మెగా హీరో చిత్రంలో కౌశల్.. కీలకపాత్ర కోసం ఆఫర్
బిగ్‌బాస్ తెలుగు విజేత కౌశల్ మీడియాలో హాట్ సెన్సేషన్‌గా నిలుస్తున్నాడు. తన ఆటతీరు, ప్రవర్తనతో లక్షలాది మంది ప్రేక్షకులను ఆకట్టుకొని కౌశల్ బిగ్‌బాస్ టైటిల్‌ను గెలుచుకొన్నాడు. ఇప్పుడు కౌశల్ దృష్టి అంతా టాలీవుడ్‌పైనే. ఏ దర్శకుడు, ప్రొడక్షన్ హౌస్ నుంచి కాల్ వస్తుందో అనే వెయిటింగ్‌లో ఆయన ఉన్నాడు. ఇప్పటికే తెలుగు సినిమా పరిశ్రమ నుంచి పెద్ద ఎత్తున్న ప్రశంసల జల్లు కురుస్తున్నది. అయితే కౌశల్‌కు వచ్చిన భారీ సినిమా అవకాశం గురించిన వార్త వైరల్‌గా మారింది. ఆ వార్త సారాంశం ఏమిటంటే..

రాంచరణ్ మూవీలో
మెగా పవర్‌స్టార్ రాంచరణ్, దర్శకుడు బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో RC12 చిత్రం శరవేగంగా తెరకెక్కుతున్నది. ఈ చిత్రంలో భరత్ అనే నేను ఫేమ్ కియారా అద్వానీ నటిస్తున్నది. బిగ్‌బాస్ విజేతగా నిలిచిన తర్వాత ఓ కీలక పాత్రను కౌశల్‌కు ఆఫర్ చేసినట్టు తెలుస్తున్నది.

బుల్లితెరతొ బిజీబిజీ
బిగ్‌బాస్‌కు ముందు.. తర్వాత టెలివిజన్ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నాడు. సూర్యవంశం అనే సీరియల్‌తో బిజీగా ఉన్నాడు. బిగ్‌బాస్ నుంచి వచ్చిన తర్వాత అధికారికంగా టాలీవుడ్ సినిమాలో ఆఫర్ వచ్చినట్టు ప్రకటించలేదు. దాంతో ఈ వార్తపై అనుమానాలు రేకెత్తుతున్నాయి.

కౌశల్ ఆర్మీ సభ్యుల డిమాండ్
బిగ్‌బాస్ టైటిల్ గెలుచుకొన్న తర్వాత కౌశల్ ఓ సమావేశంలో మాట్లాడాడు. ఆ సందర్బంగా కౌశల్ ఆర్మీ సభ్యులు హీరో.. హీరో అంటూ నినాదాలు చేశారు. టాలీవుడ్ చిత్రాల్లో నటించాలని ఆకాంక్షించారు. ఆ సందర్భంగా దర్శకులు మనకు అవకాశం ఇస్తే హీరోగా నటిస్తాను. మరోసారి నా సత్తా ఏంటో చూపిస్తాను అని కౌశల్ చెప్పారు.

అధికారిక ప్రకటన రాకపోవడంతో
బిగ్‌బాస్ తర్వాత కౌశల్ క్యారెక్టర్, విలన్ పాత్రలు చేస్తాడా? లేక హీరో పాత్రలే చేస్తారా అనే విషయంపై క్లారిటీ లేదు. అయితే రాంచరణ్ తన 12వ చిత్రంలో కౌశల్‌కు ఆఫర్ ఇచ్చారనే విషయంపై అధికారికంగా ప్రకటన వస్తే ఆ వార్తకు బలం చేకూరుతుంది. లేకపోతే రూమర్‌గానే మిగిలిపోతుంది.

దర్శకుల అభినందన
బిగ్‌బాస్ విజేతగా నిలిచిన తర్వాత దర్శకులు మారుతి, అనిల్ రావిపూడి, త్రిపురనేని తదితరులు కౌశల్‌ను అభినందించారు. మరికొంత మంది సినీ వర్గాలు బిగ్‌బాస్ విజేతను ప్రశంసలతో ముంచెత్తుతున్నారు. మీడియా ఇంటర్వ్యూల సందర్బంగా స్వయంగా ఫోన్ చేసి అభినందిస్తున్నారు.


Click it and Unblock the Notifications











