బిగ్‌బాస్‌ లీక్: ఆ సెలబ్రిటీ అవుట్? తృటిలో తప్పించుకొన్న అమిత్

By Rajababu

బిగ్‌బాస్‌లో ఎలిమినేషన్ ప్రక్రియ ఆదివారం జరుగబోతున్నది. ఆదివారం ప్రసారమయ్యే ఎపిసోడ్‌కు సంబంధించిన షూట్‌ను శనివారమే పూర్తి చేస్తారన్న సంగతి తెలిసిందే. అయితే బిగ్‌బాస్‌ తెలుగు రియాలిటీ షో నుంచి శ్యామల ఎలిమినేట్ అయినట్టు వార్తలు బయటకు వచ్చాయి. అయితే స్వల్ప ఓట్ల తేడాతో అమిత్ బతికిపోయారని విశ్వసనీయ వర్గాల సమాచారం. వివరాల్లోకి వెళితే..

గీతా మాధురి లభించిన ఓటింగ్ అవకాశంతో

గీతా మాధురి లభించిన ఓటింగ్ అవకాశంతో

90వ రోజు ముగిసిన తర్వాత ఈ వారం నామినేషన్‌లో కౌశల్, దీప్తి నల్లమోతు, శ్యామల ఉన్నారు. అయితే గీతా మాధురికి లభించిన ఓటింగ్ అవకాశంతో కౌశల్‌ను ఈ సీజన్ ముగిసేంతవరకు నామినేట్ చేశారు.

 అమిత్ గేమ్ తీరుపై

అమిత్ గేమ్ తీరుపై

అమిత్ తివారీ చాలా సేఫ్ గేమ్ ఆడుతారని ఇంట్లో అతనికి పేరుంది. ఇంటి వ్యవహారాల్లో తలదూర్చకుండా కీలక సమయాల్లో తప్పించుకు తిరుగుతుంటాడని పలు సందర్భాల్లో నాని స్వయంగా చెప్పారు. చాలా వారాలు ముగిసిన తర్వాత కూడా నీవు గేమ్ ఆడటం లేదని అమిత్‌ను మందలించారు.

స్వల్ప తేడాతో శ్యామల

స్వల్ప తేడాతో శ్యామల

తాజాగా బిగ్‌బాస్ నుంచి బయటకు వచ్చిన ఓటింగ్ లిస్టులో అమిత్ చివరి నుంచి రెండో స్థానంలో ఉన్నప్పటికి.. ఓటింగ్ లైన్లు ముగిసే సమాయానికి ఆయన పుంజుకొన్నట్టు సమాచారం. చివరి రౌండ్ కౌంటింగ్‌లో శ్యామల తక్కువ తేడాతో బిగ్‌బాస్ ఇంటి నుంచి బయటకు వెళ్లినట్టు తెలిసింది.

 కౌశల్ ఆర్మీ మద్దతుతో

కౌశల్ ఆర్మీ మద్దతుతో

కౌశల్‌‌కు ఇంట్లో మద్దతు లేకపోయినా బయట, సోషల్ మీడియాలో మంచి సపోర్ట్ ఉంది. కౌశల్ ఆర్మీ బయట బలంగా పనిచేస్తున్నది. కౌశల్ ఎన్నిసార్లు నామినేట్ అయినా గానీ చాలా సులభంగా బయటపడుతున్నారు. దాంతో కౌశల్‌కు ఎలిమినేషన్ ముప్పు లేదని స్పష్టంగా తెలుస్తున్నది.

దీప్తి నల్లమోతు టాప్ గేమ్‌

దీప్తి నల్లమోతు టాప్ గేమ్‌

ఇక దీప్తి నల్లమోతు ఇటీవల కాలంలో బాగా పుంజుకొన్నది. గతంలో పెద్దగా ప్రభావం చూపలేకపోయిన దీప్తి.. కొన్ని రోజులుగా తన మాటలు, హావభావాలు, యాక్టివిటీలతో టాప్ రేసులోకి దూసుకొచ్చారు. ఫిజికల్ టాస్క్‌లో అయితే గట్టిగా సవాల్ విసురుతున్నారు.

శ్యామల రీఎంట్రీ తర్వాత

శ్యామల రీఎంట్రీ తర్వాత

శ్యామల ఓ సారి అవుట్ అయి రీ ఎంట్రీ ఇచ్చింది. బయట జరుగుతున్న పరిస్థితులపై స్పష్టమైన అవగాహన ఉంది. కాబట్టి కొంత సేఫ్ గేమ్, మరికొంత టీం గేమ్ ఆడుతున్నది. అయినా ఈమెకు ఎలిమినేషన్ ప్రతీ వారం కొనసాగుతున్నది.

90 ఓట్ల తేడాతో

90 ఓట్ల తేడాతో

బిగ్‌బాస్‌లో 91వ రోజున జరిగే ఎలిమినేషన్‌లో శ్యామలపై సుమారు 90 ఓట్ల తేడాతోఅమిత్ తివారీ బయటపడినట్టు సోషల్ మీడియాలో మాటలు వినిపిస్తున్నాయి. ఒకవేళ అమిత్‌ అవుట్ అయితే కమల్ హాసన్ ఇచ్చిన ప్రత్యేకమైన హక్కు ద్వారా తన స్థానాన్ని నిలబెట్టుకోవడంలో సఫలమైనట్టే భావించాలి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X