త్రిషా కృష్ణన్‌కు బిగ్‌షాక్? విజయ్ పార్టీ అభ్యర్ధిగా రాఘవ లారెన్స్?

తమిళ రాజకీయాలు ఊహించని మలుపు తిరుగుతున్నాయి. ఎగ్జిట్ పోల్స్ అంచనాలను తలకిందులు చేస్తూ రాష్ట్ర ముఖ్యమంత్రిగా పాలనా పగ్గాలు చేపట్టిన దళపతి విజయ్.. తన మార్క్ చూపించేందుకు ప్రయత్నిస్తున్నారు. ఎన్నికల్లో విజయ్ శ్రీ పెరంబూర్, తిరుచ్చి ఈస్ట్‌ల నుంచి పోటీ చేసి భారీ మెజారిటీతో గెలుపొందారు. అయితే ఒక స్థానాన్ని వదులుకోవాల్సి రావడంతో పెరంబూర్‌ని ఉంచుకుని.. తిరుచ్చి ఈస్ట్ ఎమ్మెల్యేగా రాజీనామా చేయనున్నారు. దాతో తిరుచ్చి ఈస్ట్‌ ఉప ఎన్నిక ప్రస్తుతం తమిళ రాజకీయాల్లో చర్చనీయాంశమైంది.

ఏ క్షణంలోనైనా ఇక్కడ ఉప ఎన్నిక వచ్చే అవకాశం ఉంది.. దాంతో అన్ని పార్టీలు అభ్యర్ధిని ఎంపిక చేసేందుకు వ్యూహాలు రచిస్తున్నాయి. అయితే అందరి చూపు విజయ్ పార్టీపైనా నెలకొంది. ఇక్కడి నుంచి విజయ్ సన్నిహితురాలు, కోలీవుడ్ అగ్రనటి త్రిషా కృష్ణన్ బరిలో దిగుతారని ఎప్పటి నుంచో ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఇక్కడ త్రిష గెలిస్తే నేరుగా ప్రభుత్వంలోనూ కీలక పాత్ర పోషిస్తారని కోలీవుడ్‌లో వార్తలు వైరల్ అవుతున్నాయి. తనకు రాజకీయాలంటే ఇష్టమని, ఎప్పటికైనా తమిళనాడు సీఎం అవుతానని త్రిష గతంలో చెప్పిన మాటలను విశ్లేషకులు ప్రస్తావిస్తున్నారు.

Bigg Shock to Trisha Krishnan Is Raghava Lawrence Set to Contest Tiruchirappalli East By-Election

ప్రస్తుతం అగ్రనటిగా కెరీర్‌లో మంచి పీక్స్‌లో ఉన్నారు. వరుస హిట్స్‌ని తన ఖాతాలో వేసుకుంటున్నారు త్రిష. అయితే వయసు పెరుగుతుండటంతో గతంలో మాదిరిగా ఆఫర్లు వస్తాయా? ఇదే స్టార్ డమ్ కంటిన్యూ అవుతుందా? అన్న వాదనలు వినిపిస్తున్నాయి. అందుకే రాజకీయాల్లోకి ఎంట్రీ ఇవ్వాలని త్రిష కూడా ప్లానింగ్‌లో ఉన్నారని కోలీవుడ్ సర్కిల్స్‌గా గుసగుసలు వినిపిస్తున్నాయి. తన స్నేహితుడు విజయ్ సీఎం కావడంతో టీవీకేలో చేరి.. తిరుచ్చి ఉప ఎన్నికలో అదృష్టం పరీక్షించుకోవాలని త్రిష భావిస్తున్నారని వార్తలు వస్తున్నాయి.

అయితే సీఎం విజయ్ ఆలోచనలు మరో రకంగా ఉన్నాయి. తిరుచ్చి ఈస్ట్‌ స్థానాన్ని ఉన్నత విద్యావంతులకు, మాజీ బ్యూరోక్రాట్లకు లేదంటే సమాజ సేవలో ముందున్న వారికి కేటాయించాలని టీవీకే చీఫ్ భావిస్తున్నారట. ఈ క్రమంలోనే మాజీ ఐఏఎస్ సగాయం పేరు తెరపైకి వచ్చింది. అవినీతిపై పోరాటం చేసిన వ్యక్తిగా, అత్యంత నిజాయితీ గల అధికారిగా సగాయంకు ప్రజల్లో మంచి గుర్తింపు ఉంది. ఆయనకు ఉన్న ప్రజాదరణ, క్లీన్ ఇమేజ్ తన టీవీకేకు మంచి బలాన్ని, ప్రజల్లో మంచి పేరును తీసుకొస్తుందని విజయ్ ఆశిస్తున్నారు.

ఇప్పుడు తాజాగా తిరుచ్చి ఈస్ట్‌లో టీవీకే అభ్యర్ధిగా ఎవరూ ఊహించని పేరు తెరపైకి వచ్చింది. సినీనటుడు, దర్శకుడు రాఘవ లారెన్స్‌ను తమ పార్టీ అభ్యర్ధిగా విజయ్ ఖరారు చేసినట్లుగా వార్తలు వస్తున్నాయి. సినిమాలతో పాటు సామాజిక సేవా కార్యక్రమాల్లో లారెన్స్ ముందుంటారు. ఎలాంటి గాడ్ ఫాదర్ లేకుండా సినీ పరిశ్రమలో తనకంటూ గుర్తింపు తెచ్చుకున్నారు. పైగా వివాదాలకు దూరంగా ఉండే వ్యక్తి కావడం లారెన్స్‌ పట్ల విజయ్‌కి మంచి అభిప్రాయం ఉంది. వీరిద్దరికీ తొలి నుంచి సన్నిహిత సంబంధాలు ఉన్నాయి.. అలాగే ఎన్నికల్లో గెలిచిన వెంటనే విజయ్‌కి లారెన్స్ అభినందనలు తెలిపారు.

యువతలో, ప్రజల్లో మంచి క్రేజ్ ఉన్న లారెన్స్ కూడా రాజకీయాల్లోకి వస్తారని గతంలో పలుమార్లు ఊహాగానాలు వెలువడగా.. వాటిని ఆయన ఖండించారు. అలాంటిది ఇప్పుడు ఏకంగా ఈ స్థాయిలో గాసిప్స్ వైరల్ అవుతుండటం విశేషం. అయితే తన గురువు, కోలీవుడ్ సూపర్‌స్టార్ రజనీకాంత్ సలహా మేరకు లారెన్స్ ఒక నిర్ణయం తీసుకుంటారని కోలీవుడ్‌లో గుసగుసలు వినిపిస్తున్నాయి. లారెన్స్ నుంచి గ్రీన్ సిగ్నల్ వచ్చిన వెంటనే తిరుచ్చి ఈస్ట్‌కి టీవీకే అభ్యర్ధిగా ఆయన అభ్యర్ధిత్వాన్ని ముఖ్యమంత్రి విజయ్ అధికారికంగా ఖరారు చేస్తారని అంటున్నారు. లారెన్స్ నిజంగానే టీవీకేలో చేరనున్నారా? తిరుచ్చి ఈస్ట్ ఉప ఎన్నికలో పోటీ చేస్తారా? త్రిషకు విజయ్ ఎలా న్యాయం చేస్తారు? ఈ ప్రశ్నలకు సమాధానం తెలియాలంటే కొద్దిరోజులు వెయిట్ చేయాల్సిందే.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X