రాణాతో ఆ రాత్రంతా ఎంజాయ్ చేసిన బిపాషా!
బాలీవుడ్ సెక్స్ బాంబ్ బిపాషా బసుతో కలిసి మన తెలుగు హీరో రాణా దగ్గుబాటి దమ్ మారో దమ్ సినిమాలో రొమాన్స్ చేసిన విషయం తెలిసిందే. తన మాజీ లవ్వర్ జాన్ అబ్రహం లాంటి పర్సనాలిటీ, ధారుడ్యం గల మన కుర్రోడు బిప్స్ కు తెగనచ్చేశాడు. ఆ సినిమా షూటింగ్ జరిగినంత కాలం బాగానే ఎంజాయ్ చేసింది అతనితో. అప్పట్లో వీళ్ల మధ్య 'సం"బంధం ముదురుతుందనే వార్తలు కూడా వచ్చాయి. అయితే అంతలోపే షూటింగ్ అయిపోవడం, రాణా ముంబై నుంచి హైదరాబాద్ వచ్చేయడం జరిగి పోవడంతో దూరం కాస్త పెరిగింది.
ప్రస్తుతం పాత బాయ్ ఫ్రెండ్ జాన్ అబ్రహంకు దూరమైన బిపాషా ఒంటరి తనాన్ని భరించలేక పోతోందట. ఎవరిని గోకుదామన్నాగానీ, తన దారికి వచ్చే పరిస్థితి లేదు. ఈ తరుణంలో మళ్లీ బిపాషా కంట్లో పట్డాడు మన రాణా. ముంబైలో పారిస్ హిల్టన్ కోసం ఏర్పాటు చేసిన ఓ పార్టీలో రాణా కనిపించడంతో రాత్రంతా అతన్ని విడకుండా డాన్స్ చేస్తూ తెగ ఎంజాయ్ చేసిందట బిపాష.
ఈ పార్టీకి బిపాషా, రాణాతో పాటు సుస్మితా సేన్, కంగనా రనౌత్, షాజన్ పదంసి, గుల్ పనాగ్, మరియు మరికొందరు బాలీవుడ్ ప్రముఖులు హాజరయ్యారు. అయితే అందరితో కలిసి ఉండకుండా రాణాను పక్కకు లాక్కెల్లి తన వరహ వేదనను తీర్చుకుందని బాలీవుడ్ గుసగుస. పాపం రాణా మరి ఇష్టంగానే ఆమెకు కంపెనీ ఇచ్చాడా? లేక తనకంటే పెద్ద స్టార్, కాదంటే బాగుండదని బలవంతంగా కమిట్ అయ్యాడా? అనేది తేలాల్సి ఉంది.


Click it and Unblock the Notifications











