిని పలకరించారు. ముఖ్యంగా యాంకర్ లాస్య జోడీగా చేసిన ఈ షోకు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వచ్చింది. ఈ జోడీకి, ఈ షోకు ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు.

అంతేకాదు.. రవి, లాస్య ప్రేమించుకుంటున్నారని.. త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నారని కూడా సోషల్ మీడియాలో గాసిప్స్ వైరల్ అయ్యాయి. ఇలాంటి దశలో యాంకర్ లాస్య సైలెంట్‌గా పెళ్లి చేసుకోవడంతో జనం ఖంగుతిన్నారు. కానీ రవి మాత్రం చాలా కాలం పాటు బ్యాచిలర్‌గా తిరిగారు. అయితే ఓ రోజున సడెన్‌గా తన భార్యతో పాటు కూతురిని కూడా స్టేజ్ మీదకి తీసుకొచ్చి షాకిచ్చాడు. యాంకర్‌గా తెలుగునాట ఉన్న పాపులారిటీతో బిగ్‌బాస్ 5 తెలుగులో కంటెస్టెంట్‌గా ఛాన్స్ అందుకున్నాడు. టాప్ 5లో ఖచ్చితంగా ఉంటాడని అనుకున్నప్పటికీ.. అనుకోని విధంగా మధ్యలోనే హౌస్‌ను వీడాడు. ప్రస్తుతం ఈటీవీలో ప్రసారమవుతున్న ఆడవాళ్లు మీకు జోహార్లు షోతో బుల్లితెరను ఎంటర్‌టైన్ చేస్తున్నాడు.

సోషల్ మీడియాలో యాక్టీవ్‌గా ఉండే రవి తన ప్రోగ్రామ్‌లు, షోలు, ఇతర వ్యక్తిగత వివరాల గురించి ఎప్పటికప్పుడు పంచుకుంటూ ఉంటారు. తాజాగా ఆయన పోస్ట్ చేసిన వీడియో ఇన్‌స్టాగ్రామ్‌లో వైరల్ అవుతోంది. జబర్దస్త్ ఫేమ్, సినీ నటి సత్యశ్రీతో మాస్ స్టెప్పులు వేస్తూ ఉన్న ఆ వీడియో చర్చనీయాంశమైంది. డ్యాన్స్ అదిరింది అన్నా.. నీకు కొత్త పార్ట్‌నర్‌ దొరికిందా? మీ ఇద్దరూ కలిసి త్వరలో ఏదైనా కార్యక్రమాన్ని హోస్ట్ చేయబోతున్నారా ? అంటూ నెటిజన్లు కామెంట్స్ పెడుతున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X