NBK109: బాలయ్యకు విలన్‌గా స్టార్ హీరో.. పవన్ మూవీలో అలా.. ఈ సినిమాలో వేరేలా!
అరవై సంవత్సరాల వయసు వచ్చినా ఏమాత్రం వెనక్కి తగ్గకుండా వరుసగా సినిమాలు చేసుకుంటూ వెళ్తున్నారు టాలీవుడ్ సీనియర్ స్టార్ హీరో నందమూరి బాలకృష్ణ. దీనికితోడు కెరీర్‌లోనే భీకరమైన ఫామ్‌తో సత్తా చాటుతోన్న ఆయన హిట్లు మీద హిట్లు కొడుతూనే ఉన్నారు. ఇలా ఇటీవలే వచ్చిన 'భగవంత్ కేసరి' మూవీతో హ్యాట్రిక్ సక్సెస్‌లను కూడా ఖాతాలో వేసుకున్నారు.
వరుస విజయాలతో జెట్ స్పీడుతో దూసుకుపోతోన్న నటసింహా నందమూరి బాలకృష్ణ తన 109వ సినిమాను బాబీ అలియాస్ కేఎస్ రవీంద్ర దర్శకత్వంలో చేస్తున్న విషయం తెలిసిందే. చాలా రోజుల క్రితమే ఈ మూవీ పూజా కార్యక్రమాలు పూర్తి అయ్యాయి. ఇక, ఇటీవలే ఈ సినిమాకు సంబంధించిన రెగ్యూలర్ షూటింగ్‌ను మొదలు పెట్టారు. ఇందులో యాక్షన్ సీక్వెన్స్ షూట్ చేశారు.

నందమూరి బాలకృష్ణ - బాబీ కాంబినేషన్‌లో రాబోతున్న ఈ చిత్రం 1980 దశకం నాటి కథతో రూపొందబోతున్నట్లు ఇప్పటికే న్యూస్ లీకైంది. అందుకు తగ్గట్లుగానే ఇటీవలే వచ్చిన పోస్టర్లు డిజైన్ చేశారు. దీంతో ఈ చిత్రంపై అంచనాలు భారీ స్థాయిలో పెరుగుతూనే ఉన్నాయి. దీనికి ఏమాత్రం తీసిపోని విధంగా ఈ సినిమాను ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించబోతున్నారు.
బాలయ్య కెరీర్‌లోనే హై రేంజ్‌లో రాబోతున్న ఈ సినిమాలో విలన్‌గా ఎవరు నటిస్తారన్న దానిపై చాలా రోజులుగా చర్చలు జరుగుతున్నాయి. ఈ క్రమంలోనే ఎంతో మంది స్టార్ల పేర్లు కూడా తెరపైకి వచ్చాయి. ఫిలిం నగర్ ఏరియాలో వైరల్ అవుతోన్న సమాచారం ప్రకారం.. ఈ చిత్రంలో బాలకృష్ణను ఢీకొట్టే విలన్ పాత్రలో బాలీవుడ్ స్టార్ బాబీ డియోల్ నటిస్తున్నట్లు తెలిసింది.

సుదీర్ఘ కాలంగా బాలీవుడ్‌లో సత్తా చాటుతోన్న బాబీ డియోల్.. పవన్ కల్యాణ్ 'హరిహర వీరమల్లు' మూవీలోనూ ఓ పాత్రను చేస్తున్నారు. ఇప్పుడు 'యానిమల్' మూవీలోనూ ప్రతినాయకుడిగా నటించారు. ఈ క్రమంలోనే ఇప్పుడు బాలయ్యకు విలన్‌గా మారబోతున్నట్లు తెలిసింది. దీంతో ఈ సినిమాలో యాక్షన్ పార్ట్ ఏ విధంగా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు.
ఇదిలా ఉండగా.. హై ఓల్టేజ్ యాక్షన్‌తో డిఫరెంట్ కాన్సెప్టుతో రాబోతున్న ఈ సినిమాను సితారా ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చన్ ఫోర్ సినిమాస్, శ్రీకర స్టూడియోస్ బ్యానర్లపై సాయి సౌజన్య, నాగ వంశీ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇందులో త్రిష, మీనాక్షి చౌదరి హీరోయిన్లుగా నటిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది.


Click it and Unblock the Notifications











