ప్రభాస్ సరసన మల్లీశ్వరీ .. సాహోకు గ్రీన్ సిగ్నల్..
బాహుబలి2 తర్వాత యంగ్ రెబల్‌స్టార్ ప్రభాస్ నటించే చిత్రం సాహో. అత్యంత భారీ వ్యయంతో రూపొందుతున్న చిత్రంలో బాలీవుడ్ టాప్ యాక్టర్ కత్రినా కైఫ్ నటించడానికి అంగీకారం తెలిపిందనే వార్త ప్రస్తుతం మీడియాలో ప్ర
బాహుబలి2 తర్వాత యంగ్ రెబల్‌స్టార్ ప్రభాస్ నటించే చిత్రం సాహో. అత్యంత భారీ వ్యయంతో రూపొందుతున్న చిత్రంలో బాలీవుడ్ టాప్ యాక్టర్ కత్రినా కైఫ్ నటించడానికి అంగీకారం తెలిపిందనే వార్త ప్రస్తుతం మీడియాలో ప్రచారమవుతున్నది. ఇప్పటికే కత్రినా కైఫ్ అమీర్ ఖాన్‌తో థగ్స్ ఆఫ్ హిందూస్థాన్, సల్మాన్ ఖాన్‌తో టైగర్ జిందా హై, రణ్‌బీర్ కపూర్‌తో జగ్గా జాసూస్ చిత్రాల్లో నటిస్తున్నది. ప్రస్తుతం ప్రభాస్ నటించే సాహో చిత్రంలో నటించేందుకు కత్రినా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు సమాచారం.

ప్రభాస్ సాహోపైనే
ప్రస్తుతం బాహుబలి2 తర్వాత ప్రభాస్ నేషనల్ హీరో అయ్యాడు. ప్రభాస్‌తో సినిమాలు చేయడానికి బాలీవుడ్ నిర్మాతలు ప్రయత్నిస్తున్నారు. కానీ ప్రస్తుతం ప్రభాస్ కేవలం సాహోపైనే దృష్టిపెట్టారు. సాహో చిత్రంలో తొలుత దీపికా పదుకొనే, పరిణితి చోప్రా, అమీ జాక్సన్ పేర్లను పరిశీలించినట్టు సమాచారం.

అవకాశం కత్రినాకైఫ్‌కు
అయితే అవకాశం కత్రినాకైఫ్‌కు దక్కింది. బాహుబలి తర్వాత ప్రభాస్ ఇమేజ్‌కు తగిన హీరోయిన్ కత్రినా అయితే బాగుంటుందని నిర్మాతలు అభిప్రాయానికి వచ్చినట్టు తెలుస్తున్నది. ఈ మేరకు కత్రినాతో సంప్రదింపులు జరుపగా ఆమె కూడా ప్రభాస్‌తో చేయడానికి ముందుకొచ్చినట్టు తెలిసింది.

కత్రినా డేట్స్ కూడా
అంతేకాకుండా కత్రినా డేట్స్ కూడా అడ్జస్ట్ కావడంతో కత్రినానే తీసుకోవాలని అనుకొన్నట్టు తెలుస్తున్నది. ఈ విషయానికి సంబంధించిన ప్రకటన త్వరలోనే అధికారికంగా చిత్ర యూనిట్ వెల్లడించే అవకాశం ఉంది. ప్రస్తుతం ప్రభాస్ అమెరికాలో సమ్మర్ వెకేషన్స్‌ను ఎంజాయ్ చేస్తున్నాడు.

కత్రినా కైఫ్ టాలీవుడ్‌కు సపరిచితులు
కత్రినా కైఫ్ టాలీవుడ్‌కు సపరిచితులు. వెంకటేశ్‌తో కలిసి మల్లీశ్వరీ, బాలకృష్ణతో అల్లరి పిడుగు అనే చిత్రంలో నటించిన సంగతి తెలిసిందే. ఆ చిత్రంల్లో గ్లామర్ నటిగా పేరుతెచ్చుకొన్నది. ఆ తర్వాత బాలీవుడ్‌లో బిజీగా మారడంతో ఆమె టాలీవుడ్‌కు దూరమైంది.


Click it and Unblock the Notifications











