రాణా దగ్గుబాటికి మళ్లీ దగ్గరైన బిపాసా
బాలీవుడ్ అందాల భామ బిపాసా బసు తెలుగు నటుడు రాణా దగ్గుబాటికి మళ్లీ దగ్గరైందట. సాహిద్ కపూర్‌తో పొసగని ఆమె మళ్లీ రాణా దగ్గుబాటినే వెతుక్కుంటూ వచ్చిందని అంటున్నారు. పదేళ్ల పాటు జాన్ అబ్రహంతో సాగిన ప్రేమాయణానికి తెర పడడంతో ఆమె దమ్ మారో దమ్ సినిమాలో తనతో పాటు నటించిన రాణాకు దగ్గరైనట్లు ఊహాగానాలు చెలరేగాయి. బిపాసాతో తనకు గల సంబంధంపై తామిద్దరం మంచి మిత్రులమని మాత్రమే దగ్గుబాటి రాణా మాట్లాడాడు. అంతకు మించి ఏమీ మాట్లాడలేదు. కొంత కాలం జోష్ హర్నెట్‌తో బిపాసా అఫైర్ నడిపినట్లు పుకార్లు షికార్లు చేశాయి.
రోహన్ సిప్పీ దమ్ మారో దమ్ సినిమా షూటింగులో బిపాసా, రాణా దగ్గరైనట్లు చెబుతారు. ఫిట్నెస్ శిక్షణ ఇచ్చే అబ్బాస్ ద్వారా షాహిద్ కపూర్, బిపాసా దగ్గరయ్యారు. షాహిద్ కపూర్‌తో విభేదించి ఆమె దూరమైనట్లు చెబుతారు. ఇప్పుడు మళ్లీ ఆమె రాణా సాన్నిహిత్యంలో సేద తీరుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈసారి మునుపటిలా కాకుండా బంధాన్ని గట్టి పరుచుకోవాలని ఆ ఇద్దరు అనుకుంటున్నారట.


Click it and Unblock the Notifications











