మెగాస్టార్ తో బోల్డ్ బ్యూటీ రొమాన్స్.. బంపరాఫర్ పట్టేసిందిగా
దాదాపు హిందీ సినిమాలో మాత్రమే మనకి మాంచి బోల్డ్ హీరోయిన్స్ కనిపిస్తారు అనే నానుడి ఎప్పుడు నుంచో ఉంది కానీ ఫర్ ఏ చేంజ్ మన సౌత్ నుంచి కూడా చాలా మంది హీరోయిన్స్ మంచి బోల్డ్ షో చేయడంలో ముందుంటున్నారు. అలా కోలీవుడ్ నుంచి ఓ హాట్ బ్యూటీ ఎప్పటికపుడు సోషల్ మీడియాలో హీట్ రైజ్ చేస్తూ ఉంటుంది. సినిమాల్లో తక్కువే కానీ సోషల్ మీడియాలో ఓ రేంజ్ లో ట్రీట్ ఇచ్చే ఆ బ్యూటీనే మాళవిక మోహనన్.
సినిమాలో రోల్ డిమాండ్ చేస్తే ఏ ఎడ్జ్ వరకు అయినా సిద్ధమే అని ఆమె పలు మార్లు చెప్పుకొచ్చింది. కాగా దక్షిణాదిలో తమిళ సినిమాలో ఎంటర్ అయ్యిన మాళవిక ఇపుడు పలు సినిమాలు చేయగా లేటెస్ట్ గా అయితే తెలుగులో పాన్ ఇండియా హీరో ప్రభాస్ తో ది రాజా సాబ్ లో రొమాన్స్ చేయబోతుంది.

దీనితో అటు తమిళ్ తర్వాత తెలుగులో కూడా ఈమె ఎంటర్ కాబోతుండగా తెలుగు సినిమా కంటే ముందే ఈమె హిందీ సినిమాలో కూడా ఆల్రెడీ ఎంటర్ అయ్యింది. హిందీ సినిమాలో యుద్రా అనే సినిమాలో కనిపించి బాలీవుడ్ మీడియాకి షాకిచ్చిన ఈ బ్యూటీ ఇపుడు మలయాళ సినిమాలో ఎంటర్ అయ్యేందుకు సిద్ధం అయ్యిందట.
కాగా అది కూడా ఇన్నాళ్లు కొంచెం యంగ్ హీరోస్ సరసనే కనిపించింది కానీ ఇపుడు బాగా సీనియర్ హీరోతో రొమాన్స్ చేసేందుకు సిద్ధంగా ఉన్నట్టుగా సినీ వర్గాలు చెబుతున్నాయి. కాగా ఆ హీరో ఎవరో కూడా కాదు మలయాళ సినిమా మెగాస్టార్ హీరోస్ లో ఒకరైన మోహన్ లాల్ తో అట. కాగా మోహన్ లాల్ ఇపుడు భారీ సీక్వెల్ సినిమా ఎంపురాన్ తో రాబోతున్నారు.
మరి ఈ సినిమా తర్వాత మోహన్ లాల్ నుంచి రాబోతున్న మరో సినిమా కోసం మాళవికని మేకర్స్ లాక్ చేశారట. దీనితో తన కెరీర్లో మొదటిసారి తనకి బాగా గ్యాప్ ఉన్న సీనియర్ హీరో సరసన ఆమె కనిపించనుంది అని చెప్పవచ్చు. మరి ఈ ప్రాజెక్ట్ కి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మున్ముందు రావాల్సి ఉన్నాయి. ఇక ఈ సినిమా పక్కన పెడితే ప్రెజెంట్ ప్రభాస్ రాజా సాబ్ సినిమా లోనే ఈమె బిజీగా ఉండగా ఈ సినిమాలో తనతో పాటుగా మరో హాట్ బ్యూటీ నిధి అగర్వాల్ కూడా నటిస్తుంది.
ఈ ఇద్దరు ముద్దుగుమ్మలూ ప్రభాస్ సరసన నటించడం ఇదే తొలిసారి కాగా ఈ సినిమాని దర్శకుడు మారుతీ తెరకెక్కిస్తున్నారు. అలాగే ఈ ఏప్రిల్ 10కి పాన్ ఇండియా రిలీజ్ గా ప్లాన్ చేశారు కానీ మాళవిక ఎంట్రీ అయితే మరింత ఆలస్యం అయ్యేలా ఉందని రూమర్స్ వినిపిస్తున్నాయి. మరి చూడాలి ఈ బోల్డ్ బ్యూటీ ఎంట్రీ మన దగ్గర ఎలా ఉంటుందో అలాగే మలయాళ సినిమా దగ్గర కూడా ఎలా ఉంటుందో అనేది.


Click it and Unblock the Notifications











