ఏకంగా సూపర్ స్టార్ దగ్గరకు వెళ్లిన బింబిసార దర్శకుడు.. మరో బిగ్ బడ్జెట్ మూవీ!

ఇటీవల కాలంలో కొంతమంది యువ దర్శకులు మొదటి సినిమాతోనే ఊహించిన విధంగా భారీ స్థాయిలో విజయాలను సొంతం చేసుకుంటున్నారు. ఇక ఆ తర్వాత రెండవ సినిమాతోనే అగ్ర హీరోలను సెలెక్ట్ చేసుకుంటూ వారి స్థాయిని మరింత పెంచుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇక బింబిసార సినిమాతో బాక్సాఫీస్ వద్ద సంచలన విజయాన్ని సొంతం చేసుకున్న మరో యంగ్ డైరెక్టర్ వశిష్ట రెండవ సినిమాతో కూడా భారీ స్థాయిలోనే సక్సెస్ అందుకోవాలి అని రెడీ అయ్యే ప్రయత్నం చేస్తున్నాడు.

అసలైతే బింబిసార సినిమా సక్సెస్ కాగానే ఆ సినిమాకు సీక్వెల్ కూడా ఉంటుంది అని చిత్ర యూనిట్ సభ్యులు క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు. కానీ అది వెంటనే ఉండదు అని ఆ తర్వాత మళ్ళీ వివరణ ఇచ్చారు. అంతేకాకుండా జూనియర్ ఎన్టీఆర్ తో కూడా ఈ దర్శకుడు సినిమా చేసే అవకాశం ఉన్నట్లు మధ్యలో కొన్ని కథనాలు వచ్చాయి. కానీ ఇంతవరకు ఆ విషయంలో అయితే ఇలాంటి క్లారిటీ ఇవ్వలేదు. కానీ ఇప్పుడు దర్శకుడు వశిష్ట ఏకంగా ఒక సూపర్ స్టార్ దగ్గరికి వెళ్లినట్లుగా తెలుస్తోంది. ఆ సూపర్ స్టార్ మరెవరో కాదు. తలైవా రజినీకాంత్ అని ఇండస్ట్రీలో ఒక బలమైన టాక్ అయితే వినిపిస్తోంది. రజినీకాంత్ సినిమా సక్సెస్ తర్వాత ప్రత్యేకంగా దర్శకుడిని పిలిచి మరి అభినందించినట్లు సమాచారం.

Bimbisara Director Mallidi Vasishta second project planing with super star

అయితే మంచి కథ ఉంటే చెప్పండి అని కూడా వశిష్టకు తెలియజేయడంతో అతను ఒక నెల రోజుల్లోనే ఒక స్పెషల్ స్టోరీ గురించి చెప్పినట్లుగా తెలుస్తోంది. అది కూడా డిఫరెంట్ ఫాంటసీ అడ్వెంచరని టాక్ కూడా వినిపిస్తోంది. ప్రస్తుతం రజనీకాంత్ కూడా విభిన్నమైన సినిమాలను ఎక్కువగా చేసేందుకు ఆసక్తిని చూపిస్తున్నారు. కబాలి తర్వాత ఆయనకు సరైన విజయాలు లేకపోయినప్పటికీ గ్యాప్ లేకుండా సినిమాలు అయితే ఒప్పుకుంటున్నారు. ఇక ఇప్పుడు వశిష్ట చెప్పిన కథకు ఒప్పుకున్నారా లేదా అనే విషయంలో మాత్రం ఇంకా క్లారిటీ రాలేదు. కానీ అతను మాత్రం ఒక కథను చెప్పినట్లుగా తెలుస్తోంది. ఇక రజనీకాంత్ ప్రస్తుతం జైలర్ అనే సినిమా చేస్తున్నాడు. బీస్ట్ సినిమా దర్శకుడు నెల్సన్ దిలీప్ కుమార్ ఆ సినిమాను డైరెక్ట్ చేస్తున్న విషయం తెలిసిందే.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X