అల్లు అర్జున్ తో హాలీవుడ్ హీరోయిన్ రొమాన్స్.. ఎవరో తెలిస్తే షాకే

ఐకాన్ స్టార్, నేషనల్ అవార్డు గ్రహీత అల్లు అర్జున్ చివరిగా పుష్ప 2 చిత్రంతో ఎంతటి సెన్సేషన్ క్రియేట్ చేశారో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. పుష్ప మేనరిజంతో వరల్డ్ మొత్తాన్ని టాలీవుడ్ వైపు చూసేలా చేశారు మన అల్లు అర్జున్. ఆ చిత్రంతో ఏకంగా 1870 కోట్ల క్రాస్ కలెక్షన్లు వసూలు చేసి ఇండియన్ బాక్స్ ఆఫీస్ వద్ద హైయెస్ట్ గ్రాస్ వసూలు చేసిన చిత్రాల్లో రెండవ చిత్రంగా రికార్డు నెలకొల్పారు. దీంతో అల్లు అర్జున్ నెక్స్ట్ ప్రాజెక్ట్ పై భారీ అంచనాలు నెలకొన్నాయి. అందుకు తగ్గట్టు గానే రాబోయే చిత్రాన్ని గ్రాండ్ స్కేల్లో నిర్మించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి.

అల్లు అర్జున్ తన నెక్స్ట్ సినిమాను తమిళ స్టార్ డైరెక్టర్ అట్లీతో చేయబోతున్నారు. ఇప్పటికే అట్లీ బాలీవుడ్లో కింగ్ ఖాన్ తో జవాన్ చిత్రాన్ని డైరెక్ట్ చేసి ఏకంగా 1100 కోట్లను బాక్సాఫీస్ వద్ద రాబట్టగలిగారు. అల్లు అర్జున్ బాక్సాఫీస్ రికార్డు కూడా స్థాయిలో ఉండడంతో మీ ఇద్దరి కాంబినేషన్లో రాబోతున్న చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఏకంగా 600 కోట్లకు పైగా బడ్జెట్ తో నిర్మించబోతున్నారని తెలుస్తుంది. ఇంకా అల్లు అర్జున్, అట్లీ రెమ్యునరేషన్ కూడా ఓ రేంజ్ లో ఉండబోతుందని తెలుస్తోంది.

Bollywood Actress Priyanka Chopra Romance with Allu Arjun

ఇదిలా ఉంటే అల్లు అర్జున్ అట్లీ ప్రాజెక్టులో నటించబోయే హీరోయిన్ గురించి ఇప్పుడు ఇంట్రెస్టింగ్ అప్డేట్ అందింది. ఇప్పటికే ఈ చిత్రంలో ఐదుగురు హీరోయిన్ సెట్ చేయబోతున్నట్టు గుసగుసలు వినిపించాయి. కాగా తాజాగా అల్లు అర్జున్ తో హాలీవుడ్ లో సంచలనం సృష్టించిన గ్లోబల్ బ్యూటీ ప్రియాంక చోప్రా రొమాన్స్ చేయబోతుందని టాక్ వినిపిస్తోంది. ప్రస్తుతం దర్శకుడు అట్లీ ప్రియాంక చోప్రా తో టాక్స్ నడిపిస్తున్నారని సమాచారం. ఇక హీరోయిన్లను ఏమాత్రం రిపీట్ చేయబోయి అల్లు అర్జున్ ప్రియాంక చోప్రా తో నటించబోతుండడం మరింత ఆసక్తికరంగా మారింది.

పుష్ప 2తోనే 2000 కోట్ల గ్రాస్ టార్గెట్ పెట్టుకున్న అల్లు అర్జున్ కొద్దిలో మిస్ అయ్యారు. ఇక ఈసారి మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ టార్గెట్ ను దాటాలని ప్రయత్నిస్తున్నారు. ఇండియన్ బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డును నెలకొల్పేందుకు ప్రత్యేక శ్రద్ధ వహిస్తున్నారు. అందుకోసమే అట్లీతో చేయబోతున్న సినిమాలో అల్లు అర్జున్ మరో స్టార్ నటులను తీసుకోకుండా జాగ్రత్తలు వహిస్తున్నానని తెలుస్తుంది. చిత్రంలో తొలిసారిగా ద్విపాత్రాభినయంతో అలరించబోతున్నట్టు తెలుస్తోంది. అలా వైకుంఠపురం తర్వాత నుంచి అల్లు అర్జున్ సినిమాలు ఓ రేంజ్ లో ఉంటుండడం, పుష్ప సీక్వెల్స్ కూడా అదరగొడుతున్నాడంతో నెక్స్ట్ రాబోయే సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి.

మరో వైపు బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ప్రియాంక చోప్రా ఇండియాస్ బిగ్గెస్ట్ ప్రాజెక్ట్ ssmb 29 చిత్రంలో నటిస్తూ బిజీగా ఉంది. సూపర్ స్టార్ మహేష్ బాబు తరఫున ప్రియాంక చోప్రా నటిస్తుండటం విశేషంగా మారింది. మరోవైపు అల్లు అర్జున్ తోను ఈ బ్యూటీ రొమాన్స్ చేయబోతుందని గుసగుసలు వినిపించడం కూడా ఆ ప్రాజెక్టుపై హైప్ ను పెంచేశాయి. ఇప్పటికే ప్రియాంక చోప్రా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ సరసన జంజీర్ అనే సినిమాలో నటించిన సంగతి తెలిసిందే.

More from Filmibeat

Read more about: allu arjun priyanka chopra atlee
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X