సూపర్ హీరోగా బాలకృష్ణ.. ప్రపంచ సుందరితో రొమాన్స్?
వరల్డ్ వైడ్ గా మూవీ లవర్స్ కి బాగా ఇష్టమైన క్రేజీ సినిమా జానర్స్ లో సూపర్ హీరో జానర్ సినిమాలకి సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉందని చెప్పాలి. కాగా ఇది హాలీవుడ్ సినిమా దగ్గర చాలా పాపులర్ కాగా మన ఇండియన్ సినిమా దగ్గర ఈ జానర్ లో పలు చిత్రాలు వచ్చాయి. కానీ ఎన్నో ఏళ్ళు నుంచి హాలీవుడ్ లో కొనసాగుతూ వస్తున్న ఈ క్రేజీ జానర్ ఇక్కడ తెలుగు సినిమా దగ్గర కూడా ఊపందుకుంది.
కాగా తెలుగులో మొట్ట మొదటి సూపర్ హీరో సినిమా ఏదన్నా ఉంది అంటే అది ఈ ఏడాదిలో వచ్చిన భారీ సినిమా "హను మాన్" అని చెప్పొచ్చు. యువ హీరో తేజ సజ్జ అలాగే దర్శకుడు ప్రశాంత్ వర్మ తెరకెక్కించిన భారీ చిత్రం క్రేజీ హిట్ అయ్యింది. అయితే ఈ సినిమా కంటే ముందు ఎన్నో ఏళ్ల కితమే మన తెలుగులో మరో సూపర్ హీరో సినిమా కూడా వచ్చింది.

అది కూడా ఆ సూపర్ హీరో సినిమా కూడా ఎవరి మీదో కాదు.. స్వర్గీయ నందమూరి తారక రామారావు నటించిన "సూపర్ మేన్" అని చెప్పాలి. అయితే ఈ చిత్రాన్ని అప్పటికే హాలీవుడ్ లో వచ్చిన "సూపర్ మేన్" కి కాపీ గానో రీమేక్ గానో రూపొందించారు. కానీ ఇది మినహా మన తెలుగు నుంచి మొట్ట మొదటి సూపర్ హీరో సినిమా ఏదన్నా ఉంది అంటే అది "హను మాన్" అనే చెప్పాలి.
కాగా ఇక్కడ ఈ సినిమా దర్శకుడు ప్రశాంత్ వర్మకి సీనియర్ ఎన్టీఆర్ వారసుడు నందమూరి బాలకృష్ణకి మంచి సాన్నిహిత్యం ఉన్న సంగతి తెలిసిందే. కాగా బాలయ్య వారసుణ్ణి కూడా ప్రశాంత్ వర్మ లాంచ్ చేస్తున్నాడు. సరే ఇవన్నీ బాగానే ఉన్నాయి కానీ బాలయ్య కూడా సూపర్ హీరోగా ఓ భారీ సినిమా చేయనున్నారని టాక్ తెలుగు సినీ వర్గాల్లో ఇప్పుడు ఊపందుకుంది.

మరి ఇది కూడా ప్రశాంత్ వర్మ తోనేనా లేక ఎవరితోనా అనేవి ప్రస్తుతానికి కొంచెం సస్పెన్స్ గానే ఉన్నాయి కానీ ఇప్పుడు ఈ సినిమాపై మరో క్రేజీ గాసిప్ వినిపిస్తుంది. కాగా దీని ప్రకారం బాలయ్య ఓ బాలీవుడ్ బ్యూటీతో రొమాన్స్ చేయనున్నారని రూమర్స్ వినిపిస్తున్నాయి. మరి ఆమె ఎవరో కూడా కాదు ప్రపంచ సుందరి ఐశ్వర్య రాయ్ తో అట.
మరి సూపర్ హీరో సినిమా గ్రాండ్ స్కేల్ అలాగే తన ఏజ్ కి కూడా పర్ఫెక్ట్ గా సెట్టవుతుంది అని ఆమెని ఎంచుకున్నారో ఏమో కానీ ఈ వార్త వైరల్ గా మారింది. కాగా ఈ టాక్ లో ఎంత వరకు నిజం ఉంది అనేది కూడా ఇంకా తెలియాల్సి ఉంది. ఇక బాలయ్య ప్రస్తుతం తన కెరీర్ లో 109వ సినిమాని దర్శకుడు బాబీ కొల్లి తో చేస్తున్నారు అలాగే ఈ సినిమాని వచ్చే ఏడాది సంక్రాంతి బరిలో నిలిపే ప్రయత్నాలు ప్రస్తుతం జరుగుతున్నాయి.


Click it and Unblock the Notifications











