ఎక్స్‌ట్రా ఇన్‌కమ్ కోసం ఆ పని .. స్టార్ హీరోయిన్ల చూపంతా దానిపైనే?

రంగుల ప్రపంచం లాంటి సినీ రంగంలో ఎవరి జీవితం ఎప్పుడు ఏ మలుపు తిరుగుతుందో చెప్పడం కూడా కష్టం. బ్లాక్ అండ్ వైట్ రోజుల్లో కోట్ల రూపాయలు సంపాదించి, చివరి రోజుల్లో అత్యంత దీనస్థితిలో ప్రాణాలు వదిలిన స్టార్స్ గురించి నేటి తరానికి బాగా తెలుసు. తమ సీనియర్స్ చేసిన తప్పులను చేయకుండా ఆర్ధిక క్రమశిక్షణ పాటిస్తున్నారు. దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలని ముందు నుంచే జాగ్రత్తలు పాటిస్తుననారు.

రెమ్యునరేషన్‌తో పాటు బ్రాండ్ అండార్స్‌మెంట్స్‌ ద్వారా కోట్ల రూపాయలు సంపాదిస్తున్న మన సినీతారలు ఆ డబ్బును తెలివిగా పెట్టుబడుల్లోకి మళ్లిస్తున్నారు. షేర్లు, బంగారంతో పాటు మన తారల చూపు రియల్ ఎస్టేట్‌పై ఉంటుంది. దేశ విదేశాల్లోని ప్రఖ్యాత సంస్థల వెంచర్లలో పెట్టుబడులు పెట్టడంతో పాటు కమర్షియల్ కాంప్లెక్స్‌ల నిర్మాణం వైపు వెళ్తున్నారు. ఇంకొందరైతే ఎకరాలకు ఎకరాలే కొనిపారేస్తున్నారని ఫిలింనగర్ టాక్.

bollywood celebraties who have invested in the real estate here s the details

టాలీవుడ్ నుంచి బాలీవుడ్ వరకు మన తారలంతా రియల్ ఎస్టేట్ వైపు అడుగులు పెడుతున్నారు. ముంబై, ఢిల్లీ, బెంగళూరు, కోల్‌కతా, హైదరాబాద్, చెన్నై, పూణే వంటి మెట్రో సిటీలలో పెట్టుబడులు పెట్టేందుకు పలు ప్రాంతాలను ఎంచుకుంటున్నారు. ఇక్కడ ఇన్వెస్ట్ చేస్తే భవిష్యత్తులో భారీ లాభాలను అందుకోవచ్చని తారలు భావిస్తున్నారు. టాలీవుడ్ కంటే బాలీవుడ్ స్టార్స్ ఈ విషయంలో ముందు చూపుతో ఆలోచిస్తున్నారట. మరి అలాంటి వారు ఎవరో చూస్తే :

బాలీవుడ్ బిగ్‌బీ అమితాబ్ బచ్చన్ గడిచిన నాలుగేళ్లు రియల్ ఎస్టేట్ సెక్టార్‌లో అత్యధికంగా రూ. 200 కోట్లకు పైగా పెట్టుబడులు పెట్టారట. ఆ తర్వాత అతిలోక సుందరి శ్రీదేవి కుమార్తె జాన్వీ కపూర్ రూ. 170 కోట్లు, రణవీర్ సింగ్ - దీపికలు రూ. 160 కోట్లు, అజయ్ దేవగణ్ దంపతులు (రూ.110 కోట్లు), షాహిద్ కపూర్ రూ. 59 కోట్లు పైగా రియల్ ఎస్టేట్‌లో పెట్టినట్లు బీటౌన్ మీడియా చెబుతోంది.

ఇక యానిమల్‌తో నేషనల్ క్రష్‌గా అవతరించిన హాట్ బాంబ్ తృప్తి దిమ్రి కూడా పెట్టుబడులు పెంచేసిందట. దీనిలో భాగంగా గతేడాది జూన్‌లో ముంబైలో ఓ లగ్జరీ బిల్డింగ్ కొనుగోలు చేసిందట. దీని విలువ రూ . 20 కోట్ల పైనే ఉంటుందట. ఇది కాకుండా పలు ప్రాంతాల్లోనూ భూములు, ఇతర ఇస్తులపై కోట్ల రూపాయలను ఇన్వెస్ట్ చేశారట తృప్తి. ఇక తెలుగు వారి విషయానికి వస్తే నట భూషణ శోభన్ బాబు సలహా మేరకు మురళీ మోహన్ ఏళ్ల క్రితమే రియల్ ఎస్టేట్‌లో దిగి కోట్లాది రూపాయల వ్యాపారం చేస్తున్నారు.

ఆయన అడుగుజాడల్లో ఎంతో మంది హీరో హీరోయిన్లు, నటీనటులు తమ సంపాదనను రియల్ ఎస్టేట్‌లో పెడుతున్నారట. రాబోయే రోజుల్లో ఈ నెంబర్ మరింత పెరిగే అవకాశం ఉందని విశ్లేషకులు అంటున్నారు. మిగిలిన ఏ రంగంలోనైనా నష్టభయం ఎక్కువగా ఉండటం, రియల్ ఎస్టేట్‌లో ఆస్తి మన చేతుల్లోనే ఉండటం వంటి కారణాలతో ఇటు వైపు ఎక్కువ మంది సెలబ్రెటీలు ఆకర్షితులవుతున్నారు.

More from Filmibeat

Read more about: bollywood investments movie news
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X