ప్రియాంక చోప్రా భారీ రెమ్యునరేషన్.. SSMB 29కి ఎన్ని కోట్లు తీసుకుంటుందో తెలుసా?
గ్లోబల్ బ్యూటీ, బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ప్రియాంక చోప్రా గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పనిలేదు. నార్త్ లో పుట్టిన పెరిగిన ప్రియాంక చోప్రా తన టాలెంట్ తో బాలీవుడ్ లో సక్సెస్ సాధించింది. ఆ తర్వాత హాలీవుడ్ లోనూ అవకాశాలు దక్కించుకొని ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్స్ ల్లో నటించి మెప్పించింది. ఇక ప్రస్తుతం మళ్లీ ఇండియన్ ఫిల్మ్స్ పైనా పోకస్ చేస్తున్నారు ప్రియాంకా. ఈ క్రమంలో ఆమె నటించే ప్రతి ప్రాజెక్ట్ కు ఎన్ని కోట్ల రెమ్యునరేషన్ తీసుకుంటున్నారనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. కాగా SSMB 29 చిత్రానికి ఎన్ని కోట్లు ఛార్జీ చేసిందనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఆ వివరాల్లోకి వెళితే..
బాలీవుడ్ టు హాలీవుడ్..
ప్రియాంకా చోప్రా కెరీయర్ దక్షిణాదిలోనే ప్రారంభమైంది. తను హీరోయిన్ గా దళపతి విజయ్ సరసన నటించిన తమిజ్హా అనే చిత్రంతో వెండితెరకు పరిచయం అయ్యింది. ఈ చిత్రం 2002లో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఆ తర్వాత హిందీలో హీరో, అందాజ్ వంటి చిత్రాలతో ఎంట్రీ ఇచ్చింది. 2003 నుంచి ఇప్పటి వరకు యాక్టివ్ గా బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తోంది. 60కిపైగా చిత్రాల్లో నటించి మెప్పించింది. అంతే కాదు అటు హాలీవుడ్ లోనూ 2016 నుంచి పూర్తిగా ఇంగ్లీష్ సినిమాల్లోనే నటిస్తూ వస్తోంది. ఇటీవల మళ్లీ ఇండియన్ ఫిల్మ్స్ పై ఫోకస్ పెట్టింది.

SSMB 29లో ప్రియాంక చోప్రా..
ప్రస్తుతం ప్రియాంక చోప్రా హాలీవుడ్ చిత్రాలతోనే ఫుల్ బిజీగా ఉంది. ఇప్పటికే హాలీవుడ్ లో సినిమాలు, సిరీస్ లు కలిసి 20కి పైగా ప్రాజెక్ట్స్ ల్లో నటించింది. చివరిగా ఇంగ్లీష్ సిటాడెల్ సిరీస్, హెడ్స్ ఆఫ్ స్టేట్ అనే హాలీవుడ్ ప్రాజెక్ట్స్ ల్లో నటించి మెప్పింది. ఇప్పటికీ ది బ్లఫ్, జడ్జీ మెంట్ డే అనే ప్రాజెక్ట్స్ తో బిజీగా ఉంది. మరోవైపు ఇండియాలోని 2 భారీ ప్రాజెక్ట్స్ ల్లో నటించేందుకు కూడా ఒప్పుకుంది. మహేశ్ బాబు SSMB 29తో పాటు, బాలీవుడ్ లో హృతిక్ రోషన్ క్రిష్ 4 చిత్రాల్లో నటించేందుకు సిద్ధమైంది.
భారీ పారితోషికం..
ప్రస్తుతం ఇండియాలోనే ప్రియాంకా చోప్రా హ్యయేస్ట్ పెయిడ్ యాక్ట్రెస్ గా ఉంది. తను చేసే ప్రాజెక్ట్స్ కోసం భారీగా పారితోషికం తీసుకున్నట్టు తెలుస్తోంది. అయితే హాలీవుడ్ చిత్రాల్లో నటించేందుకు రూ.40 కోట్లు ఛార్జీ చేస్తోందని, ఇక ఇండియన్ ఫిల్మ్స్ కు మాత్రం రూ.30 కోట్ల పారితోషికం తీసుకుంటున్నట్టు టాక్. ఏదేమైనా ప్రియాంక చోప్రా అత్యధిక పారితోషికం తీసుకునే ఇండియన్ నటిగా రికార్డ్ క్రియేట్ చేసింది.
నిక్ జోనాస్ తో పెళ్లి..
ఇక ప్రియాంక చోప్రా సోషల్ మీడియాలోనూ ఎప్పుడూ యాక్టివ్ గానే కనిపిస్తూ ఉంటుంది. తన సినిమాల గురించి, ఫ్యామిలీ వివరాల గురించి ఎప్పటికప్పుడు అభిమానులతో పంచుకుంటూ ఉంటుంది. ఇక నిక్ జోనాస్ ను 2018 డిసెంబర్ లో పెళ్లి చేసుకుంది. 2022లో పండంటి ఆడబిడ్డ మల్టీ మేరీ చోప్రా జోనాస్ కు జన్మనిచ్చింది. జూలై 18న ప్రియాంక చోప్రా 43వ పుట్టిన రోజు వేడుకలను జరుపుకోవడం విశేషం.


Click it and Unblock the Notifications











