పవన్‌తో ఐటంకు రూ.కోటి అడుగుతున్న బిపాసా
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా 'గబ్బర్ సింగ్' సినిమా రూపొందుతున్న విషయం తెలిసిందే. హారిష్ శంకర్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తోంది. సల్మాన్ ఖాన్ హీరోగా రూపొందిన బాలీవుడ్ 'దబాంగ్' సినిమాకు ఇది రీమేక్.
దబాంగ్ సినిమాలో 'మున్ని బదనాం హుయే' పాటను గబ్బర్ సింగ్ లో ప్లాన్ చేశారు. ఈ ఐటం సాంగు చేయడానికి బాలీవుడ్ సెక్స్ బాంబ్ బిపాస బసును సంప్రదించారు దర్శక నిర్మాతలు. దర్శకుడు హారిష్ శంకర్ సన్నిహితుల నుంచి అందిన సమాచారం ప్రకారం బిపాస ఈ ఐటం సాంగు చేయడానికి రూ. కోటి డిమాండ్ చేసిందని, అయితే రూ. 50 లక్షలు ఇవ్వడానికి దర్శక నిర్మాతలు సిద్దం అయ్యారని, సంగం డబ్బుతో నా అందాలను పవన్ కళ్యాణ్ సినిమా కోసం దార పోయలేనని బిపాస తేల్చి చెప్పినట్లు సమాచారం.
గబ్బర్ సింగ్ సినిమా ఇటీవల పొల్లాచ్చిలో తొలి షెడ్యూల్ పూర్తి చేసుకుంది. జనవరి రెండో వారం నుంచి రెండో షెడ్యూల్ ప్రారంభం కానుంది. ఇదివరకు పవన్ నటించిన తీన్ మార్ చిత్రాన్ని నిర్మించిన గణేష్ బాబు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.


Click it and Unblock the Notifications











