twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    నాగార్జున కోసం ‘బిగ్‌బాస్’ సంచలన నిర్ణయం.. మునుపటిలా ఉండదట ఇక!!

    |

    బిగ్‌బాస్ షో అంటేనే ప్రేక్షకుల్లో తెలియని ఉత్సాహం ఏర్పడుతుంది. అయితే కొందరు మాత్రం బిగ్‌బాస్ షో అంటేనే పెదవి విరుస్తున్నారు. నాల్గో సీజన్‌కు సంబంధించిన ప్రోమో విడుదలవ్వగానే భిన్న రకాలుగా స్పందనలు వచ్చాయి. ఎంతమంది బిగ్‌బాస్ కోసం ఎదురుచూస్తున్నారో అంతే స్థాయిలో విమర్శించే వారు కూడా ఉన్నారు. ఏది ఏమైనా బిగ్ బాస్ రాబోతోన్నాడని ప్రోమో వదిలిన క్షణం నుంచి కొత్త సందడి మొదలైంది.

     ప్రోమో వైరల్..

    ప్రోమో వైరల్..

    బిగ్‌బాస్ షోలో భాగంగా ఇప్పటికే మూడు సీజన్లు విజయవంతంగా ముగిశాయి. ఒకదానికి మించి మరొకటి టీఆర్పీలో కొత్త ట్రెండ్‌ను క్రియేట్ చేశాయి. ఇక నాల్గో సీజన్ గురించి గత కొన్ని నెలలుగా వార్తలు వస్తూనే ఉన్నాయి. ఎట్టకేలకు స్టార్ మా బృందం విడుదల చేసిన ప్రోమో మాత్రం సెన్సేషన్ క్రియేట్ చేసింది. త్వరలోనే నాల్గో సీజన్ ప్రారంభం కాబోతోందని తీపి కబురుతో షో అభిమానులు రచ్చ రచ్చ చేస్తున్నారు.

    అప్పుడే కంటెస్టెంట్ల లిస్ట్..

    అప్పుడే కంటెస్టెంట్ల లిస్ట్..

    ప్రోమో అలా వచ్చిందో లేదో.. కంటెస్టెంట్ల లిస్ట్ ఇదే నంటూ సోషల్ మీడియాలో వార్తలు చక్కర్లు కొట్టాయి. సింగర్ సునీత, హేమచంద్ర, వైవా హర్ష, హంసా నందిని, యామినీ భాస్కర్, తరుణ్, నందు, అఖిల్ సార్ధిక్, శ్రద్దా దాస్, మంగ్లీ, యాంకర్ వర్షిణి, యాంకర్ ఝాన్నీ, హైపర్ ఆది, రష్మీ, సుధీర్‌లు కూడా పాల్గొనబోతోన్నారని చక్కర్లు కొడుతోంది.

    ఖండించిన తరుణ్..

    ఖండించిన తరుణ్..

    వీరందరిలో తరుణ్ మాత్రం ఈ వార్తలను ఖండించాడు. తనకు అసలు బిగ్ బాస్ అంటేనే ఇష్టముండని, అలాంటి ఆలోచన కూడా లేదని బయట వినిపిస్తున్న వార్తలన్నీ అవాస్తమని అసహనానికి గురయ్యాడు. తరుణ్ ప్రకటనతో లిస్ట్ నుంచి ఒక వికెట్ డౌన్ అయింది.

    అందరికీ కరోనా పరోక్షలు..

    అందరికీ కరోనా పరోక్షలు..


    అయితే ఈసారి పరిస్థితులు భిన్నంగా ఉండటంతో ముందుగా అందరికీ కోవిడ్ పరీక్షలు చేస్తారట. అంతే కాకుండా ముందుగానే అందరినీ ఓ పద్నాలుగు రోజులు క్వారంటైన్‌లో ఉంచుతారట. మళ్లీ కరోనా పరీక్షలు నిర్వహించి.. నెగెటివ్ వచ్చిన వారినే బిగ్‌బాస్‌లోకి తీసుకుంటారట.

    హోస్ట్ కోసం ప్రత్యేకంగా..

    హోస్ట్ కోసం ప్రత్యేకంగా..

    నాల్గో సీజన్‌ను హోస్ట్ చేస్తోన్న నాగార్జున కోసం ఈ సారి బిగ్‌బాస్ కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నాడట. సెట్ మొత్తం ప్రతీ గంటకోసారి శానిటైజ్ చేస్తారట, నాగార్జున వద్దకు ఎవ్వరినీ వెళ్లనివ్వరట.. యూనిట్ కూడా వెళ్లేందుకు అనుమతి ఇవ్వరట.

    Recommended Video

    Celebrities Green India Challenge
    సామాజిక దూరం..

    సామాజిక దూరం..

    సామాజిక దూరం పాటించేలా.. ఏది ఉన్నా మైకుల ద్వారానే చెబుతారట, ప్రతీ ఒక్కరి టెంపరేచర్‌ను టెస్ట్ చేస్తూ ఉంటారట. అందరూ పీపీఈ కిట్స్ ధరించే ఉంటారట. నిత్యం ఓ వైద్యుడు అందుబాటులో ఉంచేలా చూస్తారట. నాగ్ వయసు దృష్ట్యా కూడా మరిన్ని జాగ్రత్తలు తీసుకోబోతోన్నారట.

    English summary
    Bigg Boss telugu 4 Team Special Care For Host Nagarjuna. The entire set will be disinfected for every hour; all the crew members will be provided with PPE Kits and everyone’s temperature is monitored regularly.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X