ఎత్తిపోతల పథకాలు తెలుగు పరిశ్రమకు కొత్తేం కాదు.అయితే ఇంతకు ముందు వచ్చిన సినిమాలనే టైటిల్స్ మార్చి హిట్టుకొట్టడమూ అప్పుడప్పుడూ చూస్తూ షాకవుతూండటం తెలుగు ప్రేక్షకుడికి అనుభవమే. గతంలో ఎమ్.ఎస్ .రాజు గారి సినిమాలు (వర్షం-టుటౌన్ రౌడీ,నువ్వొస్తానంటే నే వద్దంటానా -రాముడొచ్చాడు,ఆట-గుడుంబాశంకర్)లలో ఇలా జరిగేది. ఇక ఇప్పుడు రాజీవ్ కనకాల,సింధు తులాజీ జంటగా వస్తున్న బ్లాక్ అండ్ వైట్ సినిమా జగపతి బాబు-లయ జంటగా చేసిన మనోహరం ని పూర్తి స్ధాయిలో కాపీ చేస్తూ ఈ చిత్రం రూపొందుతోందనే వార్తలు వినపడుతున్నాయి. అసలు మనోహరం చిత్రం ఇన్నోసెంట్ మేన్ అనే సినిమాను కాపీ చేస్తూ వచ్చింది. షాక్ సినిమా కూడా ఈ సినిమా నుండి ప్రేరణ పొందినదే కావటం విశేషం. ఇక బ్లాక్ అండ్ వైట్ లో సింధు తులానీ తన భర్తను టెర్రరిస్తుగా అనుమానించి పోలీసులు ఎత్తుకుపోతే ఆమె ఎదిరించి నిలబడి రక్షించుకుంటుందిట. రోజా చిత్రం కూడా ఇదే లైన్స్ లో నడుస్తుంది.
Story first published: Wednesday, April 22, 2026, 9:46 [IST]