»   » బిత్తిరి సత్తి..... మామూలోడు కాదు సుమీ

బిత్తిరి సత్తి..... మామూలోడు కాదు సుమీ

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: బుల్లితెరపై 'తీన్ మార్' న్యూస్ ద్వారా బాగా పాపులర్ అయిన బిత్తిరి సత్తి రాబోయే కాలంలో బుల్లితెరపై కనిపించే అవకాశం ఉండక పోవచ్చు అంటున్నారు. అందుకు కారణం బిత్తిరి సత్తికి సినిమా అవకాశాలు వెల్లువెత్తడమే.

పక్కా ప్లానింగుతో తన కెరీర్ ప్లాన్ చేసుకుంటూ సక్సెస్ ఫుల్ గా ముందుకు సాగుతున్న బిత్తిరి సత్తి.... ఇపుడు సినిమా రంగం వైపు అడుగులు వేస్తున్నారు. సినిమా అవకాశాల కోసం తన వంతు ప్రయత్నాలు చేస్తున్నాడు. ఇందుకోసం ప్రత్యేకంగా ఓ మేనేజర్ ను కూడా నియమించుకున్నట్లు సమాచారం.

ఇటీవల విడుదలైన సాయిధరమ్ తేజ్ "విన్నర్"లో కడుపుబ్బ నవ్వించిన బిత్తిరిసత్తికి వరుస అవకాశాలు వెల్లువెత్తాయి. త్వరలో గోపీచంద్ హీరోగా సంపత్ నంది దర్శకత్వంలో తెరకెక్కుతున్న స్టైలిష్ యాక్షన్ ఎంటర్ టైనర్ "గౌతమ్ నంద"లో ఫుల్ లెంగ్త్ కామెడీ రోల్ లో కనిపించనున్నాడు.

సునీల్ సినమాలో కూడా

సునీల్ సినమాలో కూడా

దీంతో పాటు ఎన్.శంకర్-సునీల్ ల కాంబినేషన్ లో తెరకెక్కుతున్న సినిమాలనూ బిత్తిరి సత్తికి అవకాశం వచ్చింది. జయంత్ సి.పరాన్జీ దర్శకత్వంలో మినిస్టర్ గంటా శ్రీనివాస్ తనయుడు గంటా రవితేజ కథానాయకుడిగా పరిచయమవుతూ తెరకెక్కుతోన్న చిత్రంలోనూ సత్తికి అవకాశం దక్కింది.

కీలక పాత్రలో సత్తి

కీలక పాత్రలో సత్తి

రానా-తేజ కాంబినేషన్ లో రూపొందుతున్న చిత్రంలోనూ బిత్తిరి సత్తి కీలకపాత్ర పోషిస్తున్నాడు. ఇవి కాకుండా ఇంకొన్ని చిత్రాల్లోనూ నటించేందుకు సన్నద్ధమవుతున్నాడు.

ఎవరీ బిత్తిరి సత్తి?

ఎవరీ బిత్తిరి సత్తి?

బెల్లితెరపై బిత్తిరి సత్తిగా అందరికీ సుపరిచితమైన సత్తి అసలు పేరు చేవేళ్ల రవి. రంగారెడ్డి జిల్లా పమేనా గ్రామానికి చెందిన వాడు. చిన్నతనం నుండి ప్రముఖులను ఇమేట్ చేస్తూ అందరినీ ఎంటర్టెన్ చేసేవాడు. అతనిలోని ఆ టాలెంటే ఇపుడు అతన్ని పెద్ద సెలబ్రిటీ చేసింది.

మొదట్లో చాలా కష్టాలు పడ్డాడు

మొదట్లో చాలా కష్టాలు పడ్డాడు

స్నేహితుల సలహా మేరకు హైదరాబాద్ వచ్చి ఉద్యోగం కోసం ప్రయత్నించిన రవి మొదట్లో చాలా కష్టాలు పడ్డాడు. మొదటి అవకాశం జీ తెలుగు ఛానల్ లో కామెడీ క్లబ్ అనే కార్యక్రమానికి యాంకరింగ్ చేసే అవకాశం దక్కింది. ఈ షో సక్సెస్ కావడంతో అతనికి వి6 తీన్మార్ లో అవకాశం వచ్చింది.

అతని .జీవితాన్ని మార్చేసింది

అతని .జీవితాన్ని మార్చేసింది

వి6 చానల్ కార్యక్రమం ‘తీన్మార్' చేవేళ్ల రవి జీవితాన్నే మార్చేసింది. బిత్తిరి సత్తిగా అతని కొత్త అవరతారం, డిఫరెంట్ యాటిట్యూడ్ అతన్ని పెద్ద సెలబ్రిటీని చేసింది. ఇపుడు తెలుగు రాష్ట్రాల్లో పల్లె ప్రాంతాల నుండి, పట్టనాల వరకు బిత్తిరి సత్తి గురించి తెలియని వారు ఉండరంటే అతిశయోక్తి కాదేమో.

తీన్మార్ షో తొలి జీతం

తీన్మార్ షో తొలి జీతం

తీన్మార్ షోలో అవకాశం కోసం తొలి నెల తన టాలెంట్ నిరూపించుకోవడానికి జీతం లేకుండానే పని చేసాడట సత్తి. అతని పనితీరు నచ్చడంతో మరుసటి నెల నుండి రూ. 30 వేల జీతం ఫిక్స్ చేసారట ఛానల్ వారు.

ఇపుడు నెలకు లక్ష ముప్పైవేలు?

ఇపుడు నెలకు లక్ష ముప్పైవేలు?

తీన్మార్ షో బాగా పాపులర్ కావడం, ఈ షో కారణంగా టీవీ ఛానల్ రేటింగ్ కూడా భారీగా పెరగడంతో బిత్తిరి సత్తి రెమ్యూనరేషన్ కూడా భారీగా పెంచారు. ఇపుడు అతడు నెలకు రూ. లక్ష ముప్పైవేలు తీసుకుంటున్నట్లు సమాచారం.

బుల్లితెర యాంకర్ ప్రదీప్... రెమ్యూనరేషన్ ఎంతో తెలుసా?

బుల్లితెర యాంకర్ ప్రదీప్... రెమ్యూనరేషన్ ఎంతో తెలుసా?

తెలుగు ఎంటర్టెన్మెంట్ ఇండస్ట్రీకి సంబంధించి ఈ మధ్య కాలంలో బాగా పాపులర్ అయిన యాంకర్ ప్రదీప్. అటు బుల్లితెర కార్యక్రమాలు, ఇటు ఆడియో ఫంక్షన్లతో పాటు అప్పుడప్పుడు వెండితెరపై కూడా చిన్న చిన్న పాత్రల్లో కనిపిస్తూ ఫుల్ బిజీ అయిపోయాడు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

English summary
Bithiri Sathi is one of the well known comedy artist in screen of Andhra Pradesh and Telengana states. He attracted all television audiences with his innocent acting and innocent looks. Currently artist is doing Teenmaar program in V6 news channel.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu