ఈ సంవత్సరమే బిపాసా పెళ్లి?
జనవరి 7తో 34వ వడిలోకి అడుగు పెడుతున్న బిపాసా 2012లో మ్యారేజ్ చేసుకోవాలనే నిర్ణయానికి వచ్చిందట. ఈ సంవత్సరం పలు భారీ బాలీవుడ్ ప్రాజెక్టులతో పెళ్లి చేసుకునే తీరిక లేనంత బిజీగా బిపాసా గడుపుతున్నప్పటికీ, ఈ సంవత్సరమే ఆమెకు పెళ్లి యోగం ఉందని అంటున్నారు జోతిష్య నిపుణులు. బిపాసా జాతకం ప్రకారం ఈ సంవత్సరం పెళ్లి చేసుకోకుంటే ఆమె జీవితంలో అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకుంటాయట. దీంతో ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ సంవత్సరమే పెళ్లి తంతు పూర్తి చేసుకోవాలని చూస్తోందట ఈ సెక్సీ లేడీ. లవర్ జాన్ అబ్రహంతో తెగదెంపులు చేసుకున్న బిపాసా ఎవరిని ఫెళ్లి చేసుకుంటుందనే విషయం మాత్రం ఇప్పటికీ ఇంకా సస్పెన్స్ గానే ఉంది.
తెలుగు హీరో రాణా దగ్గుబాటికి, బిపాసా బసు మధ్య ప్రేమాయణం సాగుతున్నట్లు గత కొంత కాలంగా వార్తలు వినిపిస్తున్న సంగతి తెలిసిందే. అయితే రాణా మాత్రం ఈ వార్తలను అనేకసార్లు ఖండించారు. మరి బిపాస పెళ్లిపై రాణా స్పందన ఎలా ఉంటుందో? చూడాలి.


Click it and Unblock the Notifications











