బాలయ్యకు బోల్డు హీరోయిన్స్ కావాలంట.. ప్లాన్ చేస్తున్న బడా ప్రొడ్యూసర్

Recommended Video

Bold Actresses In Nandamuri Balakrishna- K.S.Ravi Kumar Movie || Filmibeat Telugu

నందమూరి బాలకృష్ణ సినిమాపై పూర్తిగా దృష్టి సారించాడు. ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన 'యన్.టి.ఆర్.. కథానాయకుడు', 'యన్.టి.ఆర్.. మహానాయకుడు' ఆశించిన స్థాయిలో ఆడకపోవడంతో బాలయ్య కొంత నిరాశ చెందారు. ఆ తర్వాత ఎన్నికలు రావడంతో సినిమాలకు తాత్కలికంగా బ్రేకిచ్చారు. ఎన్నికలు ముగిసిన తర్వాత మరోసారి సినిమాలను పట్టాలెక్కించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు ఈ క్రమంలోనే కొద్దిరోజుల క్రితం ఒకటి స్టార్ట్ చేశారు.

కేఎస్ రవికుమార్ సినిమా

కేఎస్ రవికుమార్ సినిమా

గతంలో ‘జై సింహా' వంటి సినిమాను అందించిన కేఎస్ రవికుమార్‌తో బాలయ్య మరోసారి జట్టుకట్టారు. ఈ సినిమాను ప్రముఖ నిర్మాత సీ కల్యాణ్ తెరకెక్కిస్తున్నారు. దీనికి సంబంధించిన పూజా కార్యక్రమాలు కూడా ఎప్పుడో పూర్తయ్యాయి. కానీ, షూటింగ్ మాత్రం ప్రారంభం కాలేదు.

స్క్రిప్టులో మార్పులు చేస్తున్నారంటూ..

స్క్రిప్టులో మార్పులు చేస్తున్నారంటూ..

ఆంధ్రప్రదేశ్‌లో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే, అప్పటి ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్ రెడ్డిని ఇందులో విలన్‌గా చూపించాలని అనుకున్నారట. కానీ, ఏపీలో ఫలితాలు రివర్స్ కావడంతో ఈ సినిమాను ఆపేశారని అప్పట్లో ప్రచారం జరిగింది. ఆ తర్వాత స్క్రిప్టులో మార్పులు చేయడంతో ఈ సినిమా షూటింగ్ ప్రారంభం కాలేదని టాక్ వినిపించింది.

బాలకృష్ణ రెండు షేడ్స్‌లో...

బాలకృష్ణ రెండు షేడ్స్‌లో...

ఈ సినిమాలో బాలకృష్ణ రెండు షేడ్స్‌లో కనిపించబోతున్నాడని వార్తలు వస్తున్నాయి. అందులో ఒకటి పోలీస్ ఆఫీసర్ పాత్ర కాగా, మరొకటి గ్యాంగ్‌స్టర్ క్యారెక్టర్. సిన్సియర్ పోలీస్ ఆఫీసర్ గ్యాంగ్‌స్టర్‌గా ఎలా మారాడు అనేదే సినిమా కథ అని ఫిలింనగర్‌లో ఓ న్యూస్ హల్‌చల్ చేస్తోంది.

బోల్డు హీరోయిన్ల కోసం మంతనాలు

బోల్డు హీరోయిన్ల కోసం మంతనాలు

ఈ సినిమాలో లేడీ సూపర్ స్టార్ నయనతారను తీసుకోబోతున్నారని గతంలో ప్రచారం జరిగింది. కానీ, తాజాగా పాయల్ రాజ్‌పుత్, సోనాల్ చౌహన్ పేర్లు తెరపైకి వచ్చాయి. ఈ సినిమాలో బోల్డు సన్నివేశాలు చూపించబోతున్నారని, అందుకే వీళ్లలో ఒకరిని తీసుకోవాలని చిత్ర యూనిట్ ప్లాన్ చేస్తుందని గుసగుసలు వినిపిస్తున్నాయి. వీరిలో సోనాల్ ఇప్పటికే బాలయ్యతో ‘లెజెండ్', ‘డిక్టేటర్' చిత్రాల్లో నటించింది.

క్రాంతి అనే టైటిల్

క్రాంతి అనే టైటిల్

ఈ సినిమా టైటిల్ విషయంలోనూ పలు పేర్లు తెరపైకి వచ్చాయి. దీనికి ‘రూలర్' టైటిల్ పెడుతున్నారని మొదట ప్రచారం జరిగినప్పటికీ, ఈ మధ్య మరో పేరు బయటకు వచ్చింది. దీని ప్రకారం ఈ సినిమాకు ‘క్రాంతి' అనే టైటిల్ పెట్టబోతునట్లు తెలుస్తోంది.దీనిని త్వరలోనే అధికారికంగా ప్రకటించనున్నారట నిర్మాత కల్యాణ్.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X