NBK109: బాలయ్య సినిమాలో మరో పవర్‌ఫుల్ రోల్.. హీరో కంటే అతడికే ఎక్కువగా!

ఆరు పదుల వయసు దాటినా ఏమాత్రం అలసిపోకుండా వరుస పెట్టి సినిమాల మీద సినిమాలు చేసుకుంటూ వెళ్తున్నారు టాలీవుడ్ టాప్ హీరో నందమూరి బాలకృష్ణ. ఈ మధ్య కాలంలో హ్యాట్రిక్ హిట్లను ఖాతాలో వేసుకుని కెరీర్‌లోనే భీకరమైన ఫామ్‌తో సత్తా చాటుతోన్న ఆయన.. మరింత జోష్‌తో ఫ్యూచర్ లైనప్‌లోని మూవీలను ఒక్కొక్కటిగా చేసుకుంటూ వెళ్తున్నారు.

యమా జోష్ మీద ఉన్న నటసింహా నందమూరి బాలకృష్ణ తన 109వ సినిమాను బాబీ అలియాస్ కేఎస్ రవీంద్ర దర్శకత్వంలో చేస్తున్న సంగతి తెలిసిందే. క్రేజీ కాంబినేషన్‌లో రాబోతున్న ఈ చిత్రంపై అంచనాలు ఏ మేర ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అందుకు కొంచెం కూడా తగ్గకుండా ఈ సినిమాను భారీ బడ్జెట్‌తో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నారు.

Bobby Deol Villain Role Highlight In Nandamuri Balakrishna and Bobby Movie

నందమూరి బాలకృష్ణ - బాబీ కాంబినేషన్‌లో 1980 దశకం నాటి కథతో రాబోతున్న ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్ చాలా రోజుల క్రితమే ప్రారంభం అయింది. అప్పటి నుంచి ఏమాత్రం బ్రేకులు తీసుకోకుండా షూటింగ్ జరుపుతూ వచ్చారు. ఇలా ఇప్పటికే 80 శాతం వరకూ టాకీ పార్టును కంప్లీట్ చేశారు. మిగిలిన దాన్ని కూడా వీలైనంత త్వరగా పూర్తి చేయబోతున్నారు.

హై రేంజ్‌ యాక్షన్‌తో రాబోతున్న ఈ సినిమాలో విలన్‌గా ఎవరు నటిస్తారన్న దానిపై చాలా రోజుల పాటు చర్చలు జరిగాయి. ఈ క్రమంలోనే ఎంతో మంది స్టార్ల పేర్లు కూడా తెరపైకి వచ్చాయి. ఈ చిత్రంలో బాలకృష్ణను ఢీకొట్టే విలన్‌ పాత్రలో బాలీవుడ్ స్టార్ బాబీ డియోల్ నటిస్తున్నాడు. ఇప్పటికే ఈ విషయాన్ని చిత్ర యూనిట్ కూడా రివీల్ చేసేసిన విషయం తెలిసిందే.

Bobby Deol Villain Role Highlight In Nandamuri Balakrishna and Bobby Movie

ఈ మూవీలో బాబీ డియోల్ పాత్రకు సంబంధించిన క్రేజీ న్యూస్ ఒకటి తాజాగా బయటకు వచ్చింది. దీని ప్రకారం.. ఈ చిత్రంలో నందమూరి బాలకృష్ణ పాత్ర కంటే అతడి రోల్‌ హై రేంజ్‌లో ఉంటుందట. ఆర్థికంగా, శారీరకంగా బాబీ డియోల్‌ను హీరో కంటే ఎక్కువగా చూపించబోతున్నట్లు తెలిసింది. మొత్తంగా ఇందులో అతడి రోల్ గతంలో ఏ విలన్‌ కనిపించనట్లుగా ఉంటుందట.

ఇదిలా ఉండగా.. హై ఓల్టేజ్ యాక్షన్‌తో డిఫరెంట్ కాన్సెప్టుతో రాబోతున్న ఈ సినిమాను సితారా ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చన్ ఫోర్ సినిమాస్, శ్రీకర స్టూడియోస్ బ్యానర్లపై సాయి సౌజన్య, నాగ వంశీ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇందులో ఊర్వశీ రౌటేలా, దుల్కర్ సల్మాన్, చాందినీ చౌదరి కీలక పాత్రలు చేస్తున్నారు. ఈ చిత్రానికి 'వీర మాస్' అనే టైటిల్‌ను పరిశీలిస్తున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X