SSRMB29: మహేశ్‌బాబుతో ఇంటర్నేషనల్ బ్యూటీ రొమాన్స్.. అదిరిపోయిన రాజమౌళి స్కెచ్!
SSMB29 Update: సూపర్ స్టార్ మహేష్ బాబు - స్టార్ డైరెక్టర్ రాజమౌళి కాంబోలో ఓ భారీ మూవీ రూపొందుతున్న విషయం తెలిసిందే. ఈ క్రేజీ ప్రాజెక్ట్ కు SSMB 29గా పేరు పెట్టారు. ప్రస్తుతం ఈ మూవీ ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. ఆర్ఆర్ఆర్ (RRR) లాంటి గ్లోబల్ హిట్ తరువాత దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న సినిమా కావడం, అలాగే.. మూవీలో సూపర్ స్థార్ మహేష్ బాబు లీడ్ లో నటించడంతో ఈ సినిమాపై భారీ అంచనాలు పెరిగాయి. తాజాగా ఓ సినిమాకు సంబంధించిన ఓ క్రేజీ అప్డేట్ అంటూ..నెట్టింట్లో ఓ వార్త తెగ వైరల్ అవుతోంది. ఇంతకీ మ్యాటరేంటో మీరు కూడా ఓ లూక్కేయండి.
మహేష్ బాబు- రాజమౌళి కాంబోలో తెరకెక్కుతున్న సినిమా గ్లోబల్ అడ్వెంచర్ త్రిల్లర్ గా రూపొందిస్తున్నారట. ఇప్పటికే అందిన పలు అప్డేట్స్ ప్రకారం.. దక్షిణాప్రికాలోని అడవుల్లో ఈ సినిమా షూటింగ్ చేయనున్నారట. ఇప్పటికే జక్కన్న.. మహేష్ బాబు కోసం భారీ లోకేషన్స్ వెతికినట్టు తెలుస్తోంది. గత నెల రోజుల క్రితం జక్కన్న ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ లోకేషన్ కోసం తెగ సెర్చ్ చేస్తున్నట్టు నెట్టింట్లో ఓ పోస్టు పెట్టిన విషయం తెలిసిందే. అలాగే.. ఫస్ట్ షెడ్యూల్ షూటింగ్ ను జర్మనీలో ప్రారంభం కానున్నట్టు తెలుస్తోంది.

ఇదెలా ఉంటే.. ఈ సినిమాలో సూపర్ స్టార్ మహేష్ బాబు లుక్ కూడా చాలా డిఫెరెంట్ గా ఉండబోతుంది. ఇందుకోసం ఆయన లాంగ్ హెయిర్, గుబురు గడ్డం, మీసాలతో సరికొత్త లుక్‌లోకి మారిపోయారు. ఇంతకు ముందు ఎప్పుడూ కనపడని రీతిలో ఇందులో మహేష్ బాబు కనిపించబోతున్నారట. దుర్గా ఆర్ట్స్‌పై కేఎల్ నారాయణ నిర్మించనున్నారు. ఈ సినిమా 2025లో ప్రారంభం కానున్నది. దాదాపు 1000 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కుతోన్న ఈ మూవీ లో దేశీ నటులతో పాటు విదేశీ నటులు కనిపించనున్నారు. అలాగే. ఈ సినిమా భారతీయ భాషలతో పాటు, విదేశీ భాషల్లోనూ అనువదించనున్నారు.
18 శతాబ్దంలో జరిగిన కథ ఆధారంగా రూపొందుతున్న పీరియడ్ డ్రామా మూవీలో బాలీవుడ్ హీరోయిన్, మాజీ మిస్ వరల్డ్ ప్రియాంక చోప్రా నటించనున్నారని ఫిల్మ్‌నగర్ వర్గాలు టాక్. ఈ క్రేజీ మూవీలో అధిక భాగం అడవుల్లో షూటింగ్ జరుగుతుందనీ,ఇదో ఫారెస్ట్ ఎడ్వెంచర్ మూవీ అని టాక్. ఈ మూవీ అరుదైన గిరిజన జాతికి సంబందించిన రిఫరెన్స్ లు ఉండబోతున్నాయని, వారికి సంబంధించిన కాస్ట్టూమ్స్ కూడా డిజైన చేయించబోతున్నారు. ఈ యాక్షన్ అడ్వెంచర్ సినిమాకి రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్ కథ అందించారు. ఇదిలా ఉంటే.. ఈ సినిమాలో మహేశ్‌బాబుకి జోడీగా నటించే హీరోయిన్ల జాబితాలో బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ, ఇండోనేషియా నటి చెల్సియా ఎలిజబెత్ ఇస్లాన్ వంటి వారి పేర్లు తెరపైకి వచ్చాయి. తాజాగా ప్రియాంకా చోప్రా హీరోయిన్ గా నటించే అవకాశమున్నట్టు టాక్.

ప్రముఖ సింగర్, యాక్టర్ నిక్ జోనాస్‌తో వివాహం తర్వాత ప్రియాంక అమెరికాలో స్థిరపడింది. ప్రస్తుతం హాలీవుడ్ సినిమాలపైనే ఫోకస్ పెడుతున్నారు. ఇటీవల 'సిటాడెల్ ' అనే వెబ్ సీరిస్ కు కొనసాగింపుగా వస్తున్న సిటాడెల్ సీజన్ 2లో కూడా నటిస్తున్నారు. ఇప్పటికీ వరకు ఈ బ్యూటీ సౌత్ సినిమాల్లో నటించలేదు. గతంలో రామ్‌చరణ్‌కి జోడీగా 'జంజీర్'(2013) సినిమాలో నటించినప్పటికీ అది స్ట్రైట్ బాలీవుడ్ మూవీ. ప్రస్తుతం మహేశ్‌బాబు - రాజమౌళి కాంబో మూవీలో నటిస్తారన్న వార్త వైరల్ అవుతోంది. మరి ఈ భారీ బడ్జెట్ మూవీకి గ్రీన్ సిగ్నల్ ఇస్తారో? లేదో? వేచి చూడాలి.


Click it and Unblock the Notifications











