Don't Miss!
- News
ఆ నియోజకవర్గాల్లో వైసీపీదే హవా, కానీ - తాజా సర్వేలో కీలక అలర్ట్స్..!?
- Finance
Gautam Adani: ఆ వ్యసనానికి బానిసైన గౌతమ్ అదానీ..! ఒప్పుకున్న బిలియనీర్..
- Automobiles
అమ్మకాల్లో కొత్త మైలురాయి చేరుకున్న TVS iQube: ఈ ఏడాది మరింత పెరిగే అవకాశం..
- Lifestyle
Chanakya Niti: ఈ వ్యక్తులను ఎప్పుడూ సాయం అడగొద్దు, మంచి కంటే చెడే ఎక్కువ జరుగుతుంది
- Sports
IND vs NZ: స్టార్ స్పోర్ట్స్‌పై మండిపడ్డ రోహిత్ శర్మ.. ఎందుకంటే?
- Technology
ఇండియా సొంత మొబైల్ OS, BharOS ను మీ ఫోన్లో అప్డేట్ చేయవచ్చా? తెలుసుకోండి.
- Travel
రథసప్తమికి ముస్తాబవుతోన్న అరసవల్లి సూర్యదేవాలయం!
అల్లు అర్జున్ తో మీటింగ్ సెట్ చేసిన బాలీవుడ్ దర్శకుడు.. ఒకేసారి నలుగురు హీరోలు?
స్టైలిష్ స్టార్ నుంచి ఐకాన్ స్టార్ గా తనకంటూ ఒక ప్రత్యేకమైన స్టార్ ఇమేజ్ ను సంపాదించుకున్న అల్లు అర్జున్ పుష్ప సెకండ్ పార్ట్ తో ప్రస్తుతం పవర్ఫుల్ గా రెడీ అవుతున్నాడు. సుకుమార్ దర్శకత్వంలో తెరపైకి రాబోతున్న ఈ సినిమా షూటింగ్ త్వరలోనే మొదలుకానుంది. అయితే పుష్ప పార్ట్ 1 ను రష్యాలో అక్కడి స్థానిక భాషలో విడుదల చేస్తున్నట్లు క్లారిటీ ఇచ్చిన విషయం తెలిసిందే.
అయితే ఆ భాషలో ప్రత్యేకంగా చిత్ర యూనిట్ అందరు కూడా ప్రమోషన్ చేసేందుకు రష్యా వెళ్లడం కూడా హైలెట్గా నిలిచింది. అక్కడ అల్లు అర్జున్ టీంకు మంచి రెస్పాన్స్ కూడా అందుతుంది. ఇక ప్రస్తుతం అల్లు అర్జున్ కు సంబంధించిన మరొక ఆసక్తికరమైన వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. రాబోయే రోజుల్లో అల్లు అర్జున్ బాలీవుడ్ ప్రముఖ దర్శకులతో కూడా వర్క్ చేయబోతున్నట్లు తెలుస్తోంది.

ఇదివరకే కొన్నిసార్లు సంజయ్ లీలా భన్సాలితో కూడా అల్లు అర్జున్ చర్చలు జరిపాడు. ఇక ప్రస్తుతం బాలీవుడ్ కమర్షియల్ దర్శకుడు రోహిత్ శెట్టితో కూడా అతను సినిమా చేసే అవకాశాలు ఉన్నట్లుగా తెలుస్తోంది. అల్లు అర్జున్ తో అతను బిగ్ మల్టీస్టారర్ సినిమాను ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. బన్నీతో చేయబోయే సినిమాలో బాలీవుడ్ ప్రముఖ హీరో రణ్వీర్ సింగ్ తో పాటు తమిళ హీరో కార్తీ కూడా నటించే అవకాశం ఉందట.

అంతేకాకుండా అజయ్ దేవగన్ కూడా ఒక ప్రత్యేకమైన గెస్ట్ పాత్రలో కనిపించబోతున్నట్లుగా తెలుస్తోంది. గతంలోనే కొంతమంది బాలీవుడ్ నిర్మాతలు కూడా అల్లు అర్జున్ తో సినిమా చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నట్లు క్లారిటీ ఇచ్చారు. ఇక ఇప్పుడు రోహిత్ శెట్టి కూడా అల్లు అర్జున్ రష్యా నుంచి రాగానే మీటింగ్ ఏర్పాటు చేయబోతున్నట్లు తెలుస్తోంది. ముందుగా కథ విషయంలో ఒక నిర్ణయానికి వచ్చిన తర్వాత అధికారికంగా క్లారిటీ ఇచ్చే అవకాశం అయితే ఉంది. అల్లు అర్జున్ పుష్ప సెకండ్ పార్ట్ తర్వాత అంతకుమించి అనే స్థాయిలో మరో సినిమా చేయాలని అయితే ఆలోచిస్తున్నాడు. ప్రస్తుతం కూడా అతను కొన్ని కథల గురించి చర్చలు జరుపుతున్నాడు. మరి ఏ దానికి అతను గ్రీన్ సిగ్నల్ ఇస్తాడో చూడాలి.