Dragon: ఎన్టీఆర్‌కు విలన్‌గా స్టార్ హీరో.. మరోసారి అలాంటి క్రూరమైన పాత్రలో!
తెలుగు సినిమాకు చెందిన కొంత మంది హీరోలు వరుసగా సినిమాలు చేస్తూ దూసుకుపోతోన్నారు. అయితే, అందులో కొందరు మాత్రమే పాన్ ఇండియా రేంజ్‌లో సినిమాలు చేస్తూ సత్తా చాటుతోన్నారు. అలాంటి వారిలో యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ ఒకడు. ఈ మధ్య కాలంలో వరుసగా హిట్లు మీద హిట్లు కొడుతోన్న అతడు.. చేతి నిండా ప్రాజెక్టులతో బిజీగా గడుపుతున్నాడు.
బీభత్సమైన ఫామ్‌లో ఉన్న యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'దేవర' అనే సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ మూవీకి సంబంధించిన షూటింగ్ శరవేగంగా సాగుతోంది. ఇది సెప్టెంబర్ 27వ తేదీన విడుదల కాబోతుంది. వాస్తవానికి ఈ చిత్రం పట్టాలపై ఉండగానే ఎన్టీఆర్ తన తదుపరి సినిమాను కన్నడ దర్శకుడు ప్రశాంత్ నీల్‌తో చేస్తున్నట్లు ప్రకటించాడు.

ఎన్టీఆర్ - ప్రశాంత్ నీల్ కాంబోలో రాబోయే ఈ సినిమా ప్రారంభానికి చాలా సమయమే ఉన్నా.. దీని గురించి తరచూ ఏదో ఒక వార్త వైరల్ అవుతూనే ఉంటోంది. ఈ క్రమంలోనే ఇందులో కమల్ హాసన్ నటిస్తున్నట్లు ఆ మధ్య ఓ న్యూస్ వైరల్ అయింది. అది మరువక ముందే ఇటీవలే ఇందులో మోహన్‌లాల్ పేరు కూడా తెరపైకి వచ్చింది. అలా కొందరు స్టార్ల పేర్లు వెలుగులోకి వచ్చాయి.
పాన్ ఇండియా స్టార్ ఎన్టీఆర్‌తో చేయబోయే సినిమాకు సంబంధించిన కాస్టింగ్‌పై ప్రశాంత్ నీల్ ఫోకస్ చేసినట్లు తాజాగా ఓ న్యూస్ వైరల్ అవుతోంది. తాజా సమాచారం ప్రకారం.. ఈ మూవీలో తారక్‌తో పాటు బాలీవుడ్ స్టార్ బాబీ డియోల్‌ను నటింపజేసేందుకు చిత్ర యూనిట్ ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఈయనతో నిర్మాతలు సంప్రదింపులు కూడా జరిపాయరని తెలిసింది.

గతంలో ఎన్నో బాలీవుడ్ చిత్రాల్లో నటించిన బాబీ డియోల్.. 'యానిమల్' సినిమాలో క్రూరమైన పాత్రను పోషించాడు. తద్వారా దేశ వ్యాప్తంగా గుర్తింపును సొంతం చేసుకున్నాడు. దీంతో అతడికి ఆఫర్లు పోటెత్తుతున్నాయి. ఇలానే ఇప్పుడు ఎన్టీఆర్ మూవీలో బాబీ డియోల్ ఆఫర్ పట్టేశాడని తెలిసింది. ఇందులో అతడు మరింత క్రూరమైన పాత్రను చేస్తున్నట్లు తెలిసింది.
ఇదిలా ఉండగా.. ఎన్టీఆర్ - ప్రశాంత్ నీల్ కలయికలో అత్యంత భారీ బడ్జెట్‌తో రూపొందనున్న ఈ సినిమాను తెలుగుతో పాటు కన్నడంలోనూ రూపొందిస్తారని తెలుస్తోంది. ఈ మూవీని మైత్రీ మూవీ మేకర్స్ సంస్థతో కలిసి నందమూరి తారక రామారావు ఆర్ట్స్ బ్యానర్‌పై కల్యాణ్ రామ్ నిర్మించబోతున్నాడు. ఈ చిత్రానికి 'డ్రాగన్' అనే టైటిల్ పరిశీలనలో ఉంది.


Click it and Unblock the Notifications











