Thandel: హాలీవుడ్ రేంజ్ సీక్వెన్స్‌లో నాగ చైతన్య.. తండేల్‌లో నెవ్వర్ బిఫోర్ సీన్
టాలీవుడ్‌లోకి స్టార్ హీరోల వారసులు చాలా మందే వచ్చారు. కానీ, అందులో కొందరు మాత్రమే విశేషమైన గుర్తింపును సొంతం చేసుకుని స్టార్ స్టేటస్‌ను తెచ్చుకున్నారు. అలాంటి వారిలో కింగ్ అక్కినేని నాగార్జున కుమారుడు, యువ సామ్రాట్ నాగ చైతన్య ఒకడు. యాక్టింగ్, డ్యాన్స్, ఫైట్స్ ఇలా ఎన్నో విభాగాల్లో మెప్పిస్తోన్న అతడు.. డిఫరెంట్ చిత్రాలతో ప్రేక్షకులను అలరిస్తున్నాడు.
కొంత కాలంగా విజయాలను అందుకోవడంలో ఇబ్బంది పడుతోన్న నాగ చైతన్య.. గత ఏడాది అతడు 'ధూత' వెబ్ సిరీస్‌తో ప్రేక్షకుల ముందుకు వచ్చి సత్తా చాటాడు. ఈ జోష్‌లోనే ఇప్పుడు ఈ టాలెంటెడ్ హీరో 'తండేల్' అనే మూవీ చేస్తున్నాడు. చందూ మొండేటి దర్శకత్వంలో వహిస్తోన్న ఈ చిత్రంపై అంచనాలు భారీగా ఏర్పడ్డాయి. అందుకు తగ్గట్లే దీన్ని తీస్తున్నారు.

అక్కినేని నాగ చైతన్య - చందూ మొండేటి కలిసి చేస్తున్న 'తండేల్' మూవీ సముద్రంలో చేపల వేట కోసం వెళ్లి పాకిస్థాన్‌లో జైలు శిక్ష అనుభవించిన శ్రీకాకుళం మత్స్యకారుడి నిజమైన కథ ఆధారంగా రూపొందుతోన్న విషయం తెలిసిందే. కొద్ది రోజుల క్రితమే ఈ మూవీ షూట్ మొదలు పెట్టారు. అప్పటి నుంచి వరుసగా షెడ్యూళ్లను జరుపుతూ చాలా వరకూ టాకీ పార్టు పూర్తి చేశారు.
నాగ చైతన్య ప్రాణం పెట్టి చేస్తోన్న 'తండేల్' సినిమా నుంచి ఇప్పటికే గ్లింప్స్ వీడియో విడుదలైంది. దీనికి అన్ని వర్గాల నుంచి భారీ స్పందన రావడంతో హైప్ పెరిగిపోయింది. అదే సమయంలో ఈ చిత్రం నుంచి ఎన్నో క్రేజీ విషయాలు లీక్ అవుతున్నాయి. ఈ క్రమంలోనే తాజాగా 'తండేల్' మూవీ నుంచి ఓ క్రేజీ న్యూస్ ఫిలిం నగర్ ఏరియాలో వైరల్ అయిపోతోంది.
హై రేంజ్ యాక్షన్ అండ్ ఎమోషన్స్‌తో రూపొందుతోన్న 'తండేల్' మూవీలో వర్షంలో వచ్చే బోట్ ఛేజింగ్ సీక్వెన్స్‌ను పెట్టారట. ఇది గతంలో ఎన్నడూ చూడని విధంగా ఉంటుందని తెలుస్తోంది. ఒక్క మాటలో చెప్పాలంటే ఈ సీన్ హాలీవుడ్ రేంజ్‌లో ఉంటుదట. ఇందులో నాగ చైతన్య ఎంతో రిస్క్ చేశాడని కూడా అంటున్నారు. ఫలితంగా దీనిపై ఆసక్తి పెరిగిపోతోంది.
ఇదిలా ఉండగా.. నాగ చైతన్య హీరోగా చందూ మొండేటి రూపొందిస్తోన్న 'తండేల్' చిత్రాన్ని గీతా ఆర్ట్స్ బ్యానర్‌లో అల్లు అరవింద్ సమర్పణలో బన్నీ వాసు నిర్మిస్తున్నారు. ఇందులో సాయి పల్లవి హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ సినిమాకు దేవీ శ్రీ ప్రసాద్ సంగీతాన్ని అందిస్తున్నాడు. ఈ మూవీని ఈ ఏడాది చివర్లో రిలీజ్ చేసే అవకాశం ఉంది.


Click it and Unblock the Notifications











