బిగ్‌బాస్‌2: నానికి దిమ్మతిరిగే పారితోషికం, 16 సెలబ్రిటీల రెమ్యునరేషన్ల జాబితా లీక్

By Rajababu

Recommended Video

Big Boss Season 2 Telugu : Contestants Remuneration

ఎన్టీఆర్ హోస్ట్‌గా బిగ్‌బాస్ సీజన్ 1కు మంచి రెస్పాన్స్ వచ్చిన తర్వాత రెండో సీజన్ బ్రహ్మండంగా ప్రారంభమైన సంగతి తెలిసిందే. నేచురల్ స్టార్ నాని హోస్ట్‌గా రెండో సీజన్ జూన్ 10న అంగరంగ వైభవంగా ప్రారంభమైంది. రెండో సీజన్‌లో ఇంకాస్త మసాలాను నాని దట్టించే ప్రయత్నం చేస్తున్నారు. అయితే జూనియర్ ఎన్టీఆర్ స్థాయిలో నాని ఫెర్ఫార్మెన్స్ లేదని కొన్నివర్గాలు అంటుంటే.. ఇప్పుడే మొదలైందిగా.. కాస్త ఆగండి నాని తడాఖా చూపించడం ఖాయమంటున్నారు మరికొందరు. ఈ కార్యక్రమంలో పాల్గొంటున్న 16 మంది సెలబ్రిటీల రెమ్యునరేషన్ వివరాలకు సంబంధించిన వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నది.

చిన్న, చితక సెలబ్రిటీలు

చిన్న, చితక సెలబ్రిటీలు

బిగ్‌బాస్2 విషయానికి వస్తే పెద్దగా ప్రేక్షకులను బుల్లితెర వైపు ఆకర్షించే స్టార్ హీరో, హీరోయిన్లు లేకపోవడం ఈ షోకు మైనస్‌ అని అంటున్నారు. సామ్రాట్ రెడ్డి, తనీష్ లాంటి చిన్న చితక హీరోలు, తేజస్వి మదివాడ, సింగర్ గీతా మాధురి లాంటి చిన్నపాటి సెలబ్రిటీలు ఈ షోకు ఆకర్షణగా మారారు.

నాని రెమ్యునరేషన్ ఇదే

నాని రెమ్యునరేషన్ ఇదే

బిగ్‌బాస్ షోకు హోస్ట్‌గా వ్యవహరించినందుకు గాను.. నానికి భారీగానే ముట్టినట్టు ప్రచారం అవుతున్నది. 106 ఎపిసోడ్స్ కోసం నానికి రూ.3.5 కోట్ల రెమ్యునరేషన్ ముట్టినట్టు తెలుస్తున్నది. శని, ఆదివారాల్లో నాని ప్రేక్షకులకు దర్శనమిస్తారనే విషయం తెలిసిందే.

సింగర్ గీతా మాధురి టాప్

సింగర్ గీతా మాధురి టాప్

ఇక 16 మంది సెలబ్రిటీల రెమ్యునరేషన్ వివరాలంటూ ఓ వార్త ప్రచారంలో ఉంది. ఈ సెలబ్రిటీల జాబితాలో గీతా మాధురిదే అత్యధిక పారితోషికం అని పేర్కొంటున్నారు. గీతా మాధురి అత్యధికంగా రూ.20 లక్షల పారితోషికాన్ని ఇచ్చేందుకు బిగ్‌బాస్ నిర్వాహకులు అంగీకారానికి వచ్చినట్టు సమాచారం.

రూ.5 లక్షల రెమ్యునరేషన్

రూ.5 లక్షల రెమ్యునరేషన్

సింగర్ గీతా మాధురి పారితోషికం తర్వాత అత్యధికంగా తనీష్, అమిత్, బాబు గోగినేని, తేజస్వికి రూ.8 లక్షలు ఇచ్చినట్టు సమాచారం. ఇక ఐదు లక్షల రూపాయలు తీసుకొంటున్న వారిలో యాంకర్ శ్యామల, దీప్తి సునయన, రోల్ రైడా, సామ్రాట్ రెడ్డి, కిరిటీ దామరాజు, కౌశల్, భాను శ్రీ ఉన్నట్టు తెలుస్తున్నది.

3 లక్షల క్యాటరిగిలో

3 లక్షల క్యాటరిగిలో

ఇక మూడో క్యాటగిరిలో రూ.3 లక్షలు తీసుకొంటున్న వారిలో టీవీ9 యాంకర్ దీప్తి, కామన్ మ్యాన్ క్యాటగిరిలోని గణేష్, నూతన్ నాయుడు, సంజనా అన్నే ఉన్నారు. ఈ వివరాలపై అధికారికంగా వెల్లడికాలేదన్న విషయం గమనార్హం.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X