Don't Miss!
- News
టీఆర్ఎస్కు మును‘గోడు’: కూసుకుంట్లను వ్యతిరేకిస్తూ రచ్చ, ఓటమి ఖాయమంటూ వార్నింగ్
- Sports
లక్నో ఫ్రాంచైజీ గ్రూప్ కొన్న జట్టు తరఫున సౌతాఫ్రికా టీ20 లీగ్‌లో ఆడబోయే స్టార్లు వీరే..!
- Finance
Investments: చైనా, తైవాన్లలో పెట్టుబడులు పెట్టిన దేశీయ ఇన్వెస్టర్లకు కన్నీళ్లు.. ఎందుకంటే..
- Travel
దక్షిణ మధ్య రైల్వేలో విస్టాడోమ్ కోచ్‌తో నడిచే మొట్టమొదటి రైలు
- Technology
ఇన్స్టాగ్రామ్ వినియోగదారుల డేటాను ట్రాక్ చేస్తోంది!!
- Lifestyle
మీ జుట్టు ఒత్తుగా లేదా మెరుస్తూ ఉండాలనుకుంటున్నారా? వీటిని ఉపయోగించండి...
- Automobiles
బ్రేకింగ్ న్యూస్: మారుతి సుజుకి స్విఫ్ట్ సిఎన్జి Swift CNG విడుదల, ధర రూ.7.77 లక్షలు
Prabhas సినిమా కోసం 41 ఏళ్ళ బాలీవుడ్ బ్యూటీ.. హీరోయిన్ గానే?
రెబల్ స్టార్ ప్రభాస్ నుంచి రాబోయే తదుపరి సినిమాలు మామూలుగా ఉండవని అనిపిస్తోంది. బాహుబలి అనంతరం డార్లింగ్ వరుసగా నిరాశపరిచినప్పటికి నెక్స్ట్ సినిమాలతో మాత్రం తప్పకుండా బాక్స్ ఆఫీస్ వద్ద మంచి విజయాలను అందుకుంటాడు అనే ఇండస్ట్రీలో కూడా ఒక మంచి టాక్ అయితే ఏర్పడింది. ఇక ప్రస్తుతం ఓ వర్గం వారి ఫోకస్ మాత్రం సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో రానున్న స్పిరిట్ అనే సినిమా పైనే ఉంది. ఇక ఈ సినిమా కోసం ఒక బాలీవుడ్ డ్యూటీని దర్శకుడు ఇటీవల ఫైనల్ చేసినట్లుగా కొన్ని కథనాలు వెలువడుతున్నాయి. ఆ వివరాల్లోకి వెళితే..

మంచి డిమాండ్
సాహో రాధే శ్యామ్ సినిమాలు రెండు కూడా బాక్సాఫీస్ వద్ద తీవ్రంగా నిరాశపరచడంతో ప్రభాస్ నెక్స్ట్ సినిమాలతో ఎలాంటి రిజల్ట్ ను అందుకుంటాడు అనేది ఆసక్తికరంగా మారింది. ఒక విధంగా నెక్స్ట్ వచ్చే సినిమాలపై ఇంతకుముందు డిజాస్టర్ సినిమాల ప్రభావం ఎంత మాత్రం పడదు అని చెప్పవచ్చు. ఎందుకంటే ఆ ప్రాజెక్టులన్ని కూడా విభిన్నమైన కాన్సెప్ట్ లతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి. కాబట్టి మంచి డిమాండ్ అయితే ఏర్పడుతోంది.

బిగ్ బాలీవుడ్ మూవీ
ప్రభాస్ నుంచి తదుపరి సినిమా ఆదిపురుష్ రాబోతున్న విషయం తెలిసిందే. బాలీవుడ్ ప్రముఖ దర్శకుడు ఓం రావత్ దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమా పూర్తిగా రామాయణం ఆధారంగా తెరపైకి రాబోతోంది. ఈ సినిమాలో ప్రభాస్ రాముడి పాత్రలో నటించగా కృతి సనోన్ సీతమ్మ తల్లి పాత్రలో కనిపించబోతోంది. మరొకవైపు బాలీవుడ్ ప్రముఖుడు సైఫ్ అలీ ఖాన్ రావణాసుర పాత్రలో కనిపించబోతున్నాడు.

ఆ సినిమాలపై కూడా..
ఆదిపురుష్ సినిమా అనంతరం ప్రభాస్ నుంచి సలార్ అనే సినిమా రాబోతోంది. ఈ ప్రాజెక్టుపై కూడా అంచనాలు గట్టిగానే ఉన్నాయి కేజిఎఫ్ దర్శకుడు ప్రశాంత్ నీల్ తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో ప్రభాస్ రెండు విన్నమైన పాత్రల్లో కనిపించబోతున్నాడు. అలాగే మహానటి దర్శకుడు నాగ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న టైమ్ ట్రావెల్ యాక్షన్ అడ్వెంచర్ మూవీ పై కూడా అంచనాలు గట్టిగానే ఉన్నాయి.

పోలీస్ పాత్రలో ప్రభాస్
అయితే ఈ సినిమాల తర్వాత ప్రభాస్ అర్జున్ రెడ్డి దర్శకుడు సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో కూడా ఒక సినిమా చేసేందుకు ఒప్పుకున్న విషయం తెలిసిందే. ఆ సినిమాకు ముందుగానే స్పిరిట్ అనే టైటిల్ కూడా అనుకుంటున్నారు. ప్రభాస్ అందులో పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపిస్తాడని కూడా ముందుగానే దర్శకుడు ఒక క్లారిటీ చేశాడు.

ఆ సినిమాతో బిజీగా ఉంటూనే
అయితే స్పిరిట్ సినిమాలో ప్రస్తుతం వినిపిస్తున్న టాక్ ప్రకారం ఒక బాలీవుడ్ ప్రముఖ నటి కీలకపాత్రలో నటించేందుకు ఒప్పుకున్నట్లుగా తెలుస్తోంది. దర్శకుడు ప్రస్తుతం రణ్ బీర్ కపూర్ తో ప్రస్తుతం ఎనిమల్ అనే సినిమాను చిత్రీకరిస్తూనే మరొకవైపు ప్రభాస్ కు సంబంధించిన స్పిరిట్ సినిమా కోసం కొన్ని కీలకమైన పాత్రలు ఎంపికల విషయంలో కూడా నిర్ణయాలు తీసుకుంటున్నట్లు సమాచారం.

కరీనా కపూర్?
ఇటీవల దర్శకుడు సందీప్ రెడ్డి వంగ స్పిరిట్ సినిమా కోసం బాలీవుడ్ ప్రముఖ బ్యూటీ కరీనాకపూర్ ను సంప్రదించినట్లు తెలుస్తోంది. ఈ 47 ఏళ్ళ బ్యూటీని కేవలం హీరోయిన్ పాత్ర కోసమే సెలెక్ట్ చేసుకున్నారా లేక మరేదైనా ముఖ్యమైన పాత్ర కోసం అనుకుంటున్నారా అనే విషయంలో అయితే ఇంకా క్లారిటీ రాలేదు. కానీ దాదాపు ఆమె మాత్రం సినిమాలో భాగం కాలినట్లుగా బాలీవుడ్ మీడియాలో కథనాలు వెలబడుతున్నాయి. మరి ఇది ఎంతవరకు నిజమో తెలియాలి అంటే అఫీషియల్ క్లారిటీ వచ్చేవరకు ఆగాల్సిందే.