మెగా హీరోను పడేసేందుకు పాట్లు పడుతున్న అందాల తార.. ఆమె క్యారెక్టర్ అదేనట!
టాలీవుడ్, బాలీవుడ్ ప్రేక్షకులకు సుపరిచితమైన హీరోయిన్ కియారా అద్వానీ. ఇటీవలే తెలుగు తెరపై కాలుమోపి మహేష్ బాబుతో భరత్ అనే నేను సినిమాలో, రామ్ చరణ్‌తో వినయ విధేయ రామ సినిమాలో రొమాన్స్ చేసిన ఈ ముద్దుగుమ్మ ప్రస్తుతం బాలీవుడ్ బిజీలో ఉంది. అందం, అభినయం రెండూ పుష్కలంగా ఉన్న ఈ భామ.. అక్కడ వరుస అవకాశాలు అందుకుంటూ ప్రేక్షక లోకాన్ని ఫిదా చేస్తోంది.
కాగా తాజా సమాచారం మేరకు కియారా అద్వానీ తిరిగి తెలుగు తెరపై మెరిసేందుకు రెడీ అవుతోందట. మరోసారి మెగా హీరోతోనే రొమాన్స్ చేసేందుకు సై అంటోందట. మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ సరసన నటించేందుకు ఆమె గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లుగా సమాచారం. మళ్ళీ మెగా హీరోతో సినిమా అనగానే ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా కియారా ఓకే చెప్పేసిందని ఫిలిం నగర్‌లో టాక్ వినిపిస్తోంది. ఇందులో వరుణ్‌ని పడేసేందుకు తెగ పాట్లు పడే యువతిగా కియారా నటించనుందట.

అల్లు బాబీ సమర్పణలో వరుణ్ తేజ్ హీరోగా రూపొందనున్న సినిమా కోసం లస్ట్ భామను సంప్రదించినట్లు తెలుస్తోంది. కిరణ్ కొర్రపాటి దర్శకత్వం వహించే ఈ సినిమాలో వరుణ్ తేజ్ బాక్సర్‌గా కనిపించనున్నాడు. ఇటీవలే గద్దలకొండ గణేష్ రూపంలో ప్రేక్షకులను మెస్మరైజ్ చేసిన వరుణ్.. ఈ పాత్ర కోసం స్పెషల్ కేర్ తీసుకుంటున్నారట. ఇందుకోసం బాక్సర్‌గా శిక్షణ కూడా మొదలు పెట్టేశాడు వరుణ్. అతిత్వరలో ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుంది.
మెగా ప్రిన్స్ సరసన హీరోయిన్ కియారా అనే వార్త మెగా అభిమానుల్లో జోష్ నింపుతోంది.


Click it and Unblock the Notifications











