దేవర కోసం మరో డేంజరస్ విలన్.. షూట్ అయిపోయాక ఎందుకు తీసుకున్నారంటే!
సాధారణంగా స్టార్ హీరోలు హిట్ కొట్టాలనే ప్రతి సినిమానూ ఎంతో కష్టపడి చేస్తుంటారు. కానీ, అందులో చాలా తక్కువ మంది మాత్రమే సక్సెస్ అవుతుంటారు. అలాంటిది కొందరు హీరోలు మాత్రం వరుసగా విజయాలను అందుకుంటూ దూసుకెళ్తున్నారు. అలాంటి వారిలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఒకడు. ఈ మధ్య సక్సెస్‌లతో పాటు అతడు పాన్ ఇండియా స్టార్‌గానూ మారిపోయాడు.
వరుస హిట్లతో హవాను చూపిస్తోన్న జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'దేవర' అనే సినిమా చేస్తున్నాడు. కొరటాల శివ తెరకెక్కిస్తోన్న ఈ చిత్రంపై అంచనాలు ఏ రేంజ్‌లో ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అందుకు ఏమాత్రం తీసిపోని విధంగానే దీన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నారు. అందులోనూ ఈ చిత్రాన్ని రెండు భాగాలుగా రూపొందిస్తున్నట్లు ఇప్పటికే తెలిపారు.

హై ఓల్టేజ్ యాక్షన్‌తో రూపొందుతోన్న 'దేవర' సినిమాకు సంబంధించిన రెగ్యూలర్ షూటింగ్‌ను గత మార్చిలోనే స్టార్ట్ చేశారు. ఆ వెంటనే దీనికి సంబంధించిన ఎన్నో భారీ యాక్షన్ షెడ్యూళ్లను విజయవంతంగా పూర్తి చేసుకుంటూ వచ్చారు. ఇలా ఇప్పటికే ఈ సినిమా కోసం 90 శాతం పైగానే టాకీ పార్టును కంప్లీట్ చేసుకుని విడుదలకు సిద్దం చేసేస్తున్నారు.
సక్సెస్‌ఫుల్ కాంబినేషన్‌లో రాబోతున్న 'దేవర' మూవీ పాన్ ఇండియా రేంజ్‌లో రూపొందుతోంది. దీంతో ఈ చిత్రంలో వేరే ఇండస్ట్రీలకు చెందిన ఎంతో మంది నటీనటులు భాగం అయ్యారు. ముఖ్యంగా ఇందులో విలన్ పాత్ర కోసం సైఫ్ అలీ ఖాన్‌ను తీసుకున్నారు. ఈ క్రమంలోనే ఇప్పుడు ఈ సినిమా కోసం మరో డేంజరస్ విలన్‌ను కూడా తీసుకున్నట్లు తాజాగా న్యూస్ లీకైంది.

'దేవర' సినిమాలో మరో ప్రతినాయకుడి పాత్ర కోసం బాబీ డియోల్‌ను తీసుకున్నారని తాజాగా తెలిసింది. అయితే షూట్ పూర్తి కావోస్తుండగా అతడిని ఎందుకు తీసుకున్నారని అందరికీ డౌట్ రావొచ్చు. అయితే.. ఇది రెండు భాగాలుగా రాబోతుంది. ఫస్ట్ పార్ట్‌కు సైఫ్ విలన్‌గా చేస్తున్నాడు. 'దేవర' రెండో భాగంలో బాబీ డియోల్ ప్రతినాయకుడిగా కనిపిస్తాడట. దీన్ని మొదటి భాగం క్లైమాక్స్‌లో చూపిస్తారని సమాచారం.

ఇదిలా ఉండగా.. ఎన్టీఆర్ - కొరటాల శివ కాంబోలో రాబోతున్న 'దేవర' మూవీని నందమూరి తారక రామారావు ఆర్ట్స్, యువసుధ ఆర్ట్స్ బ్యానర్లు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. దీనికి యంగ్ సెన్సేషన్ అనిరుథ్ సంగీతం అందిస్తున్నాడు. ఇందులో జాన్వీ హీరోయిన్ కాగా.. శ్రీకాంత్ కీలక పాత్రలో నటిస్తున్నాడు. ఈ చిత్రాన్ని సెప్టెంబర్ 27న విడుదల చేయబోతున్నారు.


Click it and Unblock the Notifications











