నాగార్జున హీరోయిన్ సీక్రెట్ మ్యారేజ్
క్రిమినల్ చిత్రంలో నాగార్జున సరనస కనిపించి అలరించిన మనీషా కొయిరాలా సీక్రెట్ గా తన బోయ్ ప్రెండ్ ని పెళ్ళి చేసుకుందని సమాచారం. మీడీయాకు తెలియకుండా కేవలం కొద్ది మంది ఫ్యామిలీ సభ్యుల సమక్షంలో ఆమె ఈ వివాహాన్ని చేసుకుందని తెలుస్తోంది. ఇక ఆమె భర్త క్రిష్టపర్ డోరిస్ తో ఆమె ప్యారిస్ కి వెకేషన్ కు వెళ్ళినప్పుడు ఈ వివాహం ప్రపోజల్ వచ్చిందని చెప్తున్నారు. ఇద్దరూ గత నాలుగు నెలలుగా ప్యారిస్ లోనే ఉన్నారు. ఇక క్రిష్టపర్ స్పోర్ట్స్ కౌన్సిలర్ మరియు రచయత, పారిశ్రామికవేత్త. అలాగే మనీషా కూడా కొంత కాలంగా బాలీవుడ్ కి దూరంగా ఉంటోంది. అక్క,చెల్లి,పిన్ని తరహా పాత్రలు చేయనని ఆమె దూరంగా ఉంటోంది. ఈ పెళ్ళి ప్రెవేట్ వ్యవహారమని మీడియా కలగచేసుకోవటం అనవసరమని ఆమె సన్నిహితులు అంటున్నారు. అయితే ఈ ముప్పై తొమ్మిదేళ్ళ ముదురు భామ మాత్రం పెళ్ళా ..అటువంటిదేమీ లేదే..ఉంటే మీడియాను ఎందుకు పిలవను అంటూ రాగాలు తీస్తోంది. ప్రస్తుతం ఈ దంపతులు హనీమూన్ నిమిత్తం విదేశాలకు వెళ్ళారని సమాచారం. అక్కడి నుంచి తిరిగొచ్చిన తర్వాత ఎక్కడ కాపురం పెట్టాలో ఈ దంపతులు నిర్ణయించుకుంటారని తెలుస్తోంది.


Click it and Unblock the Notifications











