For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  Bigg Boss Telugu 5 : ఊహించని కలకలం.. షో స్టార్ట్ కావడం కష్టమేనా.. అసలేమైంది అంటే?

  |

  తెలుగు ప్రేక్షకులు విపరీతంగా ఎదురుచూస్తున్నా బిగ్ బాస్ సీజన్ ఫైవ్ ఎట్టకేలకు సెప్టెంబర్ 5వ తేదీ నుంచి ప్రారంభం కాబోతోంది అంటూ అధికారిక ప్రకటన ఈరోజు వెలువడింది. గత రెండు సీజన్లలో హోస్ట్ చేసిన నాగార్జున ఈ ఐదవ సీజన్ కి కూడా హోస్ట్ గా వ్యవహరించనున్నారు. ఇక ఈ విషయాన్ని కొద్ది రోజుల క్రితమే ప్రకటించగా ఈరోజు మాత్రం సెప్టెంబర్ 5 నుంచి ఈ సీజన్ టెలికాస్ట్ కాబోతోంది అంటూ ప్రకటన విడుదల చేశారు. అయితే ఇప్పుడు ఈ సెప్టెంబర్ 5వ తేదీ నుంచి షో మొదలవుతుందా లేదా అనే దాని మీద నీలి నీడలు కమ్ముకున్నాయి. దానికి సంబంధించిన వివరాల్లోకి వెళితే

   అధికారిక ప్రకటన

  అధికారిక ప్రకటన

  తెలుగులో బిగ్ బాస్ నాలుగు సీజన్లలో విజయవంతంగా పూర్తి చేసుకుని ఐదో సీజన్ ప్రారంభానికి సిద్దం అవుతోంది. ముందు నుంచి ఈ షోకి నాగార్జున హోస్ట్ గా వ్యవహరిస్తారని ప్రచారం జరుగుతూ ఉండగా దాన్ని నిజం చేస్తూ కొద్ది రోజుల క్రితం ఒక ప్రోమో విడుదల చేశారు.. ఇక ఈ రోజు అంటే ఆగస్టు 26వ తేదీన ఈ షో సెప్టెంబర్ 5వ తేదీ నుంచి ప్రారంభం కాబోతోందని కూడా ప్రకటించారు. అయితే ఇప్పుడు ఈ షో నిర్వాహకులలో కొత్త టెన్షన్ నెలకొంది. దానికి కారణం కరోనా మహమ్మారి అని అంటున్నారు.

  ముందు టెన్షన్ లేదు కానీ

  ముందు టెన్షన్ లేదు కానీ

  నిజానికి మొదటి మూడు సీజన్లకు ఈ టెన్షన్ లేదు కానీ నాలుగో సీజన్ విషయంలో నిర్వాహకులు చాలా టెన్షన్ పడ్డారు. అప్పటికే కరోనా మహమ్మారి దేశంలో ఎంటర్ కావడంతో ఎన్నో జాగ్రత్తలు తీసుకుని షో మొదలు పెట్టారు.. అప్పటికే కొంతమంది కంటెస్టెంట్ లకు కరోనా సోకిందని ప్రచారం జరిగినా చివరికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా షో పూర్తి చేయడంలో సఫలమయ్యారు. అయితే తమిళ బిగ్ బాస్ అలాగే కన్నడ బిగ్ బాస్ విషయంలో కూడా కరోనా ప్రోటోకాల్ ఉల్లంఘించారనే ఆరోపణలతో కొన్ని ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వచ్చింది. తెలుగులో మాత్రం ఇలాంటి ఇబ్బందులు ఏమీ లేవు.

  సీజన్ మొదలు కాక ముందే

  సీజన్ మొదలు కాక ముందే

  కానీ ఈ ఏడాది సీజన్ ప్రారంభం కాకముందే ఆ ఇబ్బందులు మొదలైనట్లు తెలుస్తోంది. కరోనా ప్రోటోకాల్ ప్రకారం ఇప్పటికే సెలెక్ట్ అయిన కంటెస్టెంట్ లను కొన్ని స్టార్ హోటల్స్ లో క్వారంటైన్ చేశారు. అయితే తెలుగు మీడియా వర్గాలలో జరుగుతున్న ప్రచారం మేరకు కంటెస్టెంట్ లుగా ఫైనల్ అయిన వారిలో కొంత మందికి కరోనా పాజిటివ్ అని తేలినట్లు తెలుస్తోంది. అయితే ఇది ప్రస్తుతానికి ప్రచారమే కాగా దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన మాత్రం వెలువడాల్సి ఉంది.

  ఫైనల్ లిస్టు ఇదేనా

  ఫైనల్ లిస్టు ఇదేనా

  ప్రస్తుతానికి జరుగుతున్న ప్రచారం మేరకు యూట్యూబ్ స్టార్ షణ్ముఖ్ జస్వంత్, టెలివిజన్ యాంకర్ రవి, నటి ప్రియా, ఆర్జే కాజల్, యాంకర్ లోబో, లహరి, సరయు కోయిలమ్మ ఫేమ్ మానస్, వీజే సన్నీ, యానీ మాస్టర్, టీవీ9 యాంకర్ ప్రత్యూష ఈ షో కోసం ఎంపికైనట్లు గా చెబుతున్నారు. అలాగే మహేష్ బాబు హీరోగా నటించిన సరిలేరు నీకెవ్వరు సినిమాలో రమణ లోడ్ ఎత్తాలి రా అనే డైలాగ్ తో పాపులర్ అయిన కుమనన్ సేతురామన్ కూడా హౌస్ లోకి ఎంటర్ అయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది. ఇక అఫిషియల్ లిస్టు అంటే షో ప్రారంభమైన మొదటి రోజు మాత్రమే షో పూర్తయ్యేలోపు క్లారిటీ వస్తుంది.

  Prabhas పై పెరుగుతున్న అక్కసు.. అప్పుడు రజినీ ఇప్పుడు డార్లింగ్ | Pan India || Filmibeat Telugu
  ప్లాన్ బీ రెడీ

  ప్లాన్ బీ రెడీ

  అయితే ఇప్పుడు ఎన్నుకున్న కంటెస్టెంట్ లలో కొంత మందికి కరోనా సోకడంతో వారికి కరోనా నెగిటివ్ వచ్చేవరకు లోపలికి పోవడం అసాధ్యం. ఈ నేపథ్యంలో షో వాయిదా పడే అవకాశాలు ఉన్నాయని ప్రచారం జరుగుతూ ఉండగా మరో వర్గం మాత్రం దీనిని ఖండిస్తోంది. ఎందుకంటే షో నిర్వాహకులు ముందే ప్లాన్ బీ రెడీ చేసుకుని ఉంటారని ఇప్పటికే కరోనా సోకిన కంటెస్టెంట్ ల ప్లేస్ లో వేరే వారిని ఎన్నుకుని వారిని కూడా క్వారంటైన్ చేసి ఉండే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. మరి చూడాలి ఈ విషయంలో ఏం జరగబోతోంది అనేది. బిగ్ బాస్ సీజన్ 5 సెప్టెంబర్ 5 నుండి 100 రోజుల పాటు జరుగుతుంది. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలో వెలువడనున్నాయి.

  English summary
  As per Some reports in telugu media Bigg Boss Telugu 5 Quarantined contestants tested COVID 19 positive.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X