Ram Charan: రామ్ చరణ్‌తో జతకట్టబోతున్న జూనియర్ ఎన్టీఆర్ హీరోయిన్.. ఏ సినిమాకో తెలుసా?
మెగా పవర్ స్టార్, గ్లోబర్ స్టార్ రామ్ చరణ్ గురించి తెలుగు సినీ ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అద్భుతమైన నటనతో అందరినీ ఆకట్టుకుంటున్న ఈయన.. ఆర్ఆర్ఆర్ తర్వాత గ్లోబస్ స్టార్ గా మారిపోయారు. ముఖ్యంగా ఆర్ఆర్ఆర్ సినిమా తర్వాత ఆయన చేసే సినిమాపై పెద్ద ఎత్తున అంచనాలు నెలకొన్నాయి. ముఖ్యంగా ప్రస్తుతం ఆయన గేమ్ ఛేంజర్ సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ కూడా పూర్తి కాకముందే నెక్ట్స్ సినిమా గురించి పెద్ద ఎత్తున చర్చ సాగుతోంది. రామ్ చరణ్ గేమ్ ఛేంజర్ సినిమా 16వ ది కాగా.. నెక్స్ట్ రాబోయేది RC17.
అయితే ఈ సినిమాను కూడా పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కించబోతున్నారు. ఉప్పెన సినిమాతో తన టాలెంట్ ను ప్రూవ్ చేసుకున్న డైరెక్టర్ సానా బుచ్చిబాబు ఈ చిత్రానికి దర్శకత్వం వహించబోతున్నట్లు పెద్ద ఎత్తున ప్రచారం సాగుతోంది. అలాగే లెజండరీ మ్యూజిక్ డైరెక్టర్ ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్నారని అంతా అనుకుంటున్నారు. ఇప్పటికే గేమ్ ఛేంజర్ సినిమా షూటింగ్ 90 శాతానికి పైగా పైగా పూర్తి కాగా... త్వరలోనే ఈ సినిమాను పట్టాలెక్కించాలని చిత్రబృందం ప్లాన్ చేస్తోందట. అయితే తాజాగా ఈ సినిమాకు సంబంధించి మరో లేటెస్ట్ అప్ డేట్ వెలుగులోకి వచ్చింది.

ఈ సినిమాలో రామ్ చరమ్ సరసన... బాలీవుడ్ బ్యూటీ నటించబోతున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ హీరోగా రాబోతున్న దేవర సినిమాలో నటిస్తున్న.. అలనాటి అందాల తార శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్ నటించబోతున్నారని టాక్ నడుస్తోంది. అయితే బాలీవుడ్ లోనే ఎక్కువ చిత్రాలు చేసి స్టార్ హీరోయిన్ గా మారాలని అనుకుంటున్న జాన్వీ కపూర్ కు.. పాన్ ఇండియాలో అదీ గ్లోబర్ స్టార్ సరసన అనే సరికి ఆమె ఓకే చెప్పినట్లు చర్చ నడుస్తోంది. ఇప్పటికే తెలుగులో ఒక చిత్రం చేస్తున్న ఈమెకు చెర్రీతో చేయబోయేది రెండో సినిమా.
అయితే ఈ సినిమాకు సంబంధించిన అప్ డేట్లను అధికారికంగా వెల్లడించకపోయినప్పటికీ.. త్వరలోనే ప్రకటిస్తారని సమాచారం. RC17 సినిమాలో రామ్ చరణ్ పక్కన హీరోయిన్ గా నటించేందుకు చాలా మంది హీరోయిన్ల పేరును పరిశీలించినప్పటికీ... జాన్వీ కపూర్ కే ఈ అవకాశం దక్కింది. ముఖ్యంగా కుర్ర హీరోయిన్ గా ఉన్న ఈమె.. చెర్రీతో రొమాన్స్ బాగా చేస్తుందని టాక్ నడుస్తోంది. అంతేకాదండోయ్ ఈ సినిమాలో రామ్ చరణ్ డబుల్ యాక్షన్ చేయబోతున్నట్లు సమాచారం.

అలాగే రామ్ చరణ్ పక్కన నటించేందుకు ఈ బాలీవుడ్ భామ పెద్ద ఎత్తున పారితోషికం తీసుకుంటుందని తెలుస్తోంది. దాదాపు 5 కోట్ల వరకూ ఈమె పుచ్చుకోబోతున్నట్లు సమాచారం. అలాగే దేవర సినిమా కోసం కూడా ఈమె 5 కోట్ల రెమ్యునరేషన్ అందుకుంటుందట. బాలీవుడ్ లో కేవలం 3.5 కోట్ల రూపాయలు మాత్రమే తీసుకునే ఈ ముద్దుగుమ్మ టాలీవుడ్ కు వచ్చి బాగానే సంపాధించుకుంటోంది. మరి పూర్తి వివరాలు తెలియాలంటే మాత్రం ఇంకా కొంత కాలం ఆగాల్సిందే.


Click it and Unblock the Notifications











