బిగ్ బాస్3: షాకింగ్.. మరోమారు బుల్లితెరపై మెగాస్టార్ చిరంజీవి!
Recommended Video

గత ఏడాది బిగ్ బాస్ తెలుగు సీజన్ 2 ప్రేక్షకులని ఎంతగానో అలరించింది. నేచురల్ స్టార్ నాని హోస్ట్‌గా వ్యవహరించాడు. కౌశల్ విజేతగా, సింగర్ గీత మాధురి రన్నరప్ గా నిలిచారు. నాని హోస్టింగ్ సీజన్ మొత్తం ఆకట్టుకుంది. గణేష్, నూతన్ నాయుడు లాంటి సాధారణ వ్యక్తులు బిగ్ బాస్ 2 ద్వారా సెలెబ్రిటీలుగా మారారు. వివాదాలు, సరదాలు, భావోద్వేగాలు ఇలా మధురమైన జ్ఞాపకాలని బిగ్ బాస్ 2 కంటెస్టెంట్స్ కు మిగిల్చింది. ఈ ఏడాది జరగబోయే బిగ్ బాస్ సీజన్ 3 కి సంబంధించి చర్చ మొదలైపోయింది. హోస్ట్ గా ఎవరు అయితే బావుంటుందని ఎవరి లెక్కలు వాళ్ళు వేసుకుంటున్నారు. ఇటీవల బిగ్ బాస్ నిర్వాహకులు విక్టరీ వెంకటేష్ తో సంప్రదింపులు జరిపినట్లు ప్రచారం జరిగింది. తాజాగా ఆ జాబితాలోకి మెగాస్టార్ చిరంజీవి కూడా చేరారు.

వెంకటేష్ అంటూ ప్రచారం
బిగ్ బాస్3 తెలుగు సీజన్ కు నిర్వాహకులు సన్నాహకాలు చేసుకుంటున్నారు. ముందుగా హోస్ట్ ని ఫైనల్ చేసి అందుకు తగ్గట్లుగా ఏర్పాట్లు చేసుకోవాలని భావిస్తుంటారు. బిగ్ బాస్ షో దేశ వ్యాప్తంగా సూపర్ సక్సెస్ అయిన షో. తెలుగులో కూడా ఈ షోకు మంచి ఆదరణ లభిస్తోంది. మూడవ సీజన్ కు విక్టరీ వెంకటేష్ హోస్ట్ అంటూ ఇటీవల ప్రచారం మొదలైంది. ఈ ప్రచారంలో వాస్తవం ఎంత ఉందొ తెలియదు కానీ మరో బిగ్ స్టార్ పేరు వినిపిస్తోంది.

మళ్ళీ బుల్లి తెరపై చిరంజీవి
ఇటీవల బిగ్ బాస్ నిర్వాహకులు మెగాస్టార్ చిరంజీవిని కూడా కలిశారట. చిరంజీవిని కలసి బిగ్ బాస్ షోకు హోస్ట్ గా వ్యవహరించే అంశమై చర్చలు జరిపినట్లు తెలుస్తోంది. మెగాస్టార్ చిరుకు ఇదివరకే బుల్లితెర అనుభవం ఉంది. మీలో ఎవరు కోటీశ్వరుడు షోకు హోస్ట్ గా వ్యవహరించారు. చిరు అనుభవం, క్రేజ్ దృష్ట్యా బిగ్ బాస్ నిర్వాహకులు ఆయన్ని ఒప్పించే ప్రయత్నం చేస్తున్నారని సమాచారం.

ఇద్దరిలో ఎవరో ఒకరు
విక్టరీ వెంకటేష్, మెగాస్టార్ చిరు ఇద్దరిలో ఎవరు ఒప్పుకున్నా హోస్ట్ గా ఫైనల్ చేయాలనీ నిర్వాహకులు భావిస్తున్నారు. ఇద్దరికీ ఎవరి ప్రత్యేకతలు వారికీ ఉన్నాయి. తొలి సీజన్ కు హోస్ట్ గా వ్యహరించిన ఎన్టీఆర్ షోని దిగ్విజయంగా నడిపించాడు. ఎన్టీఆర్ బిగ్ బాస్ 3కి హోస్ట్ గా మారడం కుదరదు. ఎందుకంటే ఎన్టీఆర్ రాజమౌళి చిత్రంతో బిజీగా ఉంటాడు. నాని మరోమారు హోస్ట్ గా వ్యవహరించేందుకు అంగీకరించలేదట.

పెరుగుతున్న ఉత్కంఠ
బిగ్ బాస్ 2 షోకు ఫ్యామిలీ ఆడియన్స్ నుంచి విమర్శలు ఎదురయ్యాయి. ఆ తప్పులని సరిచేసి బిగ్ బాస్ 3 షో నిర్వహించేందుకు సిద్ధం అవుతున్నారు. బిగ్ బాస్ 2 దాదాపు మూడున్నర నెలలపాటు సాగింది. బిగ్ బాస్ 3ని త్వరగా ముగిస్తారా లేక ఇంకా పొడిగిస్తారా అనేది చూడాలి. బిగ్ బాస్ షోకు యువత నుంచి అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది. ఈ ఏడాది నుంచి నుంచి బిగ్ బాస్ 3 ప్రారంభం అయ్యే అవకాశాలు కనిపిస్తన్నాయి.


Click it and Unblock the Notifications











