మాజీ ప్రియుడితో సెక్సీ లేడీ చెట్టాపట్టాల్
ముంబై: బాలీవుడ్ సెక్సీ లేడీ బిపాసా బసు కొన్నాళ్ల పాటు జాన్ అబ్రహంతో సహజీవనం చేసి గత సంవత్సరం విడిపోయిన సంగతి తెలిసిందే. జాన్‍తో విడిపోయాక బిపాసా ఒంటరిగానే ఉంటోంది. ఒంటరి తనం తట్టుకోలేక బిపాసా మరో మగాడి తోడు కోసం ఎదురు చూస్తుందనే వార్తలు కూడా వినిపించాయి. ఈ క్రమంలో మన తెలుగు హీరో రాణాతో ఎఫైర్ పెట్టుకున్నట్లు ఆ మధ్య గాసిప్స్ గుప్పుమన్న సంగతి తెలిసిందే. అయితే అంత సీన్ లేదని రాణా ఆ విషయాన్ని ఖండించాడు.
తాజాగా బిపాసా తన మాజీ ప్రియుడు డినో మోరియాతో చెట్టాపట్టాలేసుకుని తిరుగుతోంది. బిపాసా నటించని 'రాజ్-3' ఇటీవల విడుదలైన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ముంబై సబ్ అర్భన్‌లో ఓ థియేటర్లో రాజ్-3 సినిమా చూడటానికి తన మాజీ ప్రియుడు డినో మోరియాతో కలిసి వచ్చింది. పైన కనిపిస్తున్న ఫోటో అదే.
జాన్ అబ్రహం పరిచయం కాక ముందు బిపాసా-డినో మోరియా మధ్య ఎఫైర్ ఉండేది. అయితే జాన్ బిపాసా జీవితంలోకి ప్రవేశించాక ఇద్దరూ విడిపోయారు. జాన్ అబ్రహంతో 9 ఏళ్ల పాటు సాగిన బంధం తెగి పోవడంతో...బిపాసా మళ్లీ తన మాజీ బాయ్ ఫ్రెండ్ అయిన డినో మోరియాకు దగ్గరవ్వడానికి ఆసక్తి చూపుతోంది. ఏంటి సంగతి అని బిపాసాను కదిలించగా.... తాము మంచి ఫ్రెండ్స్ అని బదులిచ్చింది. మాజీ ప్రియుడితో బిపాసా వ్యవహారం ఎక్కడి వరకు వెలుతుందో చూడాలి.


Click it and Unblock the Notifications











