KGF 2 తరువాత ఆ సౌత్ స్టార్ హీరో సినిమాలో సంజయ్ దత్.. భారీగా రెమ్యునరేషన్!

బాలీవుడ్ స్టార్ హీరో సంజయ్ దత్ ఇటీవల కాలంలో బాలీవుడ్ లో కంటే సౌత్ ఇండస్ట్రీలోనే మంచి ఆఫర్లు అందుకుంటున్నాడు. KGF సెకండ్ చాప్టర్లో అతను నటించిన విధానం సినిమాకు చాలా బాగా హెల్ప్ అయ్యింది. డైరెక్టర్ ప్రశాంత్ నీల్ సంజయ్ ను ప్రధాన విలన్ గా చూపించిన విధానం అన్ని వర్గాల ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. అయితే ఇప్పుడు అతను మరో సౌత్ స్టార్ హీరో సినిమాలో భయంకరమైన విలన్ గా కనిపించబోతున్నాడట.

ఇదివరకే సంజయ్ దత్ కు సౌత్ ఇండస్ట్రీ నుంచి చాలా ఆఫర్లు వచ్చాయి. కానీ అతను మాత్రం కంటెంట్ తో పాటు మంచి పారితోషికం ఇస్తే గాని సినిమా చేసేందుకు ఒప్పుకోలేదు అని బాలీవుడ్ మీడియాలో కూడా కథనాలు విలువడ్డాయి. అయితే ఈసారి కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ చేయబోయే ఒక భారీ యాక్షన్ ప్రాజెక్ట్ కోసం సంజయ్ కోసం సంప్రదించగా వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లుగా తెలుస్తోంది.

Bollywood actor Sanjay Dutt antagonist role in vijay 67th project

విజయ్ 67వ సినిమాకు లోకేష్ కనగరాజ్ దర్శకత్వం వహించబోతున్న విషయం తెలిసిందే. ఇటీవల విక్రమ్ సినిమాతో భారీ విజయాన్ని సొంతం చేసుకున్న ఈ దర్శకుడు తదుపరి సినిమాను అంతకుమించి అనేలా ఫ్యాన్ ఇండియా రేంజ్ కు తగ్గట్టుగా తెరపై తీసుకురావాలని ప్లాన్ చేసుకుంటున్నాడు. ఇప్పటికే స్క్రిప్ట్ పనులు కూడా ఫినిష్ అయ్యాయి. ఇక అందులో ప్రధాన విలన్ పాత్ర కోసం ఈ దర్శకుడు సంజయ్ దత్ సంప్రదించినట్లుగా తెలుస్తోంది.

ఇక అంతేకాకుండా దాదాపు పది కోట్ల వరకు పారితోషికం ఆఫర్ చేయడంతో ఆ నటుడు పెద్దగా ఆలోచించకుండా ఒప్పేసుకున్నట్లు సమాచారం. ఇక ఆ ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ నవంబర్లో మొదలు పెట్టాలని అనుకుంటున్నారు. ఇక వీలైనంత త్వరగా సినిమా షూటింగ్ పనులను పూర్తి చేసి 2023 దీపావళి సందర్భంగా విజయ్ 67వ సినిమాను విడుదల చేయాలని ఆలోచిస్తున్నారు. ఇక అంతకంటే ముందు విజయ్ 2023 సంక్రాంతికి వారసుడు అనే సినిమాను తెలుగు తమిళ్ ప్రేక్షకుల ముందుకు ఒకేసారి తీసుకురాబోతున్నాడు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X