twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    వెయ్యేళ్ళ క్రితం నాటి భయంకరమైన రాజు పాత్రలో రామ్ చరణ్.. కానీ ఒక సమస్య?

    |

    మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ RRR సినిమా విజయంతో ఒక్కసారిగా బాలీవుడ్ ఇండస్ట్రీలో కూడా హాట్ టాపిక్ గా మారిపోయాడు. దర్శక ధీరుడు రాజమౌళి డైరెక్ట్ చేసిన RRR సినిమా ద్వారా జూనియర్ ఎన్టీఆర్ తో పాటు రామ్ చరణ్ పాత్ర కూడా అన్ని వర్గాల ప్రేక్షకును ఎంతగానో ఆకట్టుకుంది. అతను చేసిన సీతారామరాజు క్యారెక్టర్ కు బాలీవుడ్ ఆడియన్స్ కూడా ఎంతగానో కనెక్ట్ అయ్యారు. అయితే ఆ సినిమా అనంతరం రామ్ చరణ్ కు బాలీవుడ్ ఇండస్ట్రీ నుంచి కూడా మంచి ఆఫర్ వస్తున్నట్లు తెలుస్తోంది. ఇక రీసెంట్ గా వెయ్యేళ్ళ క్రితం నాటి భయంకర రాజు కథ కూడా చర్చల్లోకి వచ్చినట్లు సమాచారం. ఆ వివరాల్లోకి వెళితే..

    మంచి క్రేజ్

    మంచి క్రేజ్

    రాజమౌళి తెరకెక్కించిన RRR సినిమాలో రామ్ చరణ్ తేజ్ అల్లూరి సీతారామ రాజు పాత్రలో ఏ విధంగా నటించాడో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అయితే ఒకవిధంగా నార్త్ జనాల్లో ఆ క్యారెక్టర్ చాలా వరకు కూడా శ్రీరాముడి పాత్ర తరహాలో కనెక్ట్ అయిపోయింది. సౌత్ ఇండస్ట్రీ లో హిందూ సాంప్రదాయాలకు అలాగే మహారాజులను ఈ విధంగా గౌరవిస్తారు అని, బాలీవుడ్లో మాత్రం కించపరిచే విధంగా సినిమాలు తీస్తారు అని కామెంట్స్ కూడా వచ్చాయి.

    దేశవ్యాప్తంగా

    దేశవ్యాప్తంగా

    ఏదేమైనప్పటికీ కూడా RRR సినిమా ద్వారా జూనియర్ ఎన్టీఆర్ తో పాటు రామ్ చరణ్ పేరు కూడా దేశవ్యాప్తంగా మారుమ్రోగిపోయింది. ఇక వీరి తదుపరి సినిమాలు ఎలా ఉంటాయి అనేది కూడా ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది. కేవలం సౌత్ లో మాత్రమే కాకుండా ఇతర ఇండస్ట్రీలో కూడా వీరికి మంచి డిమాండ్ ఏర్పడింది. తప్పకుండా తదుపరి సినిమాలు ఒక మంచి మార్కెట్ అయితే క్రియేట్ అవుతుంది అని చెప్పవచ్చు.

    ఆ దర్శకుడితో కూడా..

    ఆ దర్శకుడితో కూడా..

    ప్రస్తుతం రామ్ చరణ్ శంకర్ దర్శకత్వంలో తన 15వ సినిమాను పూర్తి చేసే పనిలో బిజీగా ఉన్నాడు. ఈ సినిమాపై అంచనాలు అయితే భారీగానే ఉన్నాయి. వచ్చే ఏడాది సమ్మర్లో ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చే అవకాశం ఉంది. అలాగే రామ్ చరణ్ గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో కూడా ఓ సినిమా చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఈ ప్రాజెక్టుకు సంబంధించిన స్క్రిప్టు పనులు శరవేగంగా జరుగుతున్నాయి.

    భయంకరమైన రాజు కథ

    భయంకరమైన రాజు కథ

    అలాగే రామ్ చరణ్ తేజ్ చారిత్రాత్మక నేపథ్యం ఉన్న కథలలో కూడా నటించే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. ప్రస్తుతం బాలీవుడ్ ఇండస్ట్రీలో అందుకు సంబంధించిన ఒక టాక్ కూడా వైరల్ గా మారుతోంది. టీ సీరీస్ అలాగే బాలీవుడ్ కు చెందిన ఒక ప్రముఖ నిర్మాత వెయ్యేళ్ళ క్రితం నాటి సుహల్ దేవ్ కు సంబంధించిన ఒక భయంకరమైన రాజు కథను తెరపైకి తీసుకురావాలని అనుకుంటున్నారట.

    నెగిటివ్ షేడ్స్

    నెగిటివ్ షేడ్స్

    1030 కాలానికి చెందిన సహల్ దేవ్ బయోపిక్ ను గతంలోనే కొంతమంది బాలీవుడ్ హీరోలు చేయాలని అనుకున్నారు. కానీ కొన్ని భయంకరమైన నెగిటివ్ షేడ్స్ ఉండడంతో రిస్క్ చేయలేకపోయారు. కానీ కానీ అతని ధైర్యసాహసాలను ఎక్కువగా హైలెట్ చేసి సినిమాను తెరపైకి తీసుకు వస్తే తప్పకుండా సక్సెస్ అవుతుందని ఆలోచిస్తున్నారట.

    ఆ విధంగా చరిత్రలో గుర్తింపు

    ఆ విధంగా చరిత్రలో గుర్తింపు

    అప్పట్లో సామంత రాజుగా ఉన్నప్పటికీ అతను ఏకంగా 1036లో ఘాజి మియన్ దండయాత్రకు ఎదురు తిరిగి చరిత్రకు ఎక్కాడు. ఆ రాజు గురించి ఎన్నో పవర్ఫుల్ శాసనాలు ఉండడంతో తప్పకుండా సినిమా వర్కవుట్ అవుతుందని ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. ఇక ఆ రాజు పాత్రకు రామ్ చరణ్ అయితే బాగుంటాడు అని చర్చలు స్టార్ట్ చేశారట. ఇంకా రామ్ చరణ్ వరకు ఈ ప్రస్తావన రాలేదని సమాచారం..ఒకవేళ ఆఫర్ వస్తే రామ్ చరణ్ ఆ ప్రాజెక్ట్ చేసేందుకు ఒప్పుకుంటాడో లేదో చూడాలి.

    English summary
    Bollywood big production house focus on Ram charan for historical project..
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X