షాక్: ఆడియో పంక్షన్ స్టేజీపై బ్లూ ఫిలిం ప్లే
ముంబై: సాధారణంగా ఆడియో ఫంక్షన్స్ చాలా ప్లానెడ్ గా ఏర్పాటు చేస్తూంటారు. అయితే ఎంత పక్కాగా చేసినా ఒక్కోసారి పొరపాట్లు అనేవి చోటు చేసుకుంటాయి. అయితే కొన్ని పొరపాట్లు తల దించుకునేలా ఉంటాయి. తాజాగా అలాంటి సంఘటన ‘Desi Kattey' చిత్రం ఆడియో పంక్షన్ లో చోటు చేసుకుంది.

ఆడియో పంక్షన్ లో భాగంగా సాంగ్స్ ప్లే చేస్తున్నప్పుడు రెండు పాటల మధ్య ఈ క్లిప్ వచ్చి అందరినీ షాక్ కు గురి చేసింది. అయితే క్లిప్ చిన్నదే అయినా బ్లూ ఫిలిం ది కావటంతో అందరూ చాలా ఎంబ్రాసింగ్ గా ఫీలయ్యారు. ముఖ్యంగా స్పెషల్ గెస్ట్ ల పరిస్ధితి చాలా దారుణంగా మారింది.
ఇలా జరగటానికి కారణం టెక్నికల్ డిపార్టమెంట్ లో పని చేసే వ్యక్తి నిర్లక్ష్యమేనని తేల్చారు. అయితే అతను తనకేమీ తెలియదని బుకాయించాడు. అయితే ఇది కావాలని ఇంటెన్షల్ గా ఎవరో చేసిన పని అని నిర్వాహకులు భావిస్తున్నారు. ఎందుకంటే ఒకటికి పదిసార్లు చెక్ చేసుకున్నాకే ఇలా ఆడియోని ప్లాన్ చేస్తామని అంటన్నారు.

ఇక ఈ చిత్రంలో సునీల్ శెట్టి, జయభన్సాలీ, అశుతోష్ రానా, టియా బాజపేయి, వినోద్ ఖన్నా మేనల్లుడు అఖిల్ కపూర్ నటిస్తున్నారు. ఆనంద్ కుమార్ ఈ చిత్రాన్ని డైరక్ట్ చేస్తున్నారు. ఇక ఈ ఇష్యూపై హీరోగా పరిచయమవుతుున్న అఖిల్ చాలా సీరియస్ గా ఉన్నారు.


Click it and Unblock the Notifications











