రాజమౌళి-ప్రభాస్ చిత్రంలో బాలీవుడ్ స్టార్స్
ఇక ఈ చిత్రం గురించి నిర్మాత దేవినేని ప్రసాద్ మాట్లాడుతూ... "ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. తెలుగు సినిమా చరిత్రలో అత్యంత ప్రతిష్టాత్మకంగా ఈ చిత్రాన్ని తీర్చిదిద్దాలనుకుంటున్నాం. మా ఆర్కా మీడియా సంస్థ ఇటు సినిమా రంగంలోనూ, అటు టీవీ రంగంలోనూ ముందంజలో ఉండటం చాలా ఆనందంగా ఉంది'' అని అన్నారు. ఆర్కా మీడియా వర్క్స్ ప్రై. లిమిటెడ్ సంస్థపై దేవినేని ప్రసాద్, శోభు యార్లగడ్డ గతంలో 'వేదం', 'మర్యాదరామన్న' చిత్రాలను తెరకెక్కించిన సంగతి తెలిసిందే.
బైలింగ్వులవ్ చిత్రాలు రెగ్యులర్ షూటింగ్ తరహాలో కాకుండా గౌతమ్ మీనన్ తరహాలో ప్రతీ సీన్ ని రాజమౌళి హిందీలో ప్రత్యేకంగా షూట్ చేయనున్నారు. గతంలో ఛత్రపతి చిత్రంతో ప్రభాస్‌కు భారీ విజయాన్ని అందించిన రాజమౌళి ఈ సారి సరికొత్త కోణంలో యంగ్ రెబల్ స్టార్‌ను చూపెట్టబోతున్నారు. హై ఓల్టేజ్ తో కూడాని యాక్షన్, ఎంటర్ టైన్మెంట్, డ్రామాతో కూడిన ఈ చిత్రానికి సంబంధించిన స్క్రిప్టు వర్క్ ఇప్పటికే పూర్తయింది. మూవీ లవర్స్‌కి ఈచిత్రం ద్వారా సరికొత్త అనుభూతి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు.
'అందాల రాక్షసి' చిత్రం ద్వారా తెలుగు తెరకు పరిచయమైన హీరోయిన్ లావణ్య త్రిపాటి ఈ చిత్రంలో చాన్స్ దక్కించుకున్నట్లు తెలుస్తోంది. అందాల రాక్షసి చిత్రంలో ఆమె పెర్ఫార్మెన్స్ నచ్చి రాజమౌళి ఈ నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. గబ్బర్ సింగ్ హీరోయిన్ శృతి హాసన్ ఈ చిత్రంలో మెయిన్ హీరోయిన్ గా చేయనుందని సమాచారం. సోసియో ఫాంటసీ నేపథ్యంలో ఈ చిత్రంలో ప్రభాస్ సరికొత్త గెటప్ తో కనిపించనున్నాడు. దర్శకుడు కె.రాఘవేంద్రరావు సమర్పణలో ఈ సినిమా ఉంటుంది.


Click it and Unblock the Notifications












