సెట్లో స్టార్ హీరో మానభంగ ప్రయత్నం.. చాచికొట్టిన హీరోయిన్ శ్రద్దాకపూర్!

ఎప్పుడూ వివాదాస్పద ట్వీట్‌లతో వార్తల్లో నిలిచే బాలీవుడ్ ఫిల్మ్ క్రిటిక్ ఉమైర్ సంధు ఈసారి మరోసారి బాంబు పేల్చాడు. యంగ్ హీరో రణబీర్ కపూర్, శ్రద్ధాకపూర్‌లను ఈసారి టార్గెట్ చేశాడు. స్పెయిన్‌లో వీరిద్దరి మధ్య ఇలా జరిగిందంటూ ఓ ట్వీట్ వదిలాడు. ప్రస్తుతం ఇది సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇంతకీ ఉమైర్ సంధు ఏం ట్వీట్ చేశాడు, అసలు రణబీర్- శ్రద్ధల మధ్య ఏం జరిగిందో పరిశీలిస్తే :

బాలీవుడ్‌లో ఫిల్మ్ క్రిటిక్‌గా ఫేమస్ అయిన ఉమైర్ సంధు గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. బడా సినిమాలకు అందరికంటే ముందే రివ్యూలు చెప్పేస్తూ బాగా పాపులర్ అయ్యాడు. మనోడు చెప్పిన రివ్యూలు బాగా కనెక్ట్ అయిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఉమైర్ సంధును ఫాలో అయ్యే వారి సంఖ్య కూడా ఎక్కువే. సినిమాలేం లేకపోతే ఏం తోచదు కాబోలు.. అందుకే స్టార్ సెలబ్రెటీలే టార్గెట్‌గా సంచలన వ్యాఖ్యలు చేస్తూ లైమ్ లైట్‌లో ఉంటుంటాడు.

Bollywood film critic Umair Sandu made tweet against ranbir Kapoor and shraddha Kapoor here s the details

బాలీవుడ్డే కాదు.. ఇండియాలోని ఏ ఇండస్ట్రీని ఉమైర్ సంధు వదిలిపెట్టడు. మొన్నామధ్య ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గురించి ఉమైర్ సంధు చేసిన ట్వీట్ చర్చనీయాంశమైంది. బీన్నీ కారణంగా పుష్ప సెట్ నుంచి రష్మిక కోపంగా వెళ్లిపోయిందని , ఆమెను ఘోరంగా అవమానించడం వల్లే ఇలా జరిగిందంటూ రాసుకొచ్చాడు. దీంతో ఉమైర్ సంధూపై బన్నీ ఫ్యాన్స్ ఫైర్ అయ్యారు. రష్మిక అసలు షూటింగ్‌లోనే లేరని, చెన్నైలో ఉన్నారని ఏదైనా చెబితే నమ్మేలా ఉండాలంటూ గడ్డి పెట్టారు.

రీసెంట్‌గా బాలీవుడ్ స్టార్ కపుల్ అభిషేక్ బచ్చన్ - ఐశ్వర్యరాయ్‌లు విడాకులు తీసుకున్నారంటూ ఉమైర్ ట్వీట్ చేయడం కలకలం రేపింది. ఇప్పటికే ఈ జంట విడాకులు తీసుకుందంటూ రూమర్స్ వస్తున్న వేళ దానికి ఉమైర్ ట్వీట్ మరింత ఆజ్యం పోసింది. మళ్లీ యథాప్రకారం నెటిజన్లు అతనికి గట్టి కౌంటరిచ్చి నోరు మూయించారు. అయినప్పటికీ ఉమైర్ బుద్ధి మాత్రం మారలేదు ఈసారి ఏకంగా యువ హీరో రణబీర్ కపూర్ , స్టార్ హీరోయిన్ శ్రద్ధ కపూర్‌లను టార్గెట్ చేశాడు.

'' బ్రేకింగ్ న్యూస్.. స్పెయిన్‌లో జరుగుతున్న తుజూతి మై మక్కార్ మూవీ షూటింగ్‌ సమయంలో రణబీర్ కపూర్‌ని శ్రద్ధా కపూర్ చాచికొట్టింది. శ్రద్ధను పక్కలోకి లాగాలని అతను తీవ్రంగా ప్రయత్నించాడు.. ఒకానొక దశలో రణబీర్ ఆమెను రేప్ చేయబోయాడు. బాలీవుడ్‌లోనే నెం.1 సెక్స్ ఎడిక్ట్ రణబీర్ కపూరేనంటూ '' ఉమైర్ ట్వీట్ చేశాడు. ప్రస్తుతం ఇది సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా నెటిజన్లు ఆయనపై మండిపడుతున్నారు. దీనిపై రణబీర్, శ్రద్ధాలు స్పందించాల్సి ఉంది.

కాగా తు జూతి మై మక్కర్ మూవీని లవ్ రంజన్ డైరెక్ట్ చేశారు. ఇందులో రణబీర్ తల్లిదండ్రులుగా డింపుల్ కపాడియా, బోనీ కపూర్‌లు నటించగా.. ముంబై, ఢిల్లీ, స్పెయిన్ తదితర ప్రదేశాల్లో షూటింగ్ జరుపుకుంది. రూ.200 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ సినిమా పర్వాలేదనిపించుకుంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X