బిపాషా యేం చేసినా....

బహిరంగంగా ప్రియుడుతో షాపింగ్ చేస్తూ మళ్లీ మునపటిలా కెమోరా కళ్ళలో పడుతోంది.యేంటి మార్పు అంటే సక్సెస్ మేటర్స్ అని చెపుతోంది.అందులోనూ రేస్ లో కత్రినా కైఫ్..సమీరా రెడ్డిలు నటించినా బిపాషా కే ఎక్కువ మార్కులు పడటంతో చాలా ఆనందంగా ఉంది.దాంతో రెమ్యునేషన్ కూడా పెంచి నిర్మాతలను బెదరకొట్టే పనిలో ఉంది.అంతే గాక ప్రియడు తో కలసి ఓ హై క్లాస్ రెస్టారెంట్ ఒకటి తెరవాలని ప్లానులు చేస్తోందిట.ఇది గమనించిన ఆ ముంబయి మసాళా పత్రిక సక్సెస్ ఎంత పనైనా చేస్తుంది.విజయం విడిపోయిన వాళ్ళని కలుపుతుంది అని తిరిగి ఈ మేటర్ ని సైతం తనదైన శైలిలో కవర్ చేసి కలర్ ఫుల్ బొమ్మలు వేసి క్రేజ్ పెంచుకుంటోంది.మరి బిపాషా న్యూస్ అంటే మజాకానా...విడిపోయారన్నా న్యూసే..కలిసిపోయారన్నా కలిసొచ్చే న్యూసే అంటున్నారు ఇదంతా సీరియల్ గా గమనిస్తున్నవారు.


Click it and Unblock the Notifications











