‘నారప్ప’పై ఇంట్రెస్టింగ్ న్యూస్.. ఇద్దరు కలిసి తెరకెక్కిస్తారట

Recommended Video

Naarappa Action Sequence's Will Be Directed By Star Director | Filmibeat Telugu

తమిళ నాట సంచలనం సృష్టించిన అసురన్ చిత్రాన్ని 'నారప్ప'గా తెలుగులో రీమేక్ చేస్తోన్న సంగతి తెలిసిందే. సహజత్వానికి దగ్గరగా ఉండే అసురన్ చిత్రంలో ధనుష్ లుక్, పర్ఫామెన్స్‌కు అదిరిపోయే రెస్పాన్స్ రాగా.. తాజాగా విడుదల చేసిన నారప్ప ఫస్ట్ లుక్‌కి అంతే రెస్పాన్స్ వచ్చింది. తాజాగా ఈ మూవీకి సంబంధించి మరో అప్‌డేట్ హాట్ టాపిక్‌గా మారింది.

శ్రీకాంత్ అడ్డాల దర్శకుడిగా..

శ్రీకాంత్ అడ్డాల దర్శకుడిగా..

అయితే అసురన్ చిత్రాన్ని సురేష్ బాబు రీమేక్ చేస్తున్నాడని, అది కూడా వెంకటేష్ హీరోగా తెరకెక్కించబోతోన్నారని వార్తలు రాగానే అందరూ షాక్ అయ్యారు. ఎందుకంటే అసురన్ చిత్రంలో ధనుష్ పర్ఫామెన్స్ చూశాక మళ్లీ అంతటి రేంజ్‌లో ఎవరైనా చేయగలరా? అని అనుమానం వ్యక్తం చేశారు. ఇలాంటి రా సినిమాకు శ్రీకాంత్ అడ్డాల దర్శకుడని లీకులు రావడంతో మరింత షాక్ అయ్యారు.

ఫస్ట్ లుక్‌కు అదిరిపోయే రెస్పాన్స్..

ఫస్ట్ లుక్‌కు అదిరిపోయే రెస్పాన్స్..

అయితే ఈ రీమేక్‌లో కొత్తగా ఏది చేర్చరని, ఉన్నవి కూడా ఎక్కువగా మార్పులకు లోనుకావని తెలుస్తోంది. చివరకు గెటప్‌లో కూడా ఏ చిన్న పాటి తేడా లేకుండా ధనుష్ గెటప్‌ను ఉన్నది ఉన్నట్లు దించేశారు. అయితే నారప్పగా వెంకీ లుక్ మాత్రం సోషల్ మీడియాలో వైరల్ అయింది.

 తాజాగా మరో అప్‌డేట్..

తాజాగా మరో అప్‌డేట్..

నారప్ప యూనిట్ అనంతపురంలో రెగ్యులర్ షూటింగ్ మొదలు పెట్టిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా ఈ మూవీకి సంబంధించిన ఓ అప్‌డేట్ ఇంట్రెస్టింగ్‌గా మారింది. ఈ చిత్రంలో శ్రీకాంత్ అడ్డాలతో పాటు మరో దర్శకుడు కూడా పనిచేస్తారట. ఆ ఇద్దరు కలిసి సినిమా అందంగా మలిచనున్నారని టాక్.

 యాక్షన్ సీక్వెన్స్‌లకు..

యాక్షన్ సీక్వెన్స్‌లకు..

ఈ చిత్రంలో యాక్షన్ సీన్స్, ఎమోషనల్ సీన్స్ రెండూ ఓ రేంజ్‌లో ఉంటాయి. వెంకీమామతో హిట్టు కొట్టిన బాబీ.. నారప్ప యాక్షన్ సీక్వెన్స్‌ను డైరెక్ట్ చేయనున్నాడని, మిగతా పార్ట్ అంతా శ్రీకాంత్ అడ్డాల తీయబోతోన్నట్టు టాక్ వినిపిస్తోంది. ఇదంతా సురేష్ బాబు రచించిన వ్యూహమని సమాచారం. మరి ఇది వర్కౌట్ అవుతుందో లేదో తెలియాలంటే నారప్ప వచ్చే వరకు ఆగాలి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X