»   » బిగ్‌బాస్‌పై క్రేజీ గాసిప్స్.. తెరపైకి ఆ నలుగురి పేర్లు!

బిగ్‌బాస్‌పై క్రేజీ గాసిప్స్.. తెరపైకి ఆ నలుగురి పేర్లు!

Posted By:
Subscribe to Filmibeat Telugu
For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts
    Big Boss 2 Contestants List Leaked

    ఐపీఎల్ క్రీడా వేడుకలు ఘనంగా ముగిసాయి. దాదాపు రెండు నెలలపాటు ఉర్రూతలూగించిన ఈ క్రీడా వినోదం తర్వాత, దక్షిణాదిలో మరో భారీ వినోద కార్యక్రమం మొదలు కాబోతున్నది. అదేమిటంటే.. బిగ్‌బాస్ రెండో సీజన్. తెలుగు, తమిళ భాషల్లో రెండో సీజన్‌కు రంగం సిద్దమవుతున్నది. తెలుగులో ఎన్టీఆర్ స్థానంలో నాని, తమిళంలో కమల్ హాసన్‌గా వ్యవహరించడానికి రెడీ అవుతున్నారు. అయితే తమిళ వెర్షన్‌పై వస్తున్న ఊహాగానాలు ఇలా ఉన్నాయి.

     రూమర్ల జోష్ పెరిగింది

    రూమర్ల జోష్ పెరిగింది

    తమిళ భాషలో ప్రారంభం కాబోయే బిగ్ బాస్2కు సంబంధించిన వార్తలు, గాసిప్స్ అనేకంగా మీడియాలో ప్రత్యక్షమవుతున్నాయి. అయితే దానిలో పాల్గొనేబోయే హౌస్‌ సభ్యుల పేర్లు తాజాగా తెరపైకి వస్తున్నాయి. అయితే వాటిపై బిగ్ బాస్ నిర్వాహకులు స్పందించకపోవడంతో ఊహాగానాలుగానే మిగిలిపోయాయి.

    తెరపైకి సిమ్రాన్, కస్తూరి పేర్లు

    తెరపైకి సిమ్రాన్, కస్తూరి పేర్లు

    తాజా సమాచారం ప్రకారం.. తమిళ బిగ్‌బాస్‌లో సిమ్రాన్ లేదా కస్తూరి గానీ పాల్గొనే అవకాశం ఉంది అని మీడియా కథనాలు పేర్కొంటున్నాయి. అలాగే తమిళ చిత్ర పరిశ్రమలో ఐటెంగర్ల్‌గా పేరున్న హీరోయిన్, టాప్ కమెడియన్ కూడా బిగ్‌బాస్‌కు ఎంపికైనట్టు సమాచారం.

     గెస్టుగా ఓవియా హెలెన్

    గెస్టుగా ఓవియా హెలెన్

    గత బిగ్‌బాస్‌లో వివాదాస్పద సభ్యురాలిగా మారిన ఓవియా హెలెన్ కూడా రెండో సీజన్‌లో గెస్టుగా కనిపించే అవకాశం ఉంది. బిగ్‌బాస్ హౌస్‌లో ఒకరోజు అతిథిగా ఉండబోతున్నట్టు సమాచారం. ఇంకా జాబితాలో క్రేజీ సినీ, టెలివిజన్ తారలు పాల్గొనే అవకాశం ఉంది.

    బిజీగా కమల్ హాసన్

    బిజీగా కమల్ హాసన్

    బిగ్‌బాస్ మొదలు కాబోతున్న నేపథ్యంలో హోస్ట్‌గా కమల్ హాసన్ బిజీ కాబోతున్నారు. అటు రాజకీయాలు, అలాగే విశ్వరూపం2 సినిమాపై కమల్ దృష్టిపెట్టారు. ఇక బిగ్‌బాస్ కూడా ప్రారంభం కాబోతుండటంతో కమల్ ఫ్యాన్స్ మంచి జోష్‌లో ఉన్నారు.

    English summary
    Kamal Haasan will return as a host of the popular reality show Bigg Boss. The reports suggests it might be Simran or Kasthuri. An Item girl is expected to be one of the participants as well. And there will also be a popular comedian. The same reports states that Oviya will appear on the show for a day as a celebrity guest.
     

    తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

    X
    We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more