బిగ్‌బాస్ విన్నర్ కౌశల్ మరో ఝలక్.. అలా చేస్తే రికార్డే...!
బిగ్‌బాస్2 రియాలిటీ షోలో సెన్సేషనల్ సృష్టించిన కౌశల్ చివరకు విజేతగా నిలిచిన సంగతి తెలిసిందే. బిగ్‌బాస్2 కొనసాగుతుండగానే విశేష ప్రేక్షకాదరణను, అభిమానులను సొంతం చేసుకొన్నాడు. బిగ్‌బాస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత కౌశల్‌పై అశేష అభిమానాన్ని ప్రేక్షకులు కుమ్మరించారు. అయితే బిగ్‌బాస్3 ప్రారంభం కావడానికి ఇంకా సమయం ఉన్నప్పటికీ.. అప్పుడే ఆ రియాలిటీ షోకు సంబంధించిన కథనాలు మీడియాలో ప్రముఖంగా వినిపిస్తున్నాయి. వివరాల్లోకి వెళితే..

బిగ్‌బాస్3 షో హోస్ట్‌గా వెంకటేష్
బిగ్‌బాస్3 షోకు వెంకటేష్ హోస్ట్ అని, చిరంజీవి హోస్ట్ అని స్టోరీలు ఫుష్కలంగా వినిపిస్తున్నాయి. అదే ప్రచారంలో ఇప్పుడు కౌశల్ పేరు కూడా మార్మోగుతున్నది. కౌశల్ పేరును కూడా హోస్ట్‌గా పరిశీలనలోకి తీసుకొన్నట్టు తెలుస్తున్నది.

జోరుగా రూమర్లు
అయితే కౌశల్ పేరు వినిపిస్తున్నప్పటికీ.. అతడి నుంచి ఎలాంటి స్పందన వినిపించలేదు. అలాగని ఖండించనూ లేదు. బిగ్‌బాస్ హోస్ట్‌పై కొనసాగుతున్న ప్రచారానికి అడ్డుకట్ట వేయాలంటే మా టెలివిజన్ గానీ, లేదా కౌశల్ గానీ మీడియాలో స్పందించక తప్పదు.

ఒకవేళ కౌశల్ హోస్ట్ అయితే
ఒకవేళ బిగ్‌బాస్ హోస్ట్‌గా కౌశల్ వ్యవహరిస్తే టెలివిజన్ ఇండస్ట్రీలో ఓ రికార్డుగా మారే అవకాశం ఉంది. ఈ రియాలిటీ షోలో పాల్గొన్న సెలబ్రిటీ హోస్ట్‌గా వ్యవహరించిన దాఖలాలు లేవు. కౌశల్ హోస్ట్‌గా వ్యవహరిస్తే ప్రత్యేక ఘనతను సాధించిన వ్యక్తిగా పేరును సొంతం చేసుకొనే అవకాశం ఉంది.

గతంలో ఎన్టీఆర్, నాని గుడ్ బై
గతంలో తెలుగు బిగ్‌బాస్ షో తొలి సీజన్‌కు యంగ్ టైగర్ ఎన్టీఆర్, రెండో సీజన్‌కు నేచురల్ స్టార్ నాని హోస్ట్‌గా వ్యవహరించారు. అయితే షూటింగ్‌ల బిజీ కారణంగా తొలి సీజన్ తర్వాత ఎన్టీఆర్, రెండో సీజన్ తర్వాత నాని గుడ్ బై చెప్పారు. దాంతో మూడో సీజన్‌కు హోస్ట్‌ను వెతికే పనిలో మా టెలివిజన్ పడింది.


Click it and Unblock the Notifications











