Bigg Boss Telugu 9: బిగ్‌బాస్‌లోకి బ్రహ్మముడి కావ్య? దీపిక రంగరాజు ఎంట్రీ ఎప్పుడంటే?
తెలుగు ప్రేక్షకులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తోన్న బిగ్‌బాస్ తెలుగు 9 అట్టహాసంగా ప్రారంభమైంది. సెప్టెంబర్ 7వ తేదీన కింగ్ అక్కినేని నాగార్జున చేతుల మీదుగా కంటెస్టెంట్స్ అంతా బిగ్‌బాస్ హౌస్‌లో అడుగుపెట్టారు. ఈసారి సెలబ్రెటీలు, సామాన్యులకు కంటెస్టెంట్స్‌గా అవకాశం కల్పించారు. దాంతో ఆరుగురు సామాన్యులు, 9 మంది సెలబ్రెటీలతో కలిపి మొత్తం 15 మంది కంటెస్టెంట్స్ .. బిగ్‌బాస్ హౌస్‌లో అడుగుపెట్టారు. ఆదివారం కేవలం కంటెస్టెంట్స్ పరిచయ కార్యక్రమాలకే సరిపోగా.. సోమవారం నుంచి అసలు సిసలు రచ్చ మొదలు కానుంది.
వైల్డ్ కార్డ్ ఎంట్రీస్‌తో సీజన్ 8 సూపర్ హిట్
అయితే బిగ్‌బాస్‌లోకి వీరు కాకుండా మరికొంత మంది సెలబ్రెటీలు వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా అడుగుపెడతారని వార్తలు వస్తున్నాయి. బిగ్‌బాస్ తెలుగు 8 సీజన్‌లో వైల్డ్ కార్డ్ వ్యూహం బాగా వర్కవుట్ అయ్యింది. సీజన్ 8కి ప్రేక్షకుల ఆదరణ తగ్గుతున్న సమయంలో మెహబూబ్, గౌతమ్ కృష్ణ, గంగవ్వ, హరితేజ, రోహిణి, ముక్కు అవినాష్‌లు ఎంట్రీ ఇచ్చి టఫ్ కాంపీటిషన్ ఇచ్చారు. ముఖ్యంగా రోహిణి- అవినాష్‌లు ప్రేక్షకులను బాగా ఎంటర్‌టైన్ చేసి టీఆర్పీని పెంచారు.

వైల్డ్ కార్డ్ ద్వారా బిగ్‌బాస్‌లోకి దీపిక రంగరాజు
మెహబూబ్, గంగవ్వ, హరితేజలు, రోహిణిలు మధ్యలోనే ఎలిమినేట్ అయినప్పటికీ గౌతమ్ కృష్ణ, ముక్కు అవినాష్‌లు చివరి వరకు హౌస్‌లో నిలిచారు. గౌతమ్ విన్నర్ అవుతారని అనుకున్నప్పటికీ చివరికి బుల్లితెర నటుడు నిఖిల్ మలియాక్కల్ బిగ్‌బాస్ విన్నర్‌గా నిలిచాడు. అలా అన్ని రకాలుగా వైల్డ్ కార్డ్ ఎంట్రీ బిగ్‌బాస్‌కు ప్లస్‌గా నిలిచింది. అయితే ఈసారి కూడా వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ ఉంటాయని సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. ఈ వైల్డ్ కార్డ్ ఎంట్రీస్‌లో వినిపిస్తున్న తొలి పేరు బుల్లితెర నటి, బ్రహ్మముడి ఫేం కావ్య అలియాస్ దీపిక రంగరాజు.
అల్లరి పిల్ల కావ్య
తమిళనాడుకు చెందిన ఈ ముద్దుగుమ్మ.. అల్లరి పిల్లగా పేరు తెచ్చుకుంది. బ్రహ్మముడిలో లీడ్ రోల్ పోషిస్తూ రెండు రాష్ట్రాల ప్రజలను ఆకట్టుకుంటోంది. సీరియల్స్‌తో పాటు బుల్లితెరపై పలు కార్యక్రమాల్లో పాల్గొంటూ సందడి చేస్తుంది. వచ్చి రానీ తెలుగులో ఇష్టమొచ్చినట్లు మాట్లాడుతూ.. ఫన్ జనరేట్ చేస్తుంది. వాగుడుకాయ అనిపించుకున్నప్పటికీ విషయం ఉందని పలువురి చేత ప్రశంసలు పొందింది. గత సీజన్ చివరిలో గెస్ట్‌గా బిగ్‌బాస్‌లో అడుగుపెట్టి కంటెస్టెంట్స్‌లో ధైర్యం నూరిపోసింది.
బిగ్‌బాస్ 9 వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ ఎప్పుడు?
బిగ్‌బాస్ సీజన్ మొదలైనప్పుడల్లా కంటెస్టెంట్స్ లిస్ట్‌లో ఖచ్చితంగా ఆమె పేరు ఉంటుంది. కానీ తుది జాబితా వచ్చేసరికి మిస్ అవుతోంది. తనకు బిగ్‌బాస్‌లో పాల్గొనడం చాలా ఇష్టమని, కానీ తనకు ఇంత వరకు కాల్ రాలేదని పలుమార్లు దీపిక వాపోయింది. అవకాశం వస్తే మాత్రం వదిలిపెట్టనని దీపిక స్పష్టం చేసింది. దీంతో ఈసారి కంటెస్టెంట్స్ లిస్ట్‌లోనూ కావ్య పేరు వినిపించింది.
అయితే సెప్టెంబర్ 7న సెలబ్రెటీ లిస్ట్‌లో మాత్రం దీపిక రంగరాజు కనిపించలేదు. కానీ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా బ్రహ్మముడి కావ్య హౌస్‌లో అడుగుపెడుతుందని వార్తలు వస్తున్నాయి. అయితే అది ఎప్పుడు అనేది మాత్రం తెలియాల్సి ఉంది. బిగ్‌బాస్ తెలుగు 9లో కంటెస్టెంట్స్ పర్ఫార్మెన్స్, టీఆర్పీ రేటింగ్ చూసిన తర్వాత నిర్వాహకులు వైల్డ్ కార్డ్ ఎంట్రీస్‌పై నిర్ణయం తీసుకోనున్నారు. బిగ్‌బాస్ మొదలైంది కాబట్టి.. నాలుగు నుంచి ఆరు వారాల్లోపు వైల్డ్ కార్డ్ ఎంట్రీస్‌పై క్లారిటీ వచ్చే అవకాశం ఉందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.


Click it and Unblock the Notifications











