అదిరిపోయిన లిస్ట్.. బిగ్‌బాస్ 4 కంటెస్టెంట్లు వీరే.. ఆ రోజు నుంచే ఆట మొదలు

ప్రతీ ఇంట్లో జరిగేది.. పక్కింటి వారు ఏం చేస్తున్నారు.. ఏం జరుగుతోంది.. అనే ఆసక్తి ప్రతీ ఒక్కరికీ ఉంటుంది. అది సహజ లక్షణం. ప్రస్తుతం ఎవరింట్లో వారే ఉండాల్సిన పరిస్థితి. కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో ప్రజలంతా ప్రాణాలు అరచేతిలో పట్టుకుని ఇంటి పట్టునే ఉంటున్నారు. గత మూడు నెలలుగా ఇంటి పట్టునే ఉంటూ వస్తోన్న జనాలకు కాసింత ఎంటర్టైన్మెంట్ అంటూ ఏదైనా ఉందంటే అది టీవీయే. ఇంట్లోనే ఉంటున్న వారి కోసం మరింత కాలక్షేపం అందించడం కోసం బిగ్ బాస్ సిద్దమవుతున్నాడు.

Recommended Video

Bigg Boss 4 Telugu Official Announcement,Contestants List Goes Viral || Oneindia Telugu
టీవీల రేటింగ్..

టీవీల రేటింగ్..

మన దేశంలో గత మూడు నెలలుగా బార్క్ లెక్కలను గమనిస్తే టీవీలను వీక్షిస్తున్న వారి సంఖ్య ఏ రేంజ్‌లో పెరిగిందో ఇట్టే అర్థమవుతుంది. టీవీలు, సీరియళ్లు, ఇతర ప్రోగ్రామ్‌లకు విపరీతమైన ఆదరణ లభిస్తోంది. ఇలాంటి సమయాన్ని క్యాష్ చేసుకోవాలని బిగ్ బాస్ రంగంలోకి దిగుతున్నాడు.

సిద్దమవుతోన్న నాల్గో సీజన్..

సిద్దమవుతోన్న నాల్గో సీజన్..

ఇప్పటికే తెలుగులో మూడు సీజన్లు ఓ రేంజ్‌లో క్లిక్కయ్యాయి. మూడింటికి మూడు బ్లాక్ బస్టర్ హిట్స్ అయ్యాయి. అయితే నాల్గో సీజన్‌ను పెద్ద ఎత్తులో ప్లాన్ చేసినా.. కరోనా వల్ల షెడ్యూల్ అంతా మారింది. అందుకే షోలో ఎన్నో మార్పులు చేర్పులు చోటుచేసుకుంటున్నాయట.

 అధికారిక ప్రకటన..

అధికారిక ప్రకటన..

త్వరలోనే నాల్గో సీజన్ ప్రారంభం కాబోతోందని స్టార్ మా బృంధం అధికారికంగా ప్రకటించింది. అయితే గత కొన్ని రోజులుగా ఈ వార్తలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతూనే వస్తోంది. మొత్తానికి నాల్గో సీజన్ త్వరలోనే ప్రారంభం కాబోతోందని అఫీషియల్‌గా చెప్పేశారు.

వీరే కంటెస్టెంట్లు..

వీరే కంటెస్టెంట్లు..

బిగ్‌బాస్ 4లో పాల్గోనే కంటెస్టెంట్లు వీరేనంటూ గత నెల రోజులుగా కొన్ని పేర్లు చక్కర్లు కొడుతూనే ఉంది. అందులో కొన్ని రూమర్లుగానే మిగలగా.. మరికొన్ని పేర్లు మాత్రం ఖాయమైనట్టు తెలుస్తోంది. తాజాగా ఓ లిస్ట్ బయటకు వచ్చింది. సింగర్ సునీత, హేమచంద్ర, వైవా హర్ష, హంసా నందిని, యామినీ భాస్కర్, తరుణ్, నందు, అఖిల్ సార్ధిక్, శ్రద్దా దాస్, మంగ్లీ వంటి పేర్లు వినిపిస్తున్నాయి.

కాదని ప్రకటించినా..

కాదని ప్రకటించినా..

అయితే యాంకర్ వర్షిణి, యాంకర్ ఝాన్నీ, హైపర్ ఆది, రష్మీ, సుధీర్‌లు కూడా పాల్గొనబోతోన్నారని మరో లిస్ట్ కూడా చక్కర్లు కొడుతోంది. వీరిలో వర్షిణి, ఝాన్నీ గతంలోనే ఖండించారు. హైపర్ ఆది, రష్మీ, సుధీర్ వంటి ఫేమస్ పర్సనాలిటీలను పట్టుకొస్తే మాత్రం ఇంకో లెవెల్‌లో ఉంటుంది.

ఆ రోజే ప్రారంభం..

ఆ రోజే ప్రారంభం..

మామూలుగా అంతా బాగుండి ఉంటే.. నాల్గో సీజన్ ఈపాటికే మొదలు కావాల్సింది. కరోనా విజృంభించడంతో అంతా మారింది. నాల్గో సీజన్‌ను ఆగస్టు మొదటి వారం లేదా మూడో వారంలో ప్రారంభించబోతోన్నారని టాక్ నడుస్తోంది. అయితే ఆగస్టు నుంచి అసలు ఆట మొదలుకాబోతోందన్న మాట.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X